For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భగత్ సింగ్ అంటే భగ భగ మండే అగ్నికణం : ఆయన జయంతి సందర్భంగా మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

భగత్ సింగ్ చిన్నప్పటి నుండే చాలా ధైర్యవంతుడు. అన్యాయాల్ని, అణచివేతలను నిర్భయంగా ఎదిరిస్తుండేవాడు.

|

భగత్ సింగ్ ఆ పేరు చెబితే చాలా మంది యువకుల రక్తం వేడెక్కుతుంది. ఎందుకంటే అతని ఆవేశం, ఆలోచనలు, ఆశయాలు యువకులను అంతలా ప్రభావితం చేశాయి కాబట్టి. ఇప్పటికీ మన దేశంలో భగత్ సింగ్ ను స్మరించుకుంటున్నారంటే కారణం ఆయన బ్రిటీష్ వారికి ఎదురుతిరిగి గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచి అందరికీ ఆదర్శవంతంగా మారారు. అలాంటి భగత్ సింగ్ సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను, ఆయన సూక్తులు, సందేశాలు, ఆశయాలను తెలుసుకుందాం.

‘భగత్‘ అంటే అదృష్టం..

‘భగత్‘ అంటే అదృష్టం..

షాహీద్-ఎ-అజామ్ భగత్ సింగ్ గా ప్రసిద్ధి గాంచిన భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న బ్రిటీష్ పాలనలోని భారతదేశంలో (ఇప్పుడు పంజాబ్, పాకిస్థాన్) పంజాబ్ లోని బంగాలో కిషన్ సింగ్

మరియు విద్యావతి దంపతులకు రెండో కుమారుడిగా జన్మించారు. ‘భగత్‘ అంటే అదృష్టం అని అర్థం. ఈయనను మొదట్లో ‘భగత్ వాలా‘ అని పిలిచేవారు. ఈయన అన్న పేరు జగత్ సింగ్ కావడం వల్ల ‘వాలా‘కు బదులు ‘భగత్ సింగ్‘ మార్చారని చరిత్ర ద్వారా తెలిసింది. ఆయన 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు జలియన్ వాలా బాగ్ ఊచకోత జరిగిన స్థలాన్ని సందర్శించడానికి పాఠశాలను ఎగ్గొట్టి మరీ వెళ్లాడు. 14 ఏళ్ల వయస్సులోనే నంకనా సాహిబ్ గురుద్వారా వద్ద పెద్ద సంఖ్య నిరాయుధులను చంపినందుకు నిరసనలో పాల్గొన్నాడు.

ధైర్యానికి నిదర్శనం..

ధైర్యానికి నిదర్శనం..

భగత్ సింగ్ చిన్నప్పటి నుండే చాలా ధైర్యవంతుడు. అన్యాయాల్ని, అణచివేతలను నిర్భయంగా ఎదిరిస్తుండేవాడు. భగత్ సింగ్ బాల్యంలోనే కళలపట్ల