మీ రాశిచక్రాలు మీ సంబంధాల నాశనానికి కూడా కారణమని మీకు తెలుసా?

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మీ సంబంధాలలో ఎటువంటి సంతోషాలకు ఆస్కారం లేక, నిరాశానిస్పృహలతో ఉన్నారా? మీ ఊహకు కూడా అందని సమస్యలు మీసంబంధంలో కనిపిస్తూ మీ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయా.

ఇక్కడ ప్రతిరాశిచక్రానికి వాటివాటి కారణాలు, ప్రత్యేకించబడిన అంశాల కారణంగా సంబంధాలలో కలతలు రేగుతూ, అసౌకర్యానికి గురవుతూ క్రమంగా సంబంధ వినాశనానికి కూడా కారణమవుతున్నాయి. ప్రతి రాశిచక్రానికి ఒక ప్రధాన అంశం, సంబంధాల నాశనం దిశగా అడుగులు వేస్తుంటుంది.

ఈవ్యాసంలో ముఖ్యంగా రాశిచక్రాలకు సంబంధించిన ఏ ప్రధాన అంశం మీ సంబంధాలను నాశనం చేస్తుందో తెలుసుకుందాం. మా జ్యోతిష్య పండితుల మాటలను మీరు అంగీకరించక మానరు.

మేషం: మార్చి 21- ఏప్రిల్ 19

మేషం: మార్చి 21- ఏప్రిల్ 19

మీరు వర్తమానంలో జీవించే స్వభావాన్ని కలిగి ఉంటారు, ఈ పద్దతిని ఎన్నటికీ మార్చుకోలేరు. మీరు ఒక చట్రాన్ని ఏర్పరచుకుని అందులోనే జీవనం కొనసాగించాలనే ఆలోచన చేస్తుంటారు. కొత్త సంబంధాలకన్నా, ఉన్న సంబంధాలకై ఎక్కువ ఆలోచన చేస్తుంటారు. ఇలాంటి ఆలోచనలు సంబంధాలు నాశనానికి కారణం ముఖ్య కారణంగా ఉంటాయి. మీరు విసుగును సహించలేరు, మీ భాగస్వామి మీఅభిరుచికి , మీకలలకు తగిన విధంగా ఉండకపోవడం కూడా కాస్త అసౌకర్యంగా భావిస్తుంటారు. మీ భాగస్వామిలో పట్ల అత్యధిక అంచనాలను కలిగి ఉంటారు. ఇలాంటి అంచనాలే సంబంధ వినాశనానికి హేతువుగా పరిణమిస్తుంది.

వృషభం: ఏప్రిల్20– మే20

వృషభం: ఏప్రిల్20– మే20

మీరు జరిగిపోయిన అంశాలను గుర్తు తెచ్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. తద్వారా ఏ సమస్యా లేని సమయంలో కూడా గతించిన అంశాల ప్రస్తావనలతో సంబంధాలలో ముసలాన్ని సృష్టించే దిశగా మీ అడుగులు పడుతుంటాయి. ఒక్కోసారి అవి తీవ్రంగా మారేవరకు గమనించలేకపోవడం జరుగుతుంటుంది. ఈ పట్టుదలలు, పగలు ఇతరుల వద్దనే కాకుండా భాగస్వామి వద్ద కూడా ప్రదర్శించడం వలన, సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.

మిధునం: మే21- జూన్20

మిధునం: మే21- జూన్20

మీ ఆలోచనా విధానం తరచుగా మారుతూ ఉంటుంది. ఒక సమయంలో ఉన్నట్లు మరో సమయంలో లేకపోవడం మీ బలహీనత. తద్వారా మీ భాగస్వామి ప్రేమను కూడా గుర్తించలేని స్థితిలో ఉంటారు. కావున మీకు మీ భాగస్వామిలో ఏదైనా విషయం నచ్చితే, వెంటనే అతనితో ఆ భావనలు పంచుకోండి. తద్వారా సంబంధాలు నాశనం కాకుండా ఉంటాయి.

