ఈ రాశులకు చెందిన వారు అత్యంత శక్తివంతులు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఒక మనిషిని శక్తివంతంగా మార్చే శక్తి దేనికుంది? వారి జన్మనక్షత్రాలకు ఉందా? లేదా సహజంగానే వ్యక్తులు శక్తివంతంగా పుడతారా?

నిజానికి, మన వ్యక్తిత్వాలను నిర్వచించడంలో స్టార్స్ అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొన్ని రాశులు మిగతావాటికంటే అత్యంత శక్తివంతంగా ఉంటాయి.

ఈ ఆర్టికల్ లో ని ప్రస్తావించబడిన ఈ అయిదు రాశిచక్రాలు అన్నిటికంటే శక్తివంతమైన రాశిచక్రాలు.

అధికారాన్ని అందుకోవడం శక్తివంతంగా ఉండటం ఈ రాశిచక్రాలకు సహజంగానే సులభం.

వీటిలో మీ రాశిచక్రం ఉందేమో పరిశీలించండి మరి...

వృషభరాశి: ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి: ఏప్రిల్ 20 - మే 20

అన్ని రాశిచక్రాలలో ఇది ఎంతో శక్తివంతమైన రాశిచక్రం. వీరికి సహనం ఎక్కువ. అలాగే వీరిలో ఆధ్యాత్మిక అలాగే ఆచరణాత్మక ఆలోచనలు ఎక్కువ. వీరు నమ్మదగిన వారు. వీరు బాధ్యత కలిగిన వారు. ఈ లక్షణాలన్నీ వీరిని ఆదర్శ వ్యక్తిగా మారుస్తాయి. జీవితంలోని ప్రతి దశలో వీరు అధికారాన్ని ప్రదర్శించగలుగుతారు. ప్రొఫెషనల్ లేదా సోషల్ అయినా లేదా ఫిజికల్ ఎబిలిటీస్ లోనైనా వీరు శక్తివంతమైన వ్యక్తులుగా పేరొందుతారు.

సింహరాశి: జులై 23 - ఆగష్టు 22

సింహరాశి: జులై 23 - ఆగష్టు 22

ఈ రాశికి చెందిన వారు ఇతరులపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరి ని హ్యాండిల్ చేయడం కష్టం. వీరు అనుకున్నది జరగాలన్న ధోరణిలో ఉంటారు. ఈ లక్షణం వలన వీరు శక్తివంతమైన వ్యక్తిగా మారతారు. అయితే, ఈ లక్షణం వల్లనే వీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇతరులపై ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటారు. మరోవైపు, వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగిన వారు.

వృశ్చికరాశి: అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చికరాశి: అక్టోబర్ 23 - నవంబర్ 21

వీరు అద్భుతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. వీరి కెరీర్ లో అత్యున్నతిని పొందుతారు. వీరి దృఢ సంకల్పం వీరిని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది. ఆదర్శ నాయకులుగా వీరిని తీర్చిదిద్దుతుంది. వీరి ధైర్యం అలాగే మొండితనం వలన వీరు ఇబ్బందులను ఎదుర్కోరు. ఛాలెంజెస్ ను కూడా వీరు ఆస్వాదిస్తారు. లక్ష్యాన్ని చేరుకుంటారు.

ధనుస్సు రాశి: నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనుస్సు రాశి: నవంబర్ 22 - డిసెంబర్ 21

వీరు ఆశావాద, ఆదర్శవాద మరియు ఔత్సాహిక వ్యక్తులు. వీరిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. వీరి ఎమోషనల్ స్ట్రెంత్ వీరి బలం. మరోవైపు, లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతటి కష్టమైనా పడేందుకు వీరు సిద్ధంగా ఉంటారు.

మకరరాశి: డిసెంబర్ 22 - జనవరి 19

మకరరాశి: డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశికి చెందిన వారు అత్యంత శక్తివంతులు. సెల్ఫ్ కంట్రోల్ వీరికి అధికం. ఇదే వారి బలం. మరోవైపు, ఈ రాశికి చెందిన వారు శారీరకంగా కూడా ఫిట్ గా ఉంటారు. శారీరక అలాగే మానసిక బలం వలన వీరు అత్యంత శక్తివంతులుగా పేరొందుతారు.

మీ జోడియాక్ సైన్ గురించి ఇక్కడ వివరించబడలేదా? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో మాకు తెలియచేయండి.

English summary

Zodiac Signs Which Are Ranked As The Most Powerful Zodiac Signs

There are 5 zodiac signs that are listed as the most powerful zodiac signs. These zodiac signs are known to rule over other zodiac signs instantly. Being in power is something that comes naturally to them. These zodiac signs are Taurus, Leo, Scorpio, Sagittarius and Capricorn.Most Powerful Zodiac Signs Listed
Story first published: Friday, May 11, 2018, 10:50 [IST]