రాశిచక్రాల ప్రకారం మీ చివరి జన్మలో మీరేంటో తెలుసుకునే వీలుందా ?

Subscribe to Boldsky

రాశిచక్రాల ప్రకారం మీ చివరి జన్మలో మీరేంటో తెలుసుకునే వీలుందా ? అనేకమంది నమ్మకాలప్రకారం ప్రతి ఒక్కరూ ఏడు జన్మలను పొందుతారు. ప్రతి జన్మ కూడా తమ ముందు జన్మతో సంబంధం లేకుండా ఉంటుంది. కానీ కొన్ని లక్షణాలు మాత్రం ఖచ్చితంగా వస్తుంటాయి. ఆ లక్షణాల ద్వారా ఇలా ఉండవచ్చు అని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెప్పగలరు.

ఎప్పుడైనా మీ చివరి జన్మ ఏమై ఉంటుందా అన్న అనుమానం వచ్చిందా?

What Were You In Your Past Life According To Your Zodiac Sign

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారి వారి వ్యక్తిగత అలవాట్ల ప్రకారం చివరి జన్మ ఏమిటో తెలుసుకునే అవకాశం ఉందని చెప్తుంది.

ఇప్పుడు చెప్పబోయే అంశాలన్నీ సూర్యమాన సిద్దాంతం ప్రకారం చెప్పబడినవి.

మేషం : మార్చి 21 – ఏప్రిల్ 19

మేషం : మార్చి 21 – ఏప్రిల్ 19

మీ క్రితం జన్మ మీనరాశి ఆధిపత్యాన ఉంటుంది, అనగా పరిమితులు, సరిహద్దులతో, భాద్యతలతో నిండి ఉంటుంది. ఈ రాశి చక్రంలో పుట్టిన వారు నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు. తద్వారా యోధునిలా లేదా రాజులా ఉండే అవకాశాలు ఉన్నాయి . ఎటువంటి స్థితిలో ఉన్నా దీరత్వాన్ని కోల్పోని విధంగా యోధునివలె ఉంటారు.

వృషభం : ఏప్రిల్ 20 – మే 20

వృషభం : ఏప్రిల్ 20 – మే 20

మీ క్రితం జన్మ మేషరాశి ఆధిపత్యంలో ఉంటుంది. తద్వారా కొంత శక్తిని క్రితం జన్మ నుండి కూడగట్టుకుని ఉంటుంటారు. తద్వారా ఎల్లప్పుడూ ఉత్సాహంగా నిత్య నూతనంగా కనిపిస్తూ ఉంటారు. క్రితం జన్మలో మీరు కాస్త సరిహద్దులను నిర్మించుకుని బ్రతికే వారిలా ఉంటారు, ఈ జన్మలో మీకు ఆ గుణం ఉన్నా , సరిహద్దులను అవసరాన్ని బట్టి విస్తరించే దిశగా ప్రణాళికలు చేస్తుంటారు. మీ రాశి ప్రకారం ఏదైనా సమూహానికి సంబంధించిన ఆటగారిలా ఉండే అవకాశాలు ఉన్నాయి. అనగా సాకర్ లేదా బాస్కెట్ బాల్ ఆటగారి వలె ఉండే అవకాశాలు ఉన్నాయి.

మిధునం : మే 21 - జూన్ 20

మిధునం : మే 21 - జూన్ 20

క్రితం జన్మ నుండి మీకు వచ్చిన సృజనాత్మక శక్తి వృషభ రాశి ఆధిపత్యాన వచ్చింది. మీ క్రితం జన్మలో ప్రముఖ వ్యక్తులతో సంబంధాలను కలిగి ఉంటారు. మీ ప్రస్తుత ఆలోచనా విధానం, క్రితం జన్మలోని మీ ప్రభావిత వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. క్రితం జన్మలోని కోప స్వభావాలు, ప్రస్తుతం ముభావoగా ఉండే లక్షణాలకు కారణాలుగా ఉంటాయి. మీరు క్రితం జన్మలో గొప్ప పేరెన్నిక గలవారై ఉంటారు. కుటుంబ సభ్యులపై మీ ప్రేమ అపారంగా ఉంటుంది. ఆ లక్షణాలు ఈ జన్మలో కూడా కనిపిస్తూ ఉంటాయి. వారి కోసం ప్రాణమిచ్చే వారిలా ఉంటారు.

కర్కాటకం : జూన్ 21 - జూలై 22

కర్కాటకం : జూన్ 21 - జూలై 22

మీలోని భయాలకు, నిజజీవితానికి దూరమైన ఆలోచనలకు క్రితం జన్మలో మిధున రాశి ఆధిపత్యమే కారణం. ఎక్కువగా క్రితం జన్మలో ఇతరుల సంరక్షణకై పాటుపడేవారిలా ఉంటారు. తద్వారా కొన్ని భయాలు ఆందోళనలు ఇప్పుడు మీ జీవితంలో వెంటాడుతున్న అనుభూతికి లోనయ్యి, అభద్రతా భావాలకు గురవుతూ ఉంటారు. ఊహా ప్రపంచాన్ని వదిలి, వాస్తవిక ఆలోచనలకు వస్తే ఈ అభద్రతా భావాలు మీ దరికి చేరలేవు.

సింహం: జూలై 23- ఆగస్ట్ 23

సింహం: జూలై 23- ఆగస్ట్ 23

మీ క్రితం జన్మ కర్కాటక రాశి ఆధిపత్యాన ఉంటుంది. కావున జీవితంలో అన్నిటా ఉత్తమంగా ఉండాలనే తత్వం అలవాటుగా ఉంటుంది. క్రితం జన్మలో కాస్త పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉండి, నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు. ఆ లక్షణాలు ఇప్పుడు కూడా జన్మతహా వస్తుంటాయి. కావున అందరిలో ఉత్తమంగా కనిపించాలని ప్రణాళికలు చేస్తుంటారు.

