For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  జూన్ 2018కి సంబంధించి అన్ని రాశుల మాసఫలాలు

  |

  ఈ ఏడాదిలో మిడ్ ఇయర్ క్రైసిస్ అనేది కొంతమందిపై ప్రభావం చూపగా మిగతావారికి ఈ ఇబ్బంది లేదు. గతం అనేది భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది అన్నది వాస్తవం. అయితే, గతం మీదే ఫోకస్ చేసి ముందడుగు వేయకుండా ఆగిపోవడం మంచిది కాదు. గతం గతః అనుకుంటూ ముందడుకు వేస్తే బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. పాజిటివ్ ఎనర్జీతో భవిష్యత్తును అందంగా మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది.

  ఇప్పటి వరకు మీరు ఉపయోగించుకోలేపోయిన అవకాశాల గురించి ఏ మాత్రం చింతించకండి. ఈ ఏడాదిలో సగభాగం ఇంకా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇప్పుడైనా అవకాశాలను సద్వినియోగపరచుకోవచ్చు. నిరాశావాదులు సగం ఖాళీ అయినా గ్లాస్ లో ఖాళీనే చూస్తారు. ఆశావాదులు ఆ గ్లాస్ సగం నిండి ఉందన్న విషయాన్నిగుర్తిస్తారు. అదే విధంగా, ఇంకా ఈ ఏడాదిలో సగభాగం ముందుంది.

  monthly predictions for zodiac signs

  జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలను ప్రెడిక్ట్ చేయడం ద్వారా ఆస్ట్రాలజీ అనేది మిమ్మల్ని భవిష్యత్తు గురించి సిద్ధం చేసి ఉంచుతుంది. ఈ విధంగా ఆస్ట్రాలజీ అనేది ఒక మీడియంగా పనిచేస్తుంది. అందువలనే, మేము మీ కొరకు రోజూ ఆస్ట్రాలజీని మీ వద్దకే తెస్తున్నాం. మీరు ఎప్పుడూ ఇతరుల కంటే ఒక అడుగు ముందుండడానికి మా ఈ చిన్ని ప్రయత్నం ఉపయోగపడుందని ఆశిస్తున్నాము.

  జూన్ 2018కి సంబంధించిన ద్వాదశ రాశుల మాసఫలాలను ఇక్కడ అందిస్తున్నాము. మీ రాశి గురించి ఇక్కడ తెలుసుకోండి మరి.

  1. మేషరాశి : 21 మార్చ్ - 20 ఏప్రిల్

  1. మేషరాశి : 21 మార్చ్ - 20 ఏప్రిల్

  మీ మెదడులో ఎన్నో సృజనాత్మక ఆలోచనలు చోటుచేసుకుంటాయి. వాటన్నిటినీ ఇంప్లిమెంట్ చేయలేకపోయినా బాధపడకండి. మీ భావవ్యక్తీకరణ సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా, మీరు సోషల్ గా మరింత యాక్టివ్ గా ఉంటారు. మీరు రైట్ కనెక్షన్స్ ని ఏర్పరచుకుంటున్నారో లేదో గమనించండి. ఆలోచనలలో స్పష్టత కోసం కొన్ని మెడిటేటివ్ ఎక్సర్సైజ్ లను చేయండి.

  ఏదైనా పరిస్థితికి రియాక్ట్ అయ్యే ముందు ఇతరుల దృష్టికోణం నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోండి. మీ భాగస్వామితో కలసి సమయాన్ని గడుపుతారు. వెకేషన్ కు వెళ్లడం ద్వారా మీ రిలేషన్ షిప్ లో ప్రశాంతత చోటుచేసుకుంటుంది. అయితే, వెకేషన్ వలన మీరు ఆర్థికంగా ఇబ్బందిపడకుండా జాగ్రత్తపడండి.

  2. వృషభ రాశి: 21 ఏప్రిల్ - 21 మే

  2. వృషభ రాశి: 21 ఏప్రిల్ - 21 మే

  ఈ నెలలో కెరీర్ కి ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తారు. మీ లక్ష్యాలపై గురి పెట్టండి. వాటిని సాధించడానికి అంకితభావంతో కృషి చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు అందుతాయి. మీరు అనుకున్న విధంగా అన్నీ జరగకపోవచ్చు. కాబట్టి, చికాకుపడకుండా ప్లాన్ బీ ని కూడా సిద్ధం చేసుకోండి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం మంచిది. దాని బదులు ఆరోగ్యకరమైన రొటీన్ ను పాటించండి.

