For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  విసుగుకు బ్రాండ్ అంబాసిడర్లు, ఈ రాశిచక్రాలకు చెందిన వారు

  |

  మీరు రాశిచక్రాలను బలంగా నమ్మేవారు అయితే మీకు ఖచ్చితంగా కొన్ని రాశిఫలాల మీద అవగాహన ఉండే ఉంటుంది.

  ఇక్కడ మేము పొందుపరుస్తున్న 4 రాశిచక్రాలు విసుగు చెందడంలో పరాకాష్టలో ఉంటాయి. కాలక్షేపానికి, చమత్కారాలకు కూడా దూరమే ఈ మహానుభావులు.

  ఒక మనిషి విసుగు చెందడానికి అనేక అంశాలు కారణభూతాలుగా ఉంటాయి. కానీ ప్రత్యేకించి ఈ నాలుగు రాశిచక్రాలు నిస్తేజానికీ ముందువరసలో ఉంటారు అనడంలో ఆశ్చర్యం లేదు.

  These Are The Most Boring Zodiac Signs

  మకరం : డిసెంబర్ 23 – జనవరి 20

  మిగిలిన అన్ని రాశి చక్రాలతో పోలిస్తే విసుగు, నిస్తేజం అనే పదాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు. తలమీద తుపాకీ గురిపెట్టి బెదిరించి అడిగినా , డాన్స్ , జోక్ వంటి సరదా అంశాలపై వీరి మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళదు. ఒక వ్యక్తిగా మీరు వేసే ప్రతి అడుగు పట్ల భయాన్ని కలిగి ఉంటారు. ఆత్రుత, ఆలోచనలతో దెయ్యాల కొంపలా మీ మనసు కకావికలంగా ఉంటుంది. తద్వారా, విసుగు అనేది సర్వసాధారణంగా ఉంటుంది. కానీ మీరు వ్యక్తిగతంగా, వివేకవంతులుగా ఆచరణాత్మక ఆలోచనలు చేసేవారిలా ఉంటారు.

  కన్య : ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

  విసుగు మెండుగా ఉన్న రాశులలో కన్యా రాశి రెండవ స్థానంలో ఉంటుంది. వీరు ఎక్కువగా ప్రణాళికా బద్దమైన జీవనానికి ఆలోచనలు చేస్తుంటారు. తద్వారా విసుగుకే కాదు మౌనానికి కూడా కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉంటారు. మీ నీడ ను కూడా నమ్మని స్థితిలో ఉండడం, కాస్త అర్ధవంతంగా అనిపించదు. మీకు జీవితం ఎటువంటి ఆటుపోటులు లేకుండా సాఫీగా జరగాలన్న ఆలోచనలు చేస్తుంటారు. తద్వారా ప్రతి చిన్న అసౌకర్యాన్ని కూడా తట్టుకోలేక విసుగు చెందుతుంటారు. ఒక వ్యక్తిగా మీలో ఆద్యాత్మిక చింతన కాస్త ఎక్కువగానే ఉంటుంది. తద్వారా సాంప్రదాయక విలువలను ఎక్కువగా ఇష్టపడేవారిలా ఉంటారు.

  These Are The Most Boring Zodiac Signs

  తుల : సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

  మీరు ఎక్కువగా ఆచరణాత్మక భావాలు కలిగి ఉండి , ఊహాగానాలకు దూరంగా ఉంటుంటారు. మీరు దూకుడు స్వభావంతో , తీవ్రమైన సామర్ధ్యాలను కలిగి ఉంటారు. మరోపక్క , కొన్ని విషయాలయందు విసుగు మరియు నిస్తేజపు ధోరణిని ప్రదర్శిస్తుంటారు. ఎటువంటి వ్యక్తులనైనా మీ మాటలకు అనుగుణంగా మార్చుకోగలిగిన శక్తి మీ సొంతం, కానీ ఇతరులు మీ లక్షణాలను గుర్తెరుగుతున్నారని గ్రహించలేరు. సాధారణంగా కుటుంబం పట్ల ఎక్కువ ప్రేమానురాగాలను కలిగి ఉంటారు, ఏ కారణం చేతనైనా మీ మాటను వినని ఎడల, తీవ్రమైన మనస్తాపానికి గురవుతూ ఉంటారు.

  These Are The Most Boring Zodiac Signs

  కర్కాటకం :జూన్ 21 – జూలై 22

  మీకు కొత్త ప్రదేశాలకు వెళ్ళడం అంటే నచ్చదు. లేదా మీ ఆలోచనలకు సంబంధం లేని ఉపాయాలను పాటించడానికి కూడా మీ మనసు ముందుకు రాదు. మీరు నాటకాలు వేసేవారికి దూరంగా ఉండే ఆలోచనలు చేస్తుంటారు. అన్నిటా మీ ప్రియమైన వారు మీ పట్ల ప్రేమ ను కురిపించాలన్న భావనతో ఉంటారు. కానీ మీరు మీ భావాలను పంచుకునే ప్రయత్నం మాత్రం చెయ్యరు. భావ వ్యక్తీకరణ ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండదన్న విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. లేనిచో మీ గుండె చాటు భావాలు మీ ప్రియమైన వారు కూడా గుర్తించలేరు. తద్వారా నిస్తేజం అలముకుని విసుగు పరాకాష్టలో ఉంటుంది.

  మీ రాశి చక్రం ఇక్కడ పొందుపరచబడి లేదా ? అయితే మీరు సరదాగా అందరితో కలివిడిగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. రాశి చక్రాల గురించిన మరిన్ని వివరాలకై మా పేజీ ని తరచుగా చూస్తూ ఉండండి.

  English summary

  These Are The Most Boring Zodiac Signs

  If you are a believer in the zodiac signs reading, then you would relate to the predictions that are based on your zodiac signs.Here, we have listed the 4 most boring zodiac signs that are known to have highly boring individuals who are anything opposite to fun loving and entertaining.
  Story first published: Friday, April 20, 2018, 8:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more