కర్కాటకం: జూన్21- జూలై22

కర్కాటకం: జూన్21- జూలై22

మీ సంబంధాలలో కాస్త అసంపూర్ణ నియంత్రణలను కలిగి ఉంటారు . ఒక్కోసారి మీ ఆలోచనా పర్వం హానికర పరిస్థితులకు కూడా దారి తీసే అవకాశాలు ఉన్నాయి. కానీ మరోవైపు, మీరు మీ భాగస్వామి పట్ల అత్యంత ప్రేమలను కలిగి ఉండి , మీ భాగస్వామికి చెందిన ఏ చిన్న విషయాన్నైనా నిష్కపట మనస్కులై గౌరవించే విధంగా ఉంటారు. మీరు అత్యాలోచనలు చేసేవారిలా ఉంటారు. తద్వారా మీ భాగస్వామితో ఉత్తమమైన సంబంధాలను కలిగి ఉండాలన్న తాపత్రయాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ కనీసం ఊపిరి తీసుకునే సమయమైనా ఇచ్చి, వారి ఆలోచనలకు కూడా గౌరవమిచ్చే వారిలా ఉండడం అన్నిటికన్నా మేలు.

సింహం : జూలై 23 – ఆగస్ట్ 23

సింహం : జూలై 23 – ఆగస్ట్ 23

ఎటువంటి విషయాలనైనా మీకు తగ్గట్లే ఉండాలని ఆలోచించే మీ మనస్తత్వం సహజంగానే సంబంధాలలో గొడవలను తెస్తుంటుంది. మీఆలోచనా విధానానికి అడ్డుగా ఎవరు వచ్చినా శత్రువులా భావించే తత్వాన్ని ప్రదర్శించడం వలన కొన్ని సమస్యలు తలెత్తుతుంటాయి. మీకు సర్ధుకుపోయే గుణం ఎక్కువగా కనపడని కారణంగా, కొన్ని అంశాలు సంబంధాల నాశనం దృష్ట్యా అడుగులు వేస్తుంటాయి.

కన్య: ఆగస్ట్24–సెప్టెంబర్ 23

కన్య: ఆగస్ట్24–సెప్టెంబర్ 23

ప్రతి చిన్న విషయాన్ని తీవ్రంగా ఆలోచించే ప్రయత్నాలు చేసేవారిలా ఉంటారు. ఈతత్వం సహజంగానే అనేక సమస్యలకు కారణభూతం అవుతుంది. మీ ప్రతికూల ఆలోచనలు అన్నీ వేళలా మీ భాగస్వామిని సహనంగా ఉంచలేవు. మీ ప్రణాళికాబద్దమైన జీవనశైలి అన్నీ సందర్భాలలోనూ కోరుకుంటారు, మీ ఆలోచనలకు తగినవిధంగా లేనిపక్షంలో సంబంధాలలో అపశ్రుతులు హెచ్చుమీరుతుంటాయి. మీరు మానసికసంతోషాన్ని పొందితే, మీ ప్రియమైన వారితో కూడా సంతోషంగా గడుపగలరు.

తుల: సెప్టెంబర్24-అక్టోబర్23

తుల: సెప్టెంబర్24-అక్టోబర్23

మీరు సున్నితహృదయులై, భావోద్వేగాలు అధికంగా కలవారై ఉంటారు. మిమ్ములను మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తులుగా ఉంటారు. మరియు ప్రతి చిన్న విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తుంటారు, తద్వారా అనేక సమస్యలను కోరి తెచ్చుకునే వారిగా ఉంటారు. చమత్కారాలకి, వెక్కిరింపులకు కూడా భేధాన్ని గ్రహించక సంబంధాల్లో గొడవల దిశగా అడుగులు పడుతుంటాయి. ఇలా మీ సున్నితమైన భావోద్వేగాలే మీ సంబంధాల నాశనానికి పునాది అవుతాయని గ్రహించలేని వారిగా ఉంటారు.

