For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోని పెయింటింగ్స్, అద్భుతమైన కళ, పీరియడ్స్ లో వచ్చే బ్లడ్ తో ఆమె చేసే పని ఏమిటో తెలుసా?

ప్రతి అమ్మాయికి పుష్పవతి అయినప్పటి నుంచి నెలనెలా ఋతుక్రమం వస్తుంది. నెలసరి సమయంలో బ్లీడింగ్ అవుతుంది. ఇది కామన్. ఆ సమయంలో చాలా మంది అమ్మాయిలు పెయిన్ తో అల్లాడిపోతుంటారు. అయితే ఋతుక్రమం సమయంలో ఆడవారి

|

ప్రతి అమ్మాయికి పుష్పవతి అయినప్పటి నుంచి నెలనెలా ఋతుక్రమం వస్తుంది. నెలసరి సమయంలో బ్లీడింగ్ అవుతుంది. ఇది కామన్. ఆ సమయంలో చాలా మంది అమ్మాయిలు పెయిన్ తో అల్లాడిపోతుంటారు. అయితే ఋతుక్రమం సమయంలో ఆడవారి యోని నుంచి వచ్చే రక్తాన్ని చాలామంది అపవిత్రంగా భావిస్తారు. కానీ ఒక మహిళ మాత్రం తన ఋతుక్రమం సమయంలో వచ్చే రక్తంతో చాలా సృజనాత్మక ప్రయోగాలు చేసింది.

రకరకాల పెయింటింగ్స్

రకరకాల పెయింటింగ్స్

ఋతుస్రావంతో ఆమె రకరకాల పెయింటింగ్స్ వేస్తుంది. 13 నెలలుగా ఆమె పీరియడ్స్ సమయంలో వచ్చే బ్లడ్ తోపెయింటింగ్ వేస్తూ ఉంది. అందుకు సంబంధించిన చిత్రాలన్నీ ఆమె బాత్రూంలో పెట్టింది. ఇలా ఋతుచక్రంలో వచ్చే రక్తంతో పెయింటింగ్స్ వేయడం చాలా గొప్ప కళగా, ఇదో గొప్ప అవకాశంగా ఆమె భావిస్తూ ఉంది.

యోని పెయింటింగ్స్

యోని పెయింటింగ్స్

ఆమె వయస్సు 30 సంవత్సరాలు. ఆమెది మిచిగాన్. ఋతుస్రావం గురించి ఎవ్వరూ తప్పుగా అనుకోకూడదనే ఆమె ఇలా రకరకాల పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టింది. ఆమె వేసిన ఈ చిత్రాలు యోని చిత్రాలుగా కూడా మంచి పేరు పొందాయి.

యోని అనే పేరే ఎందుకు పెట్టిందంటే

యోని అనే పేరే ఎందుకు పెట్టిందంటే

ఆమె తన చిత్రాలకు యోని అనే పేరు పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. ఇక్కడి వారికి యోని అంటే తెలుస్తుందిగానీ... విదేశీయులకు యోని అనే పేరు తెలియదు. వాళ్లు వజినా అని పిలుచుకునే స్త్రీ జననాంగాన్ని భారతదేశంలో యోని అంటారు. అందువల్ల ఆమె తన పెయింటింగ్స్ కు యోని అనే పేరునే సెలెక్ట్ చేసుకుంది. బహుశా భారతదేశ సంస్కృతిపై ఉన్న అభినమానంతో ఆమె ఆ పేరును ఎంచుకుని ఉండొచ్చు.

రక్తం కొద్దిగా కూడా వేస్ట్ కాకూడదని

రక్తం కొద్దిగా కూడా వేస్ట్ కాకూడదని

ఆగస్టు 2017 నుంచి ఆమె పీరియడ్స్ సమయంలో వచ్చే రక్తంతో ఇలాంటి పెయింటింగ్స్ వేస్తూ ఉంది. ఆమె తన పీరియడ్స్ సమయంలో యోని నుంచి వచ్చే రక్తం మొత్తాన్ని కూడా పెయింటింగ్స్ వేయడానికే ఉపయోగిస్తుంది. ఆ రక్తం కొద్దిగా కూడా వేస్ట్ కాకూడదనేది తన అభిప్రాయం. ఆ రక్తం మొత్తాన్ని ఒక పాత్రలో పోసి దాంతో పెయింటింగ్స్ వేయడం హాబీగా చేసుకుంది. ఇక ఆ రక్తం మిగిలితే అందులో కొన్ని నీళ్లు పోసి మొక్కలకు పోస్తుంది.

చాలా మంది జనాల నుంచి మద్దతు

చాలా మంది జనాల నుంచి మద్దతు

ఇలా ఆమె వేసిన ప్రతి పెయింటింగ్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీటిని మొత్తం కొన్ని చోట్ల ప్రదర్శించింది. దీంతో ఆమె స్నేహితులతో పాటు చాలా మంది జనాల నుంచి ఆమెకు మద్దతు లభించింది. అందరూ ఆమె క్రియేటివిటీని అభినందించారు. ఆమె అద్భుతంగా వేసిన 13 చిత్రాలను తన బాత్రూమ్ లో భద్రంగా వేలాడదీసింది. ఎప్పుడూ వాటిని చూస్తూ ఆనందిస్తుంటుంది. ఇలాంటి అభిరుచులు తక్కువ మందికి ఉండొచ్చు. ఉన్నవాళ్లని అభినందిచడం మంచిది.

English summary

Woman Who Paints Using Her Menstrual Blood

Woman Who Paints Using Her Menstrual Blood
Story first published:Tuesday, September 11, 2018, 12:37 [IST]
Desktop Bottom Promotion