ఈ 5 రాశిచక్రాల వారు ఇచ్చేదానికన్నా ఎక్కువ ఆశిస్తారని మీకు తెలుసా?

Subscribe to Boldsky

కొందరి ప్రవర్తనను చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది. వారిని కనీసం మార్చే ప్రయత్నం కూడా చేయలేము, అలా ప్రవర్తిస్తుంటారు. ఒక్కోసారి వారి ప్రవర్తనలకు కూడా రాశిచక్రాలే కారణం అవుతుంటాయి. అందువలన వారిని మారాలని కోరుకోవడం కూడా మన తప్పే అవుతుంది.

ఇప్పుడు చెప్పబోయే రాశుల వారు, వస్తువులను తీసుకోవడానికి ఇష్టపడుతారు కానీ, తిరిగి ఇవ్వడానికి మనసు అంగీకరించదు. ఇవ్వకపోగా తప్పించుకుని తిరిగే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు.

మేషo మార్చి 21 – ఏప్రిల్ 19

మేషo మార్చి 21 – ఏప్రిల్ 19

వీరు ఎప్పుడూ తమ గురించి మాత్రమే ఆలోచనలను చేస్తుంటారు, ఇతరులు ఏమైతే నాకేం అన్న స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా కష్ట జీవులు, తమ జీవిత పురోగమనానికి ఉపయోగపడే ఎటువంటి విషయాలనైనా వదిలిపెట్టరు, తద్వారా తమకు ప్రయోజనం అనిపించిన ప్రతిదీ తమకే సొంతం కావాలన్న ఆలోచన చేస్తుంటారు. ఈ కారణం చేత వీరి ఆలోచనలు కొందరికి భాధగా అనిపిస్తుంటాయి. దీనికి రాశిచక్రమే సగం కారణం.

సింహం జూలై 23 – ఆగస్ట్ 23

సింహం జూలై 23 – ఆగస్ట్ 23

వీరు ఎక్కువగా తమను తాము కేంద్ర బిందువులా చూసుకోవాలన్న తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ప్రపంచంలో ఎక్కువగా ఆలోచించే విషయం ఏదైనా ఉంది అంటే, అది ఖచ్చితంగా వారే అయ్యుంటారు. తద్వారా కొన్ని అనువైన విషయాలను ఇతరుల నుండి సంగ్రహిస్తారు కూడా. వీరిలో కాస్త స్వార్ధ చింతన కూడా అధికంగానే ఉంటుంది. ఎప్పుడూ అన్నిటా కేంద్రబిందువులా ఉండాలనే ప్రయత్నాన్ని కలిగి ఉంటారు, పట్టించుకోనట్లు ఎవరైనా ఆలోచన చేస్తే అది వారికి నరకప్రాయమే.

కన్య ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

కన్య ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

వీరు ఇతరులను విమర్శించడానికి ఎప్పుడూ ముందు ఉంటారు, కానీ ఎవరైనా తమను విమర్శిస్తే అస్సలు ఒప్పుకోరు. ఎటువంటి విషయాలనైనా సరదాగా మార్చగల తత్వం వీరిది. వీరికి అభిమానులు కూడా ఎక్కువే. వీరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాత్రం అస్సలు సహించలేరు, మరియు ప్రతీకారేచ్చ కలిగి అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. గివ్ అండ్ టేక్ పాలసీలో , టేక్ అనే పదానికే ఎక్కువ విలువిస్తారు.

ధనుస్సు నవంబర్ 23 – డిసెంబర్ 22

ధనుస్సు నవంబర్ 23 – డిసెంబర్ 22

ఇతరులు ఏమనుకుంటున్నారు అన్న ఆలోచన వీరిలో అస్సలు కనపడదు. ఒక్కోసారి మాటి ఇచ్చి కూడా, పరిస్తితులు అనువుగా లేని పక్షంలో ఆ మాటను సైతం పక్కన పెట్టేస్తారు. వీరిలో కనిపించే ముఖ్య లక్షణం, మునుగుతుంటే కాపాడుతారు, కానీ తామే మునిగిపోతాము అని తెలిస్తే నిర్ధాక్షిణ్యంగా వదిలేస్తారు. ఈ లక్షణం కొన్ని విషయాల్లో మంచిదే కావొచ్చు కానీ, అనేక సమస్యలను మాత్రం తెచ్చిపెడుతుంది.

కర్కాటకం డిసెంబర్ 23 – జనవరి 20

కర్కాటకం డిసెంబర్ 23 – జనవరి 20

వీరు ప్రతి విషయంలోనూ ముందుంటారు. తాము ఎదుర్కునే ప్రతి విషయమునందు అనేక ప్రతికూల ప్రభావాలను చూస్తుంటారు, కానీ వీటిని ఎలా వదిలించుకోవాలి అన్న విషయంలో మాత్రం అవగాహన తక్కువగా ఉంటుంది. మిగిలిన రాశిచక్రాల కంటే భాద్యత అనేది కాస్త తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి భాద్యతా పరంగా ప్రవర్తిస్తున్నా కూడా, మనసుపొరల్లో కొంత స్వార్ధ చింతనను కూడా కలిగి ఉంటారు. వీరు ఏదైనా తీసుకోవడం మొదలుపెడితే, మీదగ్గర ఏమీ లేనంతవరకు తీసుకుంటూనే ఉంటారు. మీదగ్గర ఏమీ మిగల్లేదు అని వారికి అవగాహన వచ్చేదాకా. ఇది వీళ్ళ తప్పు కాదు , రాశిచక్ర ప్రభావమే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Zodiac Signs That Take More Than What They Can Give

    As astrology reveals most of the personality traits of an individual, it also reveals about the set of zodiacs that are known to have the most stingy people. These individuals have the inbuilt habit of only taking things and not giving anything in return. There are 5 such specific zodiac signs and they are Aries, Leo, Virgo, Sagittarius and Capricorn.
    Story first published: Thursday, April 12, 2018, 8:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more