  పనిలో సీనియర్స్ ఎటెన్షన్ ను ఆకర్షించే అవకాశాలు కలవు. మీకు అనుగుణంగా వారి ఎటెన్షన్ ను ఆకర్షించడం ద్వారా ప్రమోషన్ ను అందుకునే ఆస్కారాలు కలవు. కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. రిలేషన్ షిప్ విషయానికి వస్తే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవాలి. కొన్ని సార్లు సర్దుకోవాలి. అదే విధంగా, కొన్ని సార్లు కాంప్రమైజ్ అవ్వాలి.

  3. మిథున రాశి : 22 మే - 21 జూన్

  3. మిథున రాశి : 22 మే - 21 జూన్

  పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. వర్క్ ప్రెషర్ వలన మీరు ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. సోషలైజింగ్ వలన కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి. న్యూ సోర్సెస్ నుంచి మీకు ఆర్థిక లాభాలు అందడంతో మీ సంతోషానికి అవధులు ఉండవు. ప్రయాణాలు మీరు కొంతకాలంగా కోరుకుంటున్న ప్రశాంతతను అందిస్తాయి.

  ఈ నెలలో కెరీర్ పాత్ లోని మార్పులు సంభవించవచ్చు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వలన యాక్సిడెంట్స్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, వాహనాన్ని నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రిలేషన్షిప్ లో ఎదురయ్యే సమస్యలను అలాగే వాదనలను మెచ్యూర్డ్ వే లో హ్యాండిల్ చేయడం వలన సమస్యలు పరిష్కారమవుతాయి.

  4. కర్కాటక రాశి : 22 జూన్ - 22 జులై

  4. కర్కాటక రాశి : 22 జూన్ - 22 జులై

  ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కాబట్టి, మీ వైపు నుండి ఎటువంటి శ్రమ లేకుండా పనులన్నీ సజావుగా జరుగుతాయి. తద్వారా, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటికి అలాగే ఆఫీస్ కు ప్రాధాన్యతను ఇవ్వడం ఉత్తమం. వర్క్ ప్లేస్ లో నిర్లక్ష్యానికి గురవుతున్నట్టు భావిస్తారు. గతంలో మీరు తీసుకున్న తెలివైన నిర్ణయాలు మీకు ఇప్పుడు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి.

  గతంలో పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను తెస్తాయి. ఎప్పుడూ బయటి ఆహారాన్ని తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు తలెత్తే సూచనలు కలవు. కుటుంబంతో సాధ్యమైనంత సమయాన్ని గడిపేందుకు ప్రాధాన్యతనివ్వాలి.

  5. సింహ రాశి : 23 జులై - ఆగస్టు

  5. సింహ రాశి : 23 జులై - ఆగస్టు

  వర్క్ వలన మీకు పూర్తి సంతృప్తి లభిస్తుంది. మీ పనికి తగిన గుర్తింపుతో పాటు అభినందనలు లభిస్తాయి. మీ కోపాన్ని అలాగే అహంకారాన్ని నియంత్రణలో ఉంచుకోండి. ఈ లక్షణాల వలన మీ నుంచి మనుషులు దూరంగా వెళ్ళిపోతారు. వర్క్ ప్లేస్ లో మీరు సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ అయ్యే సూచనలు కలవు. వాటికి ఎటెన్షన్ ను ఇవ్వకుండా మీ పనిని మీరు చేసుకుపోతూ ఉండండి.

  మీ సృజనాత్మతకను బయటకు రప్పించండి. తద్వారా, మీకు మీ వర్క్ అనేది మరింత ఆసక్తికరంగా మారుతుంది. సరైన విధంగా ఇన్వెస్ట్ చేసే విధానాన్ని మీరు తెలుసుకుంటారు. అయితే, ఖర్చులను అదుపులో ఉంచుకోండి. మానసిక ఒత్తిళ్లు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు కలవు. కాబట్టి రిలాక్సేషన్ ఎక్సరైజ్ లకు ప్రాధాన్యతనివ్వండి. రిలేషన్ షిప్ లో నమ్మకమే ప్రధాన పాత్ర పోషిస్తుందని గుర్తించండి.