కన్య : ఆగస్ట్ 24 - సెప్టెంబర్ 23

కన్య : ఆగస్ట్ 24 - సెప్టెంబర్ 23

ప్రస్తుతం మీ జీవితం మీ సంబంధిత వ్యక్తుల సంరక్షణ కొరకై అన్నట్లుగా ఉంటుంది, దీనికి కారణం క్రితం జన్మలో సింహ రాశి ఆధిపత్యం ఉండడమే. మీరు ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించే ఆలోచనలు కలిగి ఉంటారు. కావున క్రితం జన్మలో సైంటిస్ట్ లేదా, గణిత శాస్త్రజ్ఞునిలా ఉండే అవకాశాలు ఉన్నాయి.

తుల : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తుల : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

మీ క్రితం జన్మ కన్యా రాశి ఆధిపత్యాన ఉంటుంది. తద్వారా ఒక ప్రణాళికా బద్దమైన జీవన శైలి కూడా మీకు అలవడి ఉంటుంది. మీ రాశిచక్రం ప్రకారం, మీరు క్రితం జన్మలో రచయిత కానీ, కవి కానీ అయ్యుండే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం మీకు భావాలను వ్యక్తపరచడంలో ఇష్టత చూపడమే. మీకోపం కూడా క్రితం జన్మ నుండి వచ్చినదే, కానీ మీ ప్రతి కోపానికి వెనుక గూడార్ధం , కుటుంబ శ్రేయస్సు ఖచ్చితంగా ఉంటాయి.

వృశ్చికం : అక్టోబర్ 24 - నవంబెర్ 22

వృశ్చికం : అక్టోబర్ 24 - నవంబెర్ 22

మీ క్రితం జన్మ తులా రాశి ఆదిపత్యాన ఉన్న కారణంగా మీకు కోపం సహజo గానే ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కువగా మీగురించిన, లేదా మీ కుటుంబానికి సంబంధించిన ఆలోచనలను చేస్తుంటారు. మరియు వాదనలకు ఎక్కువ మొగ్గు చూపుతుంటారు., కావున క్రితం జన్మలో లాయర్ లేదా గ్రామ పెద్దలా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.

ధనుస్సు : నవంబర్ 23 - డిసెంబర్ 22

ధనుస్సు : నవంబర్ 23 - డిసెంబర్ 22

క్రితం జన్మలో మీరు వృశ్చిక రాశి ఆధిపత్యాన ఉండేవారు. మీరు పుట్టుకనుండే ఎక్కువ స్వేచ్చను కోరుకునే వారిలా ఉంటారు, క్రితం జన్మలో మీరు ఎక్కువగా ఇతరుల గుండెల్లో స్థానాన్ని పొందిన వారై ఉంటారు. జ్యోతిష్య శాస్త్ర పండితుల ప్రకారం, మీరు అన్నిటా కేంద్రబిందువుగా వ్యవహరిస్తుంటారు.

మకరం : డిసెంబెర్ 23 - జనవరి 20

మకరం : డిసెంబెర్ 23 - జనవరి 20

మీ క్రితం జన్మ ధనుస్సు రాశి ఆదిపత్యాన ఉంటుంది. మీరు ఎక్కువగా ప్రకృతి ప్రేమికులుగా ఉంటారు. తద్వారా పర్యావరణవేత్తగా కాని, పురాతత్వ శాస్త్రవేత్తలుగా కాని ఉండే అవకాశం ఉంది. మరియు ఆశావాద దృక్పధంతో ముందుకు అడుగులు వేసేవారిలా ఉంటారు.

కుంభం : జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభం : జనవరి 21- ఫిబ్రవరి 18

మీరు నాయకత్వపు లక్షణాలతో మీకంటూ ఒక గుర్తింపు పొందాలన్న లక్ష్యంతో జీవిస్తూ ఉంటారు. క్రితం జన్మలో మకరం ఆదిపత్యాన ఉంటారు. తద్వారా కష్టజీవులై , స్వేచ్చా స్వాతంత్ర్యాలకు విలువని ఇచ్చేవారిలా ఉంటారు. ఒకరి వలన ప్రభావితమవడం మీకు ఎన్నటికీ నచ్చదు. తద్వారా క్రితం జన్మలో ఖచ్చితంగా ఉన్నతమైన లక్ష్య సాధనలో గుర్తింపు పొందిన వారిగా ఉంటారు.

మీనం : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీనం : ఫిబ్రవరి 19 - మార్చి 20

క్రితం జన్మలో మీరు కుంభ రాశి ఆధిపత్యాన ఉంటారు. తద్వారా ముందు జరిగే విషయాలపై ఒక అవగాహన కలిగిన వారిగా ఉంటారు. ఎటువంటి విషయాలనైనా వెంటనే అర్ధం చేసుకోగల శక్తి మీకు క్రితం జన్మ నుండే వచ్చింది. తద్వారా జ్యోతిష్య పండితునిగా , లేదా ప్రొఫెసర్, టీచర్ వంటి ఉద్యోగాలలో ఉన్నవారై ఉంటారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    What Were You In Your Past Life According To Your Zodiac Sign

    According to astrology, each zodiac sign's characteristics is related to the type of personality they had in previous life. These characteristics reveal about the person you were born as in your previous birth. For example, if you are a Leo and your characteristics are being a bold and stubborn individual, then it reveals about your past as being a leader.
    Story first published: Thursday, April 19, 2018, 18:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more