For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ యజమానితో అంగీకరించలేకున్నారా ? మీ రాశి చక్రాల ఆధారంగా, ఇలా నిర్వహించండి.

మీ యజమానితో అంగీకరించలేకున్నారా ? మీ రాశి చక్రాల ఆధారంగా, ఇలా నిర్వహించండి.

|

మీ యజమానితో అంగీకరించలేకున్నారా? మీ రాశి చక్రాల ఆధారంగా, ఇలా నిర్వహించండి.

మన రాశి చక్రం యొక్క సంకేతాలతో వ్యక్తి యొక్క రుచులు అభిప్రాయాలు మరియు అభిరుచులు వంటి అనేక విషయాలను అంచనా వేయవచ్చని మనలో చాలా మందికి తెలుసు, కానీ రాశి చక్రాల సహాయంతో మీరు విభేదాలకు స్పందించే విధానాన్ని కూడా అంచనా వేయగలరని తెలుసా ?

మన జ్యోతిషశాస్త్ర ప్రధాన లక్ష్యం ఏమిటంటే, మీ వ్యక్తిత్వాన్ని మీరు ఎలా ప్రదర్శించాలో, తద్వారా పరిస్థితులకు ఎలా స్పందించాలో నిర్వచిస్తుంది.

Zodiacs Reveal On How You Should Handle Your Disagreement With Your Boss

భూమి సంకేతాలు ఆందోళన కలిగించే ధోరణిని కలిగి ఉంటాయి, మరోవైపు నీటి సంకేతాలు భావోద్వేగ అనుభూతి చెందుతాయి, మరియు అగ్ని సంకేతాలు చింతను కలిగిస్తుందని భావిస్తున్నారు, అలాగే గాలి సంకేతాలు కొన్నిసార్లు సానుకూల ఫలితాలను కూడా ఇవ్వగలవు అని అంచనా వేయబడింది.

ఇక్కడ, ఈ వ్యాసంలో, రాశిచక్రాల సంకేతాల ఆధారంగా తమ వృత్తి నందు, తమ యజమానిని విభేదించే అవకాశాల గురించిన వివరాలను పొందుపరచడం జరిగినది.

కొన్ని రాశి చక్రాలు అమాయక ధోరణి ప్రదర్శించగా, కొన్ని మాత్రం తుఫాను మూడవ ప్రమాద హెచ్చరికలలా ఉంటాయి ! ఇక్కడ, సూర్యమాన సిద్దాంతాన్ని అనుసరించి, మేము అన్ని రాశి చక్రాల గురించిన వివరణ ఇవ్వడం జరిగింది.

మేష రాశి: మార్చి21-ఏప్రిల్ 19

మేష రాశి: మార్చి21-ఏప్రిల్ 19

మేష రాశికి చెందిన వారితో చర్చలు జరిగేటప్పుడు వ్యూహాత్మక ధోరణితో వ్యవహరించవలసి వస్తుంది. వీరు చేసిన పనికి తగిన ప్రోత్సాహకాన్ని ఆశిస్తారు. వీరు పనికి తగ్గ ప్రతిఫలాన్ని పొందలేకపోయినా, తగ్గ గుర్తింపును ఇవ్వకపోయినా వీరి కోపానికి గురికాకతప్పదు. వీరు మొండి పట్టుదల వీడి పరిస్థితులు చక్కబడేలా మార్గాలు అన్వేషించవలసి ఉంటుంది.

వృషభ రాశి: ఏప్రిల్20-మే 20

వృషభ రాశి: ఏప్రిల్20-మే 20

వృషభ రాశికి చెందిన వారు రాజీకి సిద్ధంగా ఉండాలి. మొండి పట్టుదల మరియు నిర్ణయాత్మక ధోరణి కల్గిన వీరు అన్ని వేళలా విజయాలను పొందగలరు కానీ, అసమ్మతి విషయాలలో ఇరుపక్కలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. యజమాని మాటలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవలసి వచ్చిన ఎడల, వారితో సరైన చర్చలు జరిపి, మీ నిర్ణయాల వలన కలిగే ప్రయోజనాలను వివరించడం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారమవ్వగలవు.

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి సంబంధించిన వ్యక్తులు తెలివిగా వాదించగలిగేలా ఉండాలి. ఈ వ్యక్తులు ఖచ్చితంగా మంచి తెలివితేటలను బహుమతిగా కలిగి ఉంటారు. కానీ వారు తమ యజమానితో జాగ్రత్తగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటారు. కావున యజమానిగా ఉన్న వ్యక్తి పట్ల గౌరవం కలిగి, మరియు వారి మాటలు వినడం తద్వారా వారి నిర్ణయాలన్నింటినీ ప్రశ్నించకుండా సహకారం అందించినట్లయితే, మీ యందు విశ్వసనీయతతో, మీ పట్ల ఒక సానుకూల భావనను కలిగి ఉంటారు.

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి వారు అవసరాన్ని బట్టి పరిస్థితిని నడుపవలసి ఉంటుంది. ఈ రాశి వారు యజమానిని ఏదైనా విషయం గురించి అడిగినప్పుడు చులకన భావానికి గురవుతామేమో అన్న భావనలోనే ఎక్కువగా ఉంటారు, కానీ వారి ఆలోచనలను యజమానికి స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరo ఉంటుంది. వీరి ఆలోచనలను ఎవరు కూడా చదవలేరని గుర్తుంచుకోవాలి.

సింహ రాశి : జూలై 23 - ఆగస్ట్ 23

సింహ రాశి : జూలై 23 - ఆగస్ట్ 23

సింహ రాశి చెందిన వ్యక్తులు అన్నిటికన్నా ముందు ప్రశాంతంగా ఉండడం మంచిది. ఉద్వేగభరితమైన ఆలోచనలు చేస్తూ మనసుకు తోచినట్లు నడుచుకోవడం వీరి శైలి. ఎవరైనా వీరిపట్ల విముఖతను, అశ్రద్దను చూపడం చేస్తే, వీరి కోపం పరాకాష్టకు చేరుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా వీరిపట్ల ఒక ఆలోచనను, ఇతరులు కలిగి ఉండడాన్నే వీరు ఆహ్వానిస్తారు. ఈ వ్యక్తులు ఇతర దృక్కోణాల నుండి చూసినప్పుడు గొప్పగా ఉంటారు. యజమానిని వ్యతిరేకించడం అన్న భావనను పక్కన పెట్టి, ఒక అడుగు వెనక్కి వేసి విశాల హృదయంతో, తెలివితో చర్చలు జరుపవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే పరిస్థితులు పూర్తిగా చేయి జారిపోయి, నిరంతరం యజమాని పట్ల హేయభావం ప్రదర్శిస్తూనే ఉంటారు. కావున సర్దుకుపోయే గుణాన్ని అలవరచుకోవలసినదిగా సూచించడమైనది.

కన్యా రాశి : ఆగస్టు 24 -సెప్టెంబర్ 23

కన్యా రాశి : ఆగస్టు 24 -సెప్టెంబర్ 23

కన్యా రాశికి చెందిన వ్యక్తులు సమస్యల యందు సరైన పరిష్కారం ఇవ్వగలరు. వీరి ప్రణాళికా బద్దమైన ఆలోచనలు అనేక సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వగలవు,. కానీ మరోవైపు, వీరు వాదనలు చేసే వారిలా ఉంటారు. వాదనలు పక్కనపెట్టి, సున్నితంగా పరిష్కారాలు సూచించే మార్గంపైన దృష్టిని కేంద్రీకరించాలి. మీ ఆలోచన సరైనదే కావొచ్చు, కానీ మీ యజమానికి మీ వాదన అర్ధమవ్వాలి అంటే సున్నితత్వం ఉండాల్సిన అవసరం ఉంది. మీరు వాదించే విధానం, ఆలోచనను పక్కదారి పట్టిస్తుంది అని మాత్రం మరవొద్దు.

తులా రాశి : సెప్టెంబర్ 24 -అక్టోబర్ 23

తులా రాశి : సెప్టెంబర్ 24 -అక్టోబర్ 23

తులా రాశి వ్యక్తులు, సమస్య ఎక్కడనుండి వచ్చిందో అన్న ఆలోచన చేయగలగాలి. వీరు విశదీకరించే ప్రతి విషయం మీద అవగాహన కలిగి ఉండాలి. ఈ రాశి ప్రకారం వీరు తెలివైన వారిగా, సమస్యలు సామరస్యంగా పరిష్కరించగలిగే వారిగా ఉంటారు . మరో పక్క వీరు ఎటువంటి నిర్లక్ష్య ధోరణిని సహించలేరు. యజమాని తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, సహనంతో మొదట్లో వ్యవహరించినా, నెమ్మదిగా వీరి కోపం తారాస్థాయికి చేరుతుంది. తద్వారా అసలు సమస్య పక్కకు వెళ్లి, కొత్త సమస్యలు ఏర్పడుతాయి. కావున అన్నిటా దూకుడు తగదని గుర్తుంచుకోవాలి. వీరి ఆలోచనా శైలి, తెలివితేటలకు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే శక్తి వీరి సొంతం. వీరికి వృత్తిపరంగా ఇంటా బయటా అత్యంత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. తద్వారా తమ ప్రియమైన మరియు సహోద్యోగుల సలహా మేరకు నిర్ణయాలు తీసుకుని ముందుకు నడిచే వారిలా ఉండాలి. యజమానితో తగవుల కన్నా, వారి ఆలోచనలను కూడా క్రోడీకరించుకుని పరిస్థితులు చక్కబడేలా ప్రణాళికలు చేయవలసి ఉంటుంది.

వృశ్చిక రాశి : అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చిక రాశి : అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చిక రాశికి చెందిన వారు వారి యజమానితో ఒక ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంటుంది. తమకు అనుకూలంగా లేని వ్యక్తులను వీలైనంత దూరంగా ఉంచేలా ప్రయత్నిస్తూ ఉంటారు. మరోవైపు, వారి యజమాని వేరొక మార్గంలోకి వెళ్తే, ఆ మార్గం తమ ఆలోచనలకు వ్యతిరేకంగా భావించకూడదు. దానికి బదులుగా, మీ యజమాని ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడో తెలుసుకుని, సాధ్యాసాధ్యాలను తెలుసుకుని , వీలయితే వారితో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చేలా పావులు కదపాలి.

ధనుస్సు రాశి : నవంబర్ 23-డిసెంబరు 22

ధనుస్సు రాశి : నవంబర్ 23-డిసెంబరు 22

ధనుస్సు రాశి వారు కొన్ని విషయాలనందు కఠిన నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యక్తులు ఏదైనా కార్యాలయ వివాదంలో చిక్కుకున్నట్లైతే,వీరు తేలికగానే బయటపడే సూచనలు ఉన్నాయి. మామూలుగా వీరికి తమ కార్యాలయంలో తమ యజమానితో సహా అందరి సహకారం ఉంటుంది. కానీ ఏదైనా పొంతన కుదరని పక్షంలో వీరు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, తద్వారా సమస్యలు పరిష్కారమవడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది.

మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20

మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20

మకర రాశి వ్యక్తులు కొంచం కోపిష్టి రకాలని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా సమస్యలను క్షుణ్ణంగా అర్ధం చేసుకుని, తమ వలన ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవకూడదన్న ఆలోచనలను కలిగి ఉండాలి. వీరు కొంచం అసమ్మతిని ఎదుర్కొన్నంత మాత్రాన, విజయావకాశాలు పోయాయి అనుకోవడం మాత్రం సరికాదు. వారు చేయవలసినది ఏదైనా ఉంటే, కార్యాలయాలలో తమని తాము నిలబెట్టుకోవటానికి వృత్తి పట్ల నిబద్దత కలిగి ఉండడం, సహోద్యోగులతో సన్నిహితంగా మెలగడం చేస్తుండాలి. యజమానితో వ్యర్ధవాదనలు లేకుండా, పరిస్థితి గురించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. మీతోటి చేసే సమిష్టి ఆలోచనలు సమస్యలను దూరం చేయగలవు.

కుంభ రాశి : జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభ రాశి సంబంధిత వ్యక్తులు తమ అసమ్మతిని, ఆలోచనలను అంతర్గతంగా మనసులోనే ఉంచుకోవలసి ఉంటుంది. ఈ వ్యక్తులు గాసిప్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు, కానీ వాటిని బహిర్గతం చేయడానికి కూడా ఒక సమయం ఉంటుందని తెలుసుకోవాల్సి ఉంటుంది. తమ యజమాని తో వ్యవహరించేటప్పుడు, గాసిప్స్ కు అవకాశo ఇవ్వరాదు. మీరు ఉండే విధానాన్ని అనుసరించే మీ సహోద్యోగులు కూడా మీతో మెలుగుతారని గుర్తుంచుకోండి. యజమాని నిర్ణయాలతో మీరు ఏకీభవించని ఎడల, మీ సహోద్యోగులే మీకు అండగా ఉంటారని మరవొద్దు.

మీన రాశి: ఫిబ్రవరి 19-మార్చి 20

మీన రాశి: ఫిబ్రవరి 19-మార్చి 20

మీనరాశికి చెందిన వ్యక్తులు ఇతరుల గురించి కన్నా తమ గురించే ఎక్కువ ఆలోచనలను కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు స్వేచ్ఛాజీవులుగా ఉండుటకు ఇష్టపడుతుంటారు. కానీ ప్రజలు వీరిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న ఎడల వారు అధిక కోపానికి గురవుతూ ఉంటారు. తద్వారా ప్రతికూల భావాలతో ముందుకు కదులుతారు. వీరు ఏ పని చేసినా తమకే కాకుండా తమ సంస్థకు కూడా మేలు కలిగేలా ఆలోచనలు చేస్తుంటారు. తద్వారా ఎవరు వీరి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా అస్సలు తట్టుకోలేరు. వీరి ఆలోచనా విధానాల ప్రకారం, తమ చుట్టుపక్కల పరిస్థితులు తమ ఆలోచనలకు తగ్గట్లే ఉండాలన్న ఆలోచన చేస్తుంటారు. ఏమాత్రం వీరికి తగ్గట్లు పరిస్థితులు కనపడకపోయినా, చాలా అసౌకర్యానికి లోనవుతూ ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని వీరు గుర్తించవలసి ఉంటుంది.

మీకు ఈ వ్యాసం నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక రాశి చక్రాల సంబంధిత వివరాల కోసం తరచూ బోల్డ్స్కీని సందర్శించండి.

English summary

Zodiacs Reveal On How You Should Handle Your Disagreement With Your Boss

Conflict can be tough at the best of times, but when you disagree with your boss, then it can feel like a whole new level of drama. Having some productive disagreements start with knowing and understanding on what you want, and working backwards to get it right. Handling disagreement can be done like a pro, based on your zodiac tips!
Story first published:Friday, May 25, 2018, 15:55 [IST]
Desktop Bottom Promotion