కొన్ని రాశిచక్రాలు విశ్వాసానికి, నిబద్దతకు మారుపేరు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

కొన్ని రాశిచక్రాల సంబంధిత వ్యక్తులు ఏదేని సంబంధంలో కొనసాగుసమయంలో భాగస్వాములతో అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. మరియు తమ భాగస్వామి కూడా తమలాగే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి రాశిచక్రాల గురించిన వివరాలు ఇక్కడ పొందుపరచడం జరిగినది.

విశ్వాసం, నిబద్దత కు మారుపేరుగా ఈ రాశిచక్రాలు అన్నిటికన్నా ముందుగా చెప్పబడుతున్నవి. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భాగస్వాముల పట్ల నటన కలిగి ఉండరు. సంబంధాలపట్ల ప్రత్యేకమైన విశ్వాసాలను కలిగి ఉంటారు.

కర్కాటకం జూన్ 21 – జూలై 22

కర్కాటకం జూన్ 21 – జూలై 22

వీరు అధికంగా భావోద్వేగాలను కలిగి ఉంటారు, మరియు సున్నితమైన మనస్కులుగా ఉంటారు. మోసం అనే పదానికి దూరంగా ఉండే స్వభావం వీళ్ళది. వీరు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతని ఇస్తుంటారు , వీరి మెదడు నిండా కుటుంబ శ్రేయస్సు గురించిన ఆలోచనలే ఉంటాయి. మరియు భాగస్వామి పట్ల అత్యంత నిబద్దతను ప్రదర్శిస్తూ ఉంటారు. మోసం చేయాలన్న ఆలోచన రావడం అంటే చావుతో సమానంగా భావిస్తారు వీళ్ళు.

వృషభం ఏప్రిల్ 20- మే 20

వృషభం ఏప్రిల్ 20- మే 20

మోసపూరిత ఆలోచనలలో పోల్చి చూస్తే రాశిచక్రాలలో కింది నుండి ప్రధమ స్థానంలో ఉంటారు. వీరు కుటుంబానికి, మరియు భాగస్వామి పట్ల అత్యంత విధేయతను కలిగి ఉంటారు. వీరి ఆలోచనల నిండా కుటుంబమే ఉంటుంది అనడంలో ఆశ్చర్యంలేదు. తల్లి దండ్రులను ఎంతగా ప్రేమిస్తారో భాగస్వామిని కూడా అంతే సమానంగా ప్రేమిస్తారు. వృషభ రాశి వారికి కోపం ఎక్కువ అని అంటారు కానీ నిర్ణయాత్మక ధోరణి కలిగి ఉంటారు. వీరు వేసే ప్రతి అడుగు తమ కుటుంబ ఎదుగుదలకు ఉపయోగపడాలన్న ఆలోచన వీరి సొంతం. విశ్వాసం, నిబద్దతకు నిలువెత్తు దర్పణాలుగా ఉంటారు.

మకరం డిసెంబర్ 23 – జనవరి 20

మకరం డిసెంబర్ 23 – జనవరి 20

వీరు భాగస్వామిని భాధపెట్టుటకు సుముఖంగా ఉండరు, అబద్దం చెప్పినా వారి సంతోషానికే అన్న ఆలోచన వీరిది. అలాగని మోసపూరిత స్వభావం కలిగిన వారు మాత్రం కాదు. మోసం చేసి పట్టుబడితే జరిగే తీవ్రపరిణామాల గురించి పూర్తి అవగాహన కలిగిన వారిగా ఉంటారు. తద్వారా వీరి ఆలోచనలలో మోసం అన్న పదమే కనపడదు.

కన్య ఆగస్ట్ 24 సెప్టెంబర్ 23

కన్య ఆగస్ట్ 24 సెప్టెంబర్ 23

వీరు ఇష్టపడిన వ్యక్తితో సంబంధంలో ఉంటే, వీరు ఆ భాగస్వామి పట్ల అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు.సంబంధాలను ఉన్నతంగా మలచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కువగా సంబంధం పట్ల ఆచి తూచి నిర్ణయాత్మక ధోరణితో ముందుకు సాగే అలవాటు కలిగిన వారు. కావున వీరు సంబంధంలో మోసం ద్వారా సమస్యలు సృష్టించుకోడానికి ఎన్నటికీ సిద్దంగా ఉండరు.

మీనం ఫిబ్రవరి 19 – మార్చి 20

మీనం ఫిబ్రవరి 19 – మార్చి 20

ఈ రాశిచక్రానికి మోసం అనే పదానికి దూరం కాస్త ఎక్కువే ఉంటుంది. సుమారుగా భూమికి సూర్యుని మద్య దూరం లాగా. కకపోతే వీరు అత్యంత సున్నిత మానస్కులు, ఊహా ప్రపంచానికి వాస్తవికతకు పోల్చి చూసుకోవడం వీరికి పరిపాటిగా ఉంటుంది. తద్వారా సంబంధంలో కొన్ని కలతలు అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మోసం అనే ఆలోచన మాత్రం వీరి మనసులో ఎన్నటికీ రాదు. భాగస్వామిపట్ల అంత విధేయులై ఉంటారు.

English summary

Zodiac Signs Which Are Known To Remain The Most Faithful To Their Partners

Honesty can be defined as per your zodiac sign as well. There are those zodiac signs which are known to be the best when it comes to being faithful. These signs do not hesitate to stand up when it comes to being loyal. These zodiac signs are ranked according to their loyalty. They are Cancer, Taurus, Capricorn, Virgo and Pisces.
Story first published: Thursday, April 5, 2018, 16:30 [IST]