  6. కన్యా రాశి : 22 ఆగస్టు - 23 సెప్టెంబర్

  6. కన్యా రాశి : 22 ఆగస్టు - 23 సెప్టెంబర్

  జీవితంలోని ఛాయిస్ ల గురించి మీరు సంధిగ్ధంలో పడతారు. ఆధ్యాత్మిక భావనల ద్వారా మీకు సమాధానం లభిస్తుంది. మీరు మీలా ఉంటే ఫెయిల్యూర్ మీ దరిచేరదు. వర్క్ లో భారీ పురోగతిని మీరు గమనించగలుగుతారు. వర్క్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను తెలుసుకుంటూ ఉండి పనిపై శ్రద్ధను ఇదివరకు లాగానే కొనసాగిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

  ఆస్తుల విషయాల్లో లాభాలు వస్తాయి. ప్రేమ వ్యవహారంలో విజయం సాధించగలుగుతారు. అవివాహితులకు వివాహమయ్యే సూచనలు కలవు. ఆందోళన మరియు ఒత్తిడి వలన జంక్ ఫుడ్ ను తినడానికి ఆసక్తి చూపుతారు. కాబట్టి, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

  7. తులా రాశి : 24 సెప్టెంబర్ - 23 అక్టోబర్

  7. తులా రాశి : 24 సెప్టెంబర్ - 23 అక్టోబర్

  నిర్ణయాలను తీసుకోవడంలో గందరగోళ పరిస్థితి ఎదురవుతుంది. మనసొకటి చెబితే మెదడు ఒకటి సూచిస్తుంది. దాంతో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులలో కామన్ సెన్స్ ను ఉపయోగిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. రిలేషన్ షిప్ కి సంబంధించిన సమస్యలను పరిష్కరించేటప్పుడు మనసుతో ఆలోచించడం మంచిది. ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు మెదడుతో ఆలోచించాలి.

  వర్క్ పరంగా ఎన్నో అవకాశాలు మీ ముందుంటాయి. వర్క్ ప్లేస్ లో అభిప్రాయబేధాలు తలెత్తే సూచనలు గలవు. దాంతో, మీ చికాకు ఎక్కువవుతుంది. అయితే, దిగులు చెందకండి. పరిస్థితులు తొందరలోనే చక్కబడతాయి. అక్రమ విధానాలతో ధనాన్ని సంపాదించడం మిమ్మల్ని ఇబ్బందులలోకి నెట్టేస్తుంది. కాబట్టి అటువంటి విధానాలకు దూరంగా ఉండండి. ఎడ్వెంచరస్ హాబీస్ ద్వారా మీరు జీవితంలోని ప్రశాంతతను పొందుతారు. రిలేషన్ షిప్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది.

  8. వృశ్చిక రాశి : 24 అక్టోబర్ - 22 నవంబర్

  8. వృశ్చిక రాశి : 24 అక్టోబర్ - 22 నవంబర్

  పనిలో మిమ్మల్ని ఎగ్జైటింగ్ కి గురిచేసే విషయాలు ఎదురవుతాయి. రొటీన్ పనితో బోర్ ఫీలవుతున్న మీకు ఈ విషయం ఆసక్తిని కలిగిస్తుంది. సోషల్ సర్కిల్స్ లో మీరు మోస్ట్ వాంటెడ్ పెర్సన్ గా మారతారు. ఏదైనా ఈవెంట్ కి జీవాన్ని అద్దడంలో మీరు ప్రధాన పాత్ర పోషించడమే ఇందుకు కారణం. కెరీర్ ఛేంజ్ గురించి ఆలోచిస్తున్నట్లయితే ఇది అనుకూల సమయం.

  ఆర్థికపరంగా ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది. అయితే, అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది. యోగాతో పాటు మెడిటేషన్ ను దినచర్యలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. శారీరకంగా అలాగే మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఇవి తోడ్పడతాయి. అవివాహితులు ప్రేమలో పడే అవకాశాలు కలవు.

  9. ధనుస్సు రాశి : 23 నవంబర్ - 22 డిసెంబర్

  9. ధనుస్సు రాశి : 23 నవంబర్ - 22 డిసెంబర్

  వర్క్ ప్లేస్ లో మీ టాలెంట్స్ ను షో కేస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మీ ఇంట్రావర్ట్ నేచర్ ను పక్కకు పెట్టి అవకాశాలను ఉపయోగించుకోవడం ఉత్తమం. ఎవరి వలనా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. మీ మీద మీకే కంట్రోల్ ఉండాలి. ప్రతి ఒక్కరినీ ప్రతి సారి సంతోషపెట్టలేమని గుర్తించండి. కాబట్టి, ఈ విషయంలో దిగులు చెందకండి.

