For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు ఎందుకు ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తారు? రాశి చక్రాల ప్రభావం కారణమా?

|

పురుషులు ఎందుకు ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తారు? రాశి చక్రాల ప్రభావం కారణమా?

ఒక కుటుంబాన్ని నడిపే బాద్యతను తీసుకున్నప్పుడు, తెలిసో తెలియకో ఎదో ఒక సందర్భంలో లేదా తరచుగానైనా పురుషులు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం సర్వ సాధారణం. ముఖ్యంగా మహిళలకు పురుషులకు మద్య ఈ ఆధిపత్య పోరాటం అనేది శతాబ్దాలుగా జరుగుతున్న ప్రధాన అంశం.

What Makes Men Control Over You, As Per Astrology

అయినా నేటి ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల నేపధ్యంలో, తమ స్థానాన్ని నిరూపించుకునే క్రమంలో భాగంగా ఎక్కువగా పురుషులు ఆధిపత్య ధోరణి ప్రదర్శించుటకు సిద్దంగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రవేత్తల నమ్మకం ప్రకారం ఇలాంటి ఆధిపత్య ధోరణి ప్రదర్శించడానికి రాశి చక్రాల ప్రభావాలే ప్రధాన కారణం. ఆశ్చర్యంగా ఉందా?

ఇక్కడ, ఈ వ్యాసంలో, వారి రాశిచక్రాల సంకేతాల ఆధారంగా వారు ప్రబలంగా వ్యవహరించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారో, రాశి చక్రాల ఆధారంగా తెలుపడం జరిగినది.

మేషం: మార్చి 21 - ఏప్రిల్ 19

మేషం: మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశికి చెందిన పురుషులు సమాజంలో తమకున్న ఉత్తమ స్థానాన్ని ఇష్టపడతారు. దీనికి కారణం ప్రధానంగా వీరిలో కుజ గ్రహ అనుగ్రహం ఎక్కువగా ఉండడమే. అత్యున్నత స్థాయిలో ఉండుటకై, ఎల్లప్పుడూ పట్టుదలతో కూడిన ప్రయత్నాలు చేస్తూ లక్ష్యసాధన వైపుకు అడుగులు వేస్తుంటారు. తద్వారా వీరు ఏ విషయములో కూడా సర్దుకునిపోయే మనస్తత్వాన్ని ప్రదర్శించరు. మరియు తమ మార్గంలో మహిళలు అడ్డురావడాన్ని అస్సలు సహించలేరు. ఈ క్రమంలో భాగంగానే ఆధిపత్య ధోరణిని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఏది ఏమైనా వీరి విధి విధానాలనే అందరూ అనుసరించాలన్న ఆలోచన వీరిది.

వృషభం: ఏప్రిల్ 20 - మే 20

వృషభం: ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశికి చెందిన వారు మొండి పట్టుదలకు నిలువెత్తు రూపంగా ఉంటారు, తన కోరిక ప్రకారమే అన్నీ జరగాలన్న ఆలోచన వీరిది. వీరికి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరు వీరి మార్గంలోకి అడ్డం వచ్చినా సహించలేరు. వీరు ఆలోచించే ప్రతి అంశంలోనూ కుటుంబం ప్రధానంగా ఉంటుంది. కానీ కుటుంబంలో కూడా ఆధిపత్యం తమదే అయి ఉండాలన్న ఆలోచన వీరిది. తద్వారా మహిళలు వీరిని కోరే కోరికల విషయంలో ఎక్కువగా లేదు, కాదు అనే మాటలే సమాధానాలుగా ఇస్తుంటారు. మరోపక్కన తాము ఎక్కువగా ప్రేమించే విషయాల్లో తమ ఆలోచనలను సైతం మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు కానీ, అరుదైన సమయాల్లో మాత్రమే. ఎక్కువగా వీరు ప్రతికూల కోణంలోనే కనిపిస్తుంటారు.

మిధునం : మే 21- జూన్ 20

మిధునం : మే 21- జూన్ 20

మిధున రాశికి చెందిన వ్యక్తి ఆధిపత్య ధోరణి ప్రదర్శించరు. వీరు సరిహద్దులను గీసుకుని బ్రతికే వారు కాదు, సానుకూల దృక్పధంతో కూడిన ఆలోచనలు చేస్తూ అందరితో ప్రేమగా ఉంటారు. ఏది ఏమైనా తమ భాగస్వాముల కోరికలకు కాదు, లేదు అనే సమాధానాలు మాత్రం ఇవ్వరు.

