విశ్రాంతి సమయంలో సోమరులు ఈ రాశుల వారు.

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మీకు తెలుసా ఈ నాలుగు రాశుల వారు అలసటతో, ప్రత్యేకించి విశ్రాంతి తీసుకొను సందర్భంలో యే ఇతరములైన విషయాలకు కలవరపడకుండా తమ విశ్రాంతిని కొనసాగిస్తారని? ప్రత్యేకమైన ఈ 4 రాశుల వారికి ఈ రకమైన లక్షణం ఉంటుంది. వీరు ఎప్పుడూ తమ విశ్రాంతికే అధిక ప్రాధాన్యతను ఇస్తారు. తమ సౌకర్యమే అన్నిటికన్నా ముఖ్యం.

ఈ వ్యాసంలో మేము పొందుపరచిన ఈ నాలుగు రాశులు ప్రత్యేకంగా సోమరితనాన్ని కలిగి ఉండి, సహనం ఓర్పు లేని వారిలా కనిపిస్తూ ఉంటారు. ఎక్కువగా వారి విశ్రాంత సమయాల్లో.

వీరిని నిద్ర నుండి లేపాలని ప్రయత్నిస్తే, వీరికి కోపం నషాలానికి అంటుతుంది. తద్వారా సెకన్లలోనే సునామీని సృష్టించగలరు.

ఆ రాశులేవో మీరే చూడండి.

Zodiac Signs That Are Ranked As Being The Most Laziest

మేషం: మార్చి 21-ఏప్రిల్ 19

ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ తమ సౌకర్యానికే అధిక ప్రాధాన్యతని ఇస్తుంటారు. ఎక్కువగా అసహనంతో మూడీ గా ఉండడం పరిపాటి. వీరు నిద్రపోవు సమయాల్లో ఎవరైనా కదిలించాలని ప్రయత్నిస్తే ఆకస్మిక కోపానికి గురై, ఉద్రేకంతో ఊగిపోతుంటారు. ఎక్కువగా వీరు పనిమంతులు. కానీ విశ్రాంతి అవసరం అని మనసుకు తోచితే, ఆ విశ్రాంతిని భగ్నం చేయుటకు ఎవ్వరికీ అవకాశాన్ని ఇవ్వరు.

Zodiac Signs That Are Ranked As Being The Most Laziest

సింహ రాశి: జులై 23-ఆగస్టు 23

ఈ వ్యక్తులు ఎప్పుడూ అందరి దృష్టి తమ మీదే కేంద్రీకృతం అయ్యేలా ఉండాలని పరితపిస్తూ ఉంటారు. కానీ మరో వైపు వీరు తమ సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. కావున తమ నిద్రా భంగానికి పాల్పడితే , క్షమించే అవకాశమే ఉండదు. కోపోద్రిక్తులుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. వీలైనంత వరకు వీరు నిద్రిస్తున్న సమయాల్లో వీరి జోలికి పోకపోవడమే మంచిది.

Zodiac Signs That Are Ranked As Being The Most Laziest

కుంభం: జనవరి 21-ఫిబ్రవరి 18

వీరు ఆహ్లాదకరమైన మనసుకలిగి ఉంటారు, మరియు మేధో సంపత్తి కలిగిన మానవతావాది గా ఉంటారు. కానీ అదే సమయంలో, విశ్రాంత సమయంలో ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకుంటారు. వారు నిద్రపోతున్నప్పుడు, నిద్రాభంగాన్ని సహించలేరు. ఎక్కువ అసహనానికి లోనవుతుంటారు. తరచుగా ఘాడ నిద్రలోకి వెళ్లిపోతుంటారు.

Zodiac Signs That Are Ranked As Being The Most Laziest

మీనం: ఫిబ్రవరి 19-మార్చి 20

వీరు చాలా నెమ్మదస్తులు మరియు ఎక్కువ కేరింగ్ కలిగిన వారుగా ఉంటారు. వాస్తవికత నుండి తప్పించుకునే సామర్థ్యాన్ని వారు విలువైనదిగా భావిస్తారు. ఎక్కువగావీరు నిద్ర ని మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు. ఈ సమయంలో నిద్రకు భంగం వాటిల్లితే , వీరి కోపాన్ని నివారించడం చాలా కష్టతరం. వీరికి నిద్రావకాశాలను పెంచడం ద్వారా అవాంఛనీయమైన సమస్యలను నివారించవచ్చు.

English summary

Zodiac Signs That Are Ranked As Being The Most Laziest

Zodiac Signs That Are Ranked As Being The Most Laziest, Disturbing their sleep means their temper goes from zero to a hundred-billion in a matter of seconds! Well, do not blame us, as we're already warning you about these zodiac signs!
Story first published: Saturday, March 24, 2018, 12:00 [IST]