  ఆర్థికపరమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు సీనియర్స్ ని సంప్రదించడం మంచిది. రొటీన్ లైఫ్ నుంచి కాస్త విరామం పొందేందుకు వెకేషన్ ను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. దాంతో, ప్రశాంతత లభిస్తుంది. రిలేషన్ షిప్ విషయంలో మీరెంతో ప్యాషనేట్ గా ఉన్నా అదే విధమైన రియాక్షన్ మీ పార్ట్నర్ నుంచి మీకు అందకపోవడం మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది.

  10. మకర రాశి: 23 డిసెంబర్ - 20 జనవరి

  10. మకర రాశి: 23 డిసెంబర్ - 20 జనవరి

  పనిఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే, వర్క్ లో భారీ మార్పులు ఏర్పడే అవకాశాలు కలవు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. సీనియర్స్ మీ శ్రమను గుర్తిస్తారు. అందువలన, ప్రమోషన్ కు అర్హత సాధించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆర్థికపరంగా ఈ నెలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కలవు. అనవసర ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. తద్వారా, కొన్ని అనారోగ్య సమస్యలను అరికట్టగలుగుతారు. సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. పార్ట్నర్స్ మధ్య అన్యోన్యత లేకపోవడం వలన రిలేషన్ షిప్ ఎండ్ అయ్యే సూచనలు కలవు.

  11. కుంభ రాశి: 21 జనవరి - 19 ఫిబ్రవరి

  11. కుంభ రాశి: 21 జనవరి - 19 ఫిబ్రవరి

  మీ దారిలో అనిశ్చిత పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కలవు. జీవితంలోని పాజిటివ్ అంశాలపై దృష్టిపెట్టడం ద్వారా పాజిటివ్ ఎనర్జీను ఆకర్షించగలుగుతారు. సహనాన్ని పెంపొందించుకోవడం వలన పనులు మీరనుకున్న విధంగా ముందుకు సాగే అవకాశం ఉంది. కుటుంబంతో అలాగే పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడం వలన ప్రశాంతతను పొందుతారు. ఆర్థిక సమస్యలు ఈ నెలలో తలెత్తవు. ప్రణాళికాబద్ధంగా మీరు ఆర్థిక అవసరాలను తీర్చుకుంటారు కాబట్టి ఈ నెలలో ఆర్థిక చింత వేధించదు. రిలేషన్ షిప్ పరంగా ఒకరితో దగ్గరయ్యే సూచనలుగలవు. అయితే, సీరియస్ గా రిలేషన్ షిప్ ముందుకు సాగదు. కాబట్టి, అటువంటి పరిస్థితులను అవాయిడ్ చేయండి.

  12. మీన రాశి : 20 ఫిబ్రవరి - 20 మార్చ్

  12. మీన రాశి : 20 ఫిబ్రవరి - 20 మార్చ్

  ఈ నెలలో ఎన్నో విషయాలు మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తాయి. స్వార్థపూరితమైన ఆలోచనలను పక్కన పెట్టండి. ఇతరుల అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోండి. ముఖ్యంగా, మీ గురించి ఆలోచించే వారిపై శ్రద్ధ వహించండి. ఇతరులకు అప్రోచబుల్ గా ఉండండి. తద్వారా, వారు మీతో కొన్ని ముఖ్య సమాచారాన్ని పంచుకోగలుగుతారు. పరిస్థితులను చక్కబెట్టేందుకు మీరు వినూత్నమైన మార్గాన్ని ఎంచుకునేందుకు ఆసక్తికనబరుస్తారు. పెట్టుబడుల ఆలోచనలను వాయిదా వేయండి.

  గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను పొందే సూచనలు గలవు. యోగా మరియు ఏరోబిక్స్ ను రొటీన్ లో భాగంగా చేసుకోవడం వలన ఫిట్ గా అలాగే యాక్టివ్ గా ఉంటారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. వాటి గురించి చింతించడం మాని మీ వైపు నుండి మీరు జాగ్రత్తగా ఉండండి. థింగ్స్ ను గ్రాంటెడ్ గా తీసుకునే ధోరణిని మీరు మార్చుకుంటే వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది.

  గమనిక: ఇవన్నీ సాధారణ ప్రెడిక్షన్స్ మాత్రమే. వ్యక్తిగత జాతకఫలితాల కోసం అనుభవజ్ఞుడైన జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించండి.

  English summary

  Monthly Predictions For Zodiac Signs For The Month Of June 2018

  The Mid-year crisis may be catching up on some people, while the others may be enjoying the good phases of their lives. The reality of the half year already zooming past us can make us retrospect the past. But, the past is the past and we just cannot re-do or alter it. So, it is better to focus all our energies on our future instead.
  Story first published: Friday, June 1, 2018, 13:15 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more