కర్కాటకం: జూన్ 21- జూలై 22

కర్కాటకం: జూన్ 21- జూలై 22

కర్కాటక రాశికి చెందిన వ్యక్తి కాస్త గమ్మత్తుగా వ్యవహరిస్తుంటారు. మిమ్మల్నెవరూ నియంత్రించరు అంటూ మోసపూరిత హామీలను ఇస్తూ, తెలీకుండా సంబంధాలలో సరిహద్దులను నిర్మించి నియంత్రణను తన చేతుల్లోకి తీసుకోగలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఈ ఆటను గుర్తిoచే వరకు, మీకు ఎటువంటి అనుమానమూ రాదు. కానీ ఒక్కసారి మీరు నిజాన్ని గ్రహించగలిగితే, అపరాధభావన మిమ్ములను వెంటాడుతుంది. మరియు అవమానoగా భావిస్తారు. ఎంత మార్చాలని చూసినా చివరికి మిమ్ములను ఓటమే వెక్కిరిస్తుంది. అలాగని చెడ్డవారు కాదు, కేవలం ఆధిపత్య ధోరణి ప్రదర్శించే భాగంలో ఈపద్దతిని అనుసరిస్తారు.

సింహం : జులై 23-ఆగస్టు 23

సింహం : జులై 23-ఆగస్టు 23

సింహ రాశికి చెందిన వారు, సరిహద్దులను గీసుకుని జీవితాన్ని నడుపుటకు ఇష్టపడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో వారి ఆలోచనా ధోరణి, నియమాలను దాటి బయటకు వచ్చే ప్రయత్నం చేయరు.. తద్వారా ఆ నియమాలను ఉల్లంఘించే ప్రయత్నాలు ఎవరు చేసినా సహించలేరు, ముఖ్యంగా భాగస్వాముల పట్ల వీరి ఆధిపత్య ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఎల్లప్పుడూ వారిని నియంత్రించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు విశ్వసనీయతకు పట్టం కట్టే వారిలా ఉంటారు, కావున వీరి ప్రవర్తన సహజశైలిగానే ఉంటుంది కానీ, జీవితాన్ని ఆటగా చూసే వారు కాదు. తద్వారా మీ ప్రతిస్పందనల కోసం కూడా ఎదురుచూడరు. వారికి ఇష్టంలేని పని ఏదైనా చేసినప్పుడు, మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అంతేగానీ మాటలతో భాధించాలని చూడరు.

కన్య : ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

కన్య : ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

కన్యా రాశికి చెందిన వ్యక్తి కాస్త క్లిష్టమైన వ్యక్తిగా ఉంటారు. ఏ విషయంలో అయినా ప్రణాళికా బద్దమైన ఆలోచనలు చేసే వీరు, తమ చుట్టూతా అన్నీ విలువలతో కూడి, ఒక పద్దతిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ ఆలోచన అన్ని వేళలా అందరికీ సరిపోవు. తద్వారా తమ భాగస్వామికి సూచనలు ఎక్కువగా ఇస్తుంటారు. ఈ సూచనలు ఆధిపత్య పోకడలకు తార్కాణాలుగా ఉంటాయి. ఈ లక్షణాలకు ప్రధానంగా ఎక్కువగా గురయ్యేది భాగస్వామే కాబట్టి, ఎక్కువగా ప్రభావితమయ్యేది కూడా వారే.

తుల: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తుల: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తులా రాశికి చెందిన మనిషి సంబంధాల పట్ల అత్యంత నిబద్దతను కూడుకుని ఉంటాడు. తద్వారా మిగిలిన రాశుల కన్నా జీవితం పట్ల ఎక్కువ సరిహద్దులను కలిగి ఉంటాడు. కానీ ప్రేమ పట్ల గల అంకిత భావం ఈ సరిహద్దులను చేరిపేయగలదు కూడా. వీరు ఎక్కువగా తమ భాగస్వామి నుండి ప్రేమను, స్వేచ్చను కోరుకుంటారు. వీరు ఎంతగా ప్రేమిస్తారో, అనే ప్రేమను తిరిగి పొందాలన్న ఆలోచన వీరిది. అంతేకాకుండా ఒకరిపై ఆధారపడి జీవించడం కూడా వీరికి నచ్చదు. ఇలాంటి లక్షణాలు, ఆధిపత్య ధోరణి ప్రస్పుటంగా కనపడేలా చేస్తుంటాయి. ఒక్కోసారి వీరి ఆలోచనలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే కోపాన్ని ప్రదర్శించడం వంటివి చేస్తుంటారు, మరియు అత్యధిక భావోద్వేగాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక్కోసారి వీరు చెప్పాలనుకున్న విషయం కూడా పక్కదారి పట్టి, నలుగురికీ వ్యతిరేకంగానే అర్ధమవుతుంటారు. తల్లి దండ్రులను ఎంత ప్రేమిస్తారో, అంతే ప్రేమ భాగస్వామికి కూడా పంచుతారు.