వృశ్చికం: అక్టోబర్ 24- నవంబర్ 22

వృశ్చికం: అక్టోబర్ 24- నవంబర్ 22

చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసే ధోరణిని ప్రదర్శించడం వలన. , భాగస్వామితో గొడవలు సహజంగానే ఉంటాయి. మరియు మీ మనసుకు నచ్చని విధంగా నడుచుకుంటున్న పక్షంలో, స్వ పర తేడా లేకుండా జీవితం నుండే వెలివేయాలన్న ఆలోచనలు చేస్తుంటారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని గ్రహించాలి.

ధనుస్సు: నవంబర్ 23 – డిసెంబర్ 22

ధనుస్సు: నవంబర్ 23 – డిసెంబర్ 22

మీ భాగస్వామికన్నా, మీ సంతోషాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. మరియు వ్యక్తిగత అభిప్రాయాల లో కూడా మీ మాటే చెల్లాలన్న తపన మీదిగా ఉంటుంది. తద్వారా అనతికాలంలోనే మీ భాగస్వామి మీ ఆలోచనలకు తగ్గట్లుగా లేరన్న ఆలోచనకు వస్తుంటారు. చేతులారా సంబంధాలు నాశనం చేసుకునే స్థితికి వస్తుంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని మీ మనసుకు అనిపిస్తే, మార్చుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది.

మకరం: డిసెంబర్ 23 – జనవరి20

మకరం: డిసెంబర్ 23 – జనవరి20

మీరు మీ భావోద్వేగాలను ఇతరుల కంట పడకుండా ఉండేలా దాచే ప్రయత్నం చేస్తుంటారు., తద్వారా మీ భాగస్వామికి మీరు ఎప్పుడూ ఒక ప్రశ్నే. అర్ధం చేసుకునే స్థాయిలు తగ్గుముఖం పట్టడం వలన, సహజంగానే సంబంధాలు నడిసముద్రంలో దారి తప్పిన నావలా ఉంటాయి. దాపరికాల సుడిగుండాలలో బ్రతకడం చివరకు అశాంతినే మిగులుస్తుంది అన్న సత్యాన్ని మీరు గ్రహించాలి.

కుంభం: జనవరి 21 – ఫిబ్రవరి 18

కుంభం: జనవరి 21 – ఫిబ్రవరి 18

మీ అజాగ్రత్తే మీ సంబంధం నాశనానికి ప్రధాన కారకం. భాగస్వామి ఆలోచనలు, నిర్ణయాల పట్ల గౌరవం ఉన్నా కూడా, మీ భావ ప్రకటనలో మార్పు మీ భాగస్వామికి అసహనాన్ని తెస్తాయి. ఒక్కోసారి మీ ఆలోచనలు సోమరితనాన్ని తలపిస్తూ ఉంటాయి. కానీ సంబంధాల విషయంలో ఇలాంటి పద్దతులు మార్చుకోకపోతే, కష్టమే మరి. భాగస్వామి ఎల్లప్పుడు తనపట్ల ప్రేమ, గౌరవం, నమ్మకాన్ని కోరుకుంటారు. ఈ మూడింటిలో లోపం కనిపిస్తే ఆ సంబంధం పునాదులు లేని ఇల్లే.

మీనం: ఫిబ్రవరి10 – మార్చి21

మీనం: ఫిబ్రవరి10 – మార్చి21

మీ ఆలోచనా తీరు మీ భాగస్వామికి ఎప్పటికీ ఒక ప్రశ్నే. మీరు అందరితో కలివిడిగా ఉంటూ, అధికంగా మాట్లాడే వారిలా ఉంటారు. కానీ మితిమీరిన మాటలు, చపలచిత్తాన్ని ప్రదర్శిస్తాయి. ఇలాంటివి సంబంధాలలో ప్రతికూల అంశాలుగా పరిణమిస్తుంటాయి.

English summary

Zodiac Signs Reveal The Real Reason For Breakups

There are many reasons that can be held accountable when we think of the reasons for a breakup. But have you ever wondered one specific reason that can totally ruin your relationship? Well, it can! For Eg: Taurus: No matter how much time has gone by, you seem to hold grudges against others and you tend to use situations from the past against your partner.