For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hbday Allu Arjun : ‘పుష్ప’ గురించి ఈ సీక్రెట్స్ మీకు తెలుసా...

తన నటనతోనూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడీ అల్లు వారి అబ్బాయి. అల్లు వారి వారసుడిగా గంగోత్రి తెరంగేట్రం చేసిన ఈ కుర్రాడు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.

|

అల్లు అర్జున్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులంతా ఆయనను ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారు. తన డ్యాన్స్ లతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా, తన నటనతోనూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడీ అల్లు వారి అబ్బాయి.

Allu Arjun Birthday Special

అల్లు వారి వారసుడిగా గంగోత్రి తెరంగేట్రం చేసిన ఈ కుర్రాడు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. క్లాస్ అయినా.. మాస్ అయినా.. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అయినా.. ఫ్యామిలీ అయినా.. యాక్షన్ అయినా.. మల్టీ స్టారర్ రోల్స్ అయినా..ఎక్సపరింమెంటల్ తో పాటు

Allu Arjun Birthday Special

ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోవడంలో తనను తాను బాగానే మలచుకున్నాడు. అలాంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఈరోజు. ఇటీవలే పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సందర్బంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

అల్లుఅర్జున్ బాల్యం..

అల్లుఅర్జున్ బాల్యం..

అల్లు అర్జున్ 1982లో ఏప్రిల్ 8వ తేదీన తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నిర్మలకు జన్మించాడు. అల్లుఅర్జున్ చిన్ననాటి నుండి సుమారు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు అక్కడే పెరిగాడు. దీంతో చెన్నైలోనే చదువుకున్నాడు. అల్లు అర్జున్ కు ఓ సోదరుడు అల్లు శిరీష్.. మరో సోదరుడు అల్లు వెంకటేష్ కూడా ఉన్నాడు.

డ్యాన్స్ అంటే ఇష్టం..

డ్యాన్స్ అంటే ఇష్టం..

అల్లు అర్జున్ కు చిన్ననాటి నుండే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన చిన్నప్పుడే వారి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగితే రామ్ చరణ్, అల్లు అర్జున్ పోటీ పడి మరీ డ్యాన్సులు చేసేవారట. తనలోని ప్రతిభను గుర్తించిన మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమాలో ఓ పాత్రలో నటించేందుకు అవకాశమిచ్చాడు.

బాల నటుడిగానూ..

బాల నటుడిగానూ..

అల్లు అర్జున్ డాడీ సినిమాలో కంటే ముందుగానే ‘విజేత‘ సినిమాలో ఓ బాల్య నటుడి పాత్రలో నటించాడు. ఆ తర్వాతే డాడీ సినిమాలో డ్యాన్సర్ గా కనిపించాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ‘గంగోత్రి ద్వారా కథానాయకుడిగా తెలుగు వెండి తెరపై అడుగు పెట్టాడు.

ఆర్జీవీ బర్త్ డే స్పెషల్ : ఎవరో ఒకరిని ‘రోజూ గిల్లే వాడే‘(RGV)వర్మ...ఆర్జీవీ బర్త్ డే స్పెషల్ : ఎవరో ఒకరిని ‘రోజూ గిల్లే వాడే‘(RGV)వర్మ...

2011లో వివాహం..

2011లో వివాహం..

అల్లు అర్జున్ 2011లో హైదరాబాద్ సిటీలో మార్చి 6వ తేదీన స్నేహాలతా రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. వీరికి అయాన్, అర్హా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబమంటే అల్లు అర్జున్ కి ఎంతగానో ఇష్టం. ముఖ్యంగా పిల్లలంటే చాలా ప్రేమ. అందుకే తనకు వీలు చిక్కినప్పుడల్లా పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటాడు. తన సరదా వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటాడు.

యువత మనసులో స్థానం..

యువత మనసులో స్థానం..

గంగోత్రి సినిమా తర్వాత ఆర్యలో నటించిన అల్లు అర్జున్ ఒక్కసారిగా కాలేజీ బాయ్ గా కనిపించి యువత మనసులో స్థానం సంపాదించుకున్నాడు. అదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ బన్నీలో తన యాక్టింగ్, డ్యాన్స్, మ్యానరిజంతో చెరగని ముద్ర వేసుకున్నాడు.

ఇతర భాషలలోనూ..

ఇతర భాషలలోనూ..

అల్లు అర్జున్ తెలుగులోనే కాదు తమిళం, మళయాళంతో పాటు ఇతర భాషలలోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పటికీ మళయాళంలో తను నటించిన సినిమాలన్నీ దాదాపు డబ్బింగ్ అయి అక్కడ విడుదలవుతున్నాయంటే, తన రేంజ్ ఏ మాత్రం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

సిక్స్ ప్యాక్ లో..

సిక్స్ ప్యాక్ లో..

అప్పటి వరకు తెలుగు సినిమా రంగంలో ఎవ్వరూ కనిపించని విధంగా ‘దేశ ముదురు‘లో సిక్స్ ప్యాక్ తో కనిపించి అందరినీ అలరించాడు అల్లు అర్జున్. అప్పటినుండి చాలా మంది హీరోలు అదే ట్రెండ్ ను ఫాలో అయ్యారు. ఈ సినిమాకు రెండు నంది అవార్డులు కూడా దక్కాయి.

ప్రతి విషయంలోనూ..

ప్రతి విషయంలోనూ..

అప్పటి నుండి అల్లు అర్జున్ తన డ్రస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, బాడీ షేప్ తో పాటు ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకునేవాడట. అందుకే ఆయనకు అభిమానులు కాదు ఆర్మీ ఉంది అని చెబుతుంటాడు.

సినిమా షూటింగులకు పిల్లలతో..

సినిమా షూటింగులకు పిల్లలతో..

అల్లు అర్జున్ అప్పుడప్పుడు తన పిల్లలను షూటింగులకు కూడా తీసుకెళతాడు. తన పిల్లలకు తండ్రిగా ఏమి చేస్తున్నారన్న విషయం తెలియాలని అందుకే తన పిల్లలను సినిమా షూటింగులకు తీసుకెళ్తుంటానని చెబుతుంటాడు అల్లు అర్జున్.

ఎన్నో అవార్డులు..

ఎన్నో అవార్డులు..

అల్లు అర్జున్ నటించిన చాలా చిత్రాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ స్టైలిష్ స్టార్ ‘పరుగు‘, ‘వేదం‘, ‘రేసు గుర్రం‘ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. అంతేకాదు ‘రుద్రమదేవి‘ చిత్రానికి ఉత్తమ సహయనటుడిగా కూడా అవార్డులను అందుకున్నాడు. వీటితో పాటు ఇతర అవార్డులను చాలానే అందుకున్నాడు.

అల్లు అర్జున్ తన సినీ జీవితంలో మరిన్ని మైలురాయిలను చేరుకోవాలని కోరుకుంటూ.. బోల్డై స్కై తెలుగు తరపున

హ్యాపీ బర్త్ డే టు యూ బన్నీ..

FAQ's
  • అల్లు అర్జున్ ఎప్పుడు జన్మించారు?

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ 1982లో ఏప్రిల్ 8వ తేదీన అల్లు అరవింద్, నిర్మల దంపతులకు జన్మించారు. ఈ స్టైలీష్ స్టార్ స్నేహా లత రెడ్డిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మించారు. సినీ రంగంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే గొప్ప  హీరోగా ఎదిగిపోయాడు.

English summary

Allu Arjun Birthday Special : Unknown facts about stylish star

Here we talking about unknown facts about stylish star allu arjun. Read on
Desktop Bottom Promotion