వృశ్చికం: అక్టోబర్ 24 - నవంబరు 22

వృశ్చికం: అక్టోబర్ 24 - నవంబరు 22

వృశ్చిక రాశికి చెందిన వ్యక్తి మిగిలిన రాశి చక్రాలతో పోల్చినప్పుడు, అన్నిటికన్నా ఎక్కువగా నియంతృత్వ పోకడలు కలిగిన వ్యక్తిగా ఉంటారు. ఇతరులను తమకు విధేయులుగా ఉండాలని భావిస్తుంటారు. మరియు మీరు వారి సూచనలను పాటించాలని కూడా కోరుకుంటూ ఉంటారు. వారికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది, తద్వారా ఇతరులచే తమ పనులు చేయించాలన్న ఆలోచనలు చేస్తుంటారు.

ధనుస్సు : నవంబర్ 23 – డిసెంబర్ 22

ధనుస్సు : నవంబర్ 23 – డిసెంబర్ 22

ధనుస్సు రాశికి చెందిన వ్యక్తి ప్రతి విషయంలోనూ నియంత్రణ స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. తన దైనందిక జీవితంలో తనకు లభించే ప్రతి అంశాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటాడు. ఆ జీవితానికి ఎటువంటి ఆటు పోటులు కలిగినా సహించలేని వ్యక్తిత్వం వీరిది. తమ జీవిత పయనంలో భాగాస్వామి కూడా సరైన పాత్ర తీసుకోవాలని ఆశిస్తారు. తాము అనుకున్న లక్షణాలను భాగస్వామిలో చూడని పక్షంలో ఆత్మన్యూనతకు, అభాద్రతా భావానికి లోనవుతూ ఉంటారు. ఆధిపత్య ధోరణి అనేది వీరిలో కాస్త తక్కువగానే ఉంటుంది.

మకరం : డిసెంబర్ 23 – జనవరి 20

మకరం : డిసెంబర్ 23 – జనవరి 20

మకర రాశికి చెందిన వ్యక్తి తమ భాగస్వామి పట్ల ఎటువంటి ఆధిపత్య ధోరణిని ప్రదర్శించరు, కానీ భవిష్యత్ ప్రణాళికలలో భాగంగా కొన్ని నియమ నిబంధనలను మాత్రం సూచిస్తారు. వీరు ఎక్కువగా తమ కుటుంబం మరియు భాగస్వామి పట్ల జాగ్రత్తను, దూరదృష్టిని కలిగి ఉంటారు. ఒకవేళ తమ మాట వినని నేపద్యంలో త్వరితగతిన కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు.

కుంభం: జనవరి 21 - ఫిబ్రవరి 18

కుంభం: జనవరి 21 - ఫిబ్రవరి 18

మానసిక ప్రశాంతతకు, స్వేచ్చకు నిలువెత్తు రూపాలుగా ఉంటారు. తమ భాగస్వామి కూడా తనలాగే ఉండాలన్న కోరిక వీరిది. నియంత్రించడం వలన ప్రేమ పుట్టదని వీరికి తెలుసు. ఒకమంచి జీవన శైలి ఉండేలా ప్రణాళికలు చేస్తుంటారు. ఎటువంటి సమస్య వచ్చినా, అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తారు కాని , తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేయరు. వీరు ఎటువంటి క్లిష్టమైన పనుల్లో ఉన్నా, ఒక కన్ను తమ కుటుంబం మీద, భాగస్వామి మీద ఉండేలా ఉంటారు. వీరు మోసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. తమపట్ల మోస పూరిత ఆలోచనలు చేస్తున్నారని వీరి దృష్టికి వస్తే, వీరు తీసుకునే నిర్ణయాలు జీవిత కాలం కొనసాగుతాయి. అంతకు మించి ఎటువంటి ఆధిపత్య ధోరణి ప్రదర్శించే వారు కాదు.

మీనం: ఫిబ్రవరి 19-మార్చి 20

మీనం: ఫిబ్రవరి 19-మార్చి 20

మీనరాశికి చెందిన వారు కూడా భాగస్వామి పట్ల ఆధిపత్య ధోరణి కలిగి ఉండాలని, వారిని నియంత్రించాలని ఎప్పటికీ కోరుకోరు. మరియు ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉండేలా ప్రయత్నిస్తారు. నియంతృత్వ ధోరణి వీరికి ఒక చెడు విషయంగా ఉంటుంది. వీరు ఎక్కువగా జీవితంలో కొన్ని కోరికలను కలిగి ఉంటారు, ఆ కోరికలకు తగ్గట్లే తమ జీవితం నడవాలని భావిస్తుంటారు. అలా జరగని పక్షంలో కాస్త అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. కానీ, తమ భావాలను భాగస్వామితో పంచుకొనుటకు మాత్రం సిద్దంగా ఉండరు. సున్నితమైన భావోద్వేగాలకు కేంద్రంగా ఉంటారు.

English summary

What Makes Men Control Over You, As Per Astrology

There are some men who want to control a woman's freedom, for a variety of reasons, even to this day. This may be something that is related to their zodiac sign. According to astrology, we can reveal about how men of different zodiac signs can control their partners.Why Men Want To Control, As Per Zodiac
Story first published: Friday, May 18, 2018, 13:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more