ఈ రాశి చక్రాల వారికి ఖచ్చితంగా రెండవ అవకాశం ఇవ్వవచ్చు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

రాశి చక్రాలను బట్టి వ్యక్తుల యొక్క భవితవ్యంను సులభంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా 12 రాశులలో ఒక్కో రాశి వారికి ఒక్కో విధమైన వ్యక్తిత్వాలు, భిన్నమైన లక్షణాలు కలిగి ఉంటారు. అలాంటి లక్షణాలలో ప్రేమ కూడా ఒకటి.

ప్రేమలో ఉనప్పుడు ఒక్కోసారి భాగస్వామి చర్యలకు, మాటలకు చాలా భాధేస్తుంది . ప్రేమ కారణంగా ఒక్కోసారి వాటిని పెద్దగా పట్టించుకోరు కూడా. కానీ పరిధి దాటి మనసు చివుక్కుమనేలా ప్రవర్తిస్తే ? రెండవ అవకాశం కూడా ఇవ్వాలా ? లేదా వారిని వదిలేసి వెళ్లిపోవాలా?

ఇప్పుడు చెప్పబోయే 5 రాశి చక్రాలు, నిజాయితీ తో కూడిన పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తుంటారు. తద్వారా రెండవ అవకాశం ద్వారా మరోసారి అటువంటి తప్పు లేదా చర్యలకు పూనుకోకుండా, నిబద్దతను కలిగి ఉంటారు.

ఇప్పుడు చెప్పబోయే రాశి చక్రాల క్రమం వారి స్థాయిల ఆధారితంగా చెప్పబడినవి. వీరు రెండవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎన్నడూ ముందు ఉంటారు. వీరిని దూరం చేసుకోవడం కన్నా, వీరికి అవకాశం ఇవ్వడమే మంచిదిగా చెప్పబడింది.

కుంభం: జనవరి 21 – ఫిబ్రవరి 18

కుంభం: జనవరి 21 – ఫిబ్రవరి 18

ఈ రాశి చక్రానికి చెందిన వారు సాధారణంగానే మంచి వ్యక్తులుగా ఉంటారు. కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఇష్టులుగా ఉంటారు. ఒక్కోసారి వీరి అసహన ధోరణి కొన్ని సమస్యలకు కూడా కారణమవుతుంది. వీరి వలన మీరు భాధపడ్డారా ..? అది వీళ్ళ తప్పు కానేకాదు. వీరి రాశి చక్ర ప్రభావాలే అంత. మిగిలిన రాశి చక్రాల కన్నా, వీరు నిజ జీవితానికి దూరంగా ఉంటారు, తద్వారా వీరి ఆలోచనలు అందరిలాగే ఉండాలి అనుకోవడం పొరపాటు. వీరికి రెండవ అవకాశం ఇచ్చి చూడండి. మీకే తెలుస్తుంది వీరు మీపట్ల ఎంత నిజాయితీతో వ్యవహరిస్తారో, మరియు మీ పట్ల ఎంత ప్రేమను కలిగి ఉంటారో అని. ఈ రాశి చక్రం కలిగిన వారి విషయంలో తొందరపాటు తగదు.

కన్య: ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

కన్య: ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

వీరి మానసిక బలహీనతను ఎన్నటికీ ఒప్పుకోలేరు, అదే వీరి సమస్య. వీరి ఆలోచనలకు వీరి ప్రవర్తనకు సంబంధం కనిపించదు. వీరు కొంచం క్లిష్టతరంగా తొందరగా వ్యక్తిపై ఒక అభిప్రాయానికి వచ్చేస్తుంటారు. తద్వారా వీరి భావోద్వేగాలు అధికంగా ప్రదర్శితమవుతాయి. కానీ కాస్త సమయం తర్వాత వీరికి వీరే ఆలోచనలు చేసి లోలోపల పశ్చాత్తాపానికి గురవుతూ ఉంటారు. వీరు వ్యక్తిత్వంలో, నిబద్దతలో గొప్పవారుగా ఉంటారు. వీరిని దూరం చేసుకోవడం శ్రేయస్కరం కాదు. వీరికి రెండవ అవకాశం ఖచ్చితంగా ఇవ్వవచ్చు.

మకరం: డిసెంబర్ 23 – జనవరి 20

మకరం: డిసెంబర్ 23 – జనవరి 20

మనిషి కఠినం , మనసు సున్నితం అనే మాటకు సరిగ్గా సరిపోయే తత్వం వీరిది.

ఒకవేళ వీరు మిమ్ములని భాధపెట్టినట్లయితే, పెద్దగా పట్టించుకోవలసిన అవసరం కూడా లేదు. నిజానికి వీరు ఎక్కువగా లక్ష్య సాధనపైనే దృష్టిని కలిగి ఉంటారు, మరియు ఆ లక్ష్యం ప్రకారంగానే భాద్యతను కూడా కలిగి ఉంటారు. తద్వారా అనేక ఆలోచనలు చేస్తుంటారు. కావున పరధ్యానం లో ఉన్న సమయంలో వీరు ప్రవర్తించే తీరు వలన భాధకు గురవడం జరుగుతూ ఉంటుంది. కానీ వీరు ఏది ఆలోచించినా భవిష్యత్ ప్రణాళికలపైనే ఉంటుంది అనడం లో ఆశ్చర్యం లేదు. వీరు కుటుంబాన్ని, తమ ప్రియమైన వారిని దృష్టిలో ఉంచుకునే లక్ష్యం గురించిన ఆలోచనలు చేస్తుంటారు. పొరపాటున మీ పట్ల దురుసుగా ప్రవర్తిoచినా కూడా, ఒక్కసారి తప్పు చేశామన్న భావనకు వస్తే, మీ పట్ల పశ్చాత్తాప ధోరణిని , మీ మాటల పట్ల నిబద్దతను ప్రదర్శిస్తారు . వీరు రెండవ అవకాశానికి ఖచ్చితంగా అర్హులే.

తుల: సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

తుల: సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

వీరిలోని తేజస్సు అసామాన్యమైనదిగా ఉంటుంది. తులా రాశి వారు ఎన్నటికీ ప్రత్యేకమే. కానీ వీరికి అర్ధం చేసుకునే లక్షణాలు మాత్రం కాస్త తక్కువగానే ఉంటాయి . వీరు ఏం ఆలోచించినా తమ ప్రియమైన వారు , కుటుంబ సభ్యులు , సన్నిహితులు , స్నేహితుల సంతోషానికే పాటుపడుతూ ఉంటారు. అలాంటి వారు పొరపాటున చేసిన తప్పును, వేలెత్తి చూపడం సరికాదు. వీరి ప్రేమలో ఉండడం అంటే, అది ప్రేమ సాగరం లో ఉన్నట్లే. వీరు నిజాయితీకి మారుపేరుగా ఉంటారు. ప్రేమ లో ఉన్నప్పుడు సమాన హక్కులను భాగస్వాములకు ఇచ్చేవారిలా ఉంటారు. కావున వీరు రెండవ అవకాశానికి ఖచ్చితంగా అర్హులు.

మేషం: మార్చి 21- ఏప్రిల్ 19

మేషం: మార్చి 21- ఏప్రిల్ 19

వీరు ప్రత్యేకంగా పోటీ తత్వాన్ని, దూకుడును ప్రదర్శిస్తూ ఉంటారు. తద్వారా ఇతరులకు తప్పుడు సంకేతాలను చేరవేస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా ఉన్నతమైన భావాలు కలిగి ప్రేమలకు విలువనిచ్చే వారిలా ఉంటారు . కానీ వీరి ప్రవర్తన అర్ధం చేసుకోవడం ఒక్కోసారి కష్టతరంగా ఉంటుంది. తద్వారా అనేక సమస్యలకు కేంద్ర బిందువు గా మారుతుంటారు. కానీ వీరికి పశ్చాత్తాప ధోరణి కూడా అధికంగా ఉంటుంది. వీరి తప్పులకు రాశిచక్రమే ప్రధాన కారణం. మరోపక్క వీరు నీతి నిజాయితీలకు మారుపేరుగా ఉంటారు. వీరితో జీవనం అనేది ఉగాది పచ్చడిలా ఉంటుంది. వీరిని పొరపాటుగా దూరం చేసుకున్నా కానీ, మనసు వీరి నుండి వెళ్లలేదు. అంత ప్రేమను అందిస్తారు. అలాంటి వీరికి రెండవ అవకాశం ఇవ్వకుండా ఉండగలమా .

ఇక్కడ మీ భాగస్వామి లేదా ప్రియమైన వారి రాశిచక్రాలు ఉన్నాయా? అయితే కామెంట్ బాక్స్ లో తెలుపండి. రాశిచక్రాలకు సంబంధించిన అనేక విషయాలను తెలుసుకొనేందుకు ఈ పేజీని సందర్శిస్తూ ఉండండి.

English summary

Zodiac Signs That Totally Deserve A Second Chance

Can you imagine that there are certain zodiac signs the individuals of which truly deserve a second chance? Well, these people truly mean to mend their mistakes and start afresh. They can simply not cheat or hurt you again when you give them another chance. These signs are Aquarius, Virgo, Capricorn, Libra, and Aries.