Latest Updates
-
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.!
PDA అధికంగా ఉండే జన్మరాశులు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారా! PDA (public display of affection: నలుగురిలో ప్రేమను ప్రదర్శించడం)
PDA అధికంగా ఉండే జన్మరాశులు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారా! PDA (public display of affection: నలుగురిలో ప్రేమను ప్రదర్శించడం)
ప్రేమలో ఉన్న జంట, ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం అనేది వారి జీవిత మధురక్షణాల్లో ముఖ్యమైనవిగా నిలిచిపోతాయి. ఆ జంట ఒకరిపై ఒకరికిన్న ప్రేమను ప్రపంచం ముందు దాచిపెట్టినట్లైతే, అందులో ఆనందం ఉండదు.
అయితే, కొన్ని జన్మరాశుల వారు ప్రపంచం ముందు ప్రేమను వెల్లడించడంలో, తమ భాగస్వామికి నలుగురు మధ్య వ్యక్తపరచడంలో సిద్ధహస్తులు.
ఈ వ్యాసం ద్వారా, బహిరంగంగా వారి ప్రేమను వ్యక్తపరచడంలో అత్యుత్తమంగా వ్యవహరించే నాలుగు జన్మరాశుల వారిని గురించిన విశేషాలను అందిస్తున్నాం.
ఆ రాశులేవో, అందులో మీ జన్మరాశి ఉందో లేదో, చదివి చూడండి.

వృషభం: ఏప్రిల్ 20- మే 20
వీరు దయార్ద్ర హృదయులే కాక సున్నిత మనస్కులు కూడా. స్పర్శను వారు ప్రేమ వ్యక్తీకరించే భాషగా భావిస్తారు. వారు ఎవరినైనా ఇష్టపడితే, ఆ విషయాన్ని వ్యక్తపరచకుండా ఉండలేరు. వారు భావోద్వేగాలను లేదా అభిమానాన్ని వ్యక్తీకరించేటపుడు, ఏకాంతంలో ఉన్నా , నలుగురి మధ్యలో అయినా, వ్యక్తం చేయడంలో వారికివారే సాటి. వారి స్పర్శ మరియు అభిమానం వారి భాగస్వాములను విచలితులను చేస్తుంది. వారు ఈ విధంగా ప్రేమను తెలియపరచడానికి వెంపర్లాడతారు. తమ చేతులనెప్పుడు భాగస్వామి నుండి దూరంగా పెట్టుకోలేరు. ఎప్పుడు భాగస్వామి వీపు రుద్దుతూనో, చుంబిస్తూనో కనిపిస్తారు. ఇంకా, వారెప్పుడు పబ్లిక్ లో కూడా తమ భాగస్వామి చేయి వీడరు.

తుల: సెప్టెంబర్24౼అక్టోబర్23
వీరు నలుగురి ఎదుట తమ ప్రేమను చాటడాన్ని ఇష్టపడతారు. ఇది తాము ప్రేమించే వ్యక్తులకు అత్యంత సన్నిహితంగా మెలగాలని తమ మనసులో పుట్టే కోరిక వలన జరుగుతుంది. వీరు సున్నిత మనస్కులైనప్పటికి తమ భావోద్వేగాలను బయటపెట్టడంలో మాత్రం వెనుకడుగు వేయరు. వీరు రొమాంటిక్ గా, సరదాగా ఉంటూ, ఎటువంటి సామాజికపరమైన పరిస్థితినైనా తేలికగా తీసుకుంటారు. వీరు ఇతరులు తమ గురించి ఏమనుకుంటారో అని వ్యాకులపడరు. వీరు అతి సాధారణంగా తమ భాగస్వామి భుజాల చుట్టూ చేతులు వేసి చుట్టేస్తారు. నలుగురి మధ్య ప్రేమను వ్యక్తం చేయడం, వీరికి సహజంగానే అబ్బిన లక్షణం.

వృశ్చికం: అక్టోబర్ 24- నవంబర్ 22
PDA వలన కలత చెందితున్న వృశ్చిక రాశివారిని గురించి మీరు ఎరుగుదురా? నలుగురి ముందు ప్రేమను వ్యక్తపరచడంలో ఆరితేరినవారిలో వృశ్చిక రాశివారు ఒకరు. వారు భౌతికమైన స్పర్శ విషయంలో శక్తివంతంగా మరియు ఉద్వేగభరితంగా ఉంటారు. కొన్ని సందర్భాలలో వీరికి ఇది ఒక వ్యసనంగా మారిపోతుంది. కనుక, వీరు తమ అభిరుచులను సరిపోలి ఉన్న స్వభావం కలిగిన భాగస్వామికై అన్వేషించడం మంచిది, లేని యెడల వారి బంధం ఇబ్బందికరంగా పరిణమిస్తుంది.

ధనుస్సు: నవంబర్ 23-డిసెంబర్ 22
ధనూ రాశికి చెందిన వారు ఉత్తేజకరమైన హృదయం కలిగి ఉంటారు. ప్రపంచం తమ గురించి ఏమముకుంటుందనేది వీరు పట్టించుకోరు కనుక తమ భావోద్వేగాలను పంచుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయరు. వీరు నలుగురిలో ఉన్నప్పుడు చాలా సున్నితంగా ఉంటారు. అంతేకాక వారి ప్రేమను చాలావరకు భౌతిక స్పర్శతో తెలియజేయడాన్ని ఇష్టపడతారు కనుక వారి చేతులు ఎప్పుడు భాగస్వామిని అంటుకునే ఉంటాయి.
మీరూ ఇష్టపడే జన్మరాశి పైన వివరించిన చిట్టా లో ఉందా? జన్మరాశులకు సంబంధించిన మరీన్ని అంశాల కోసం మా ఈ విభాగాన్ని సందర్శిస్తూనే ఉండండి.



Click it and Unblock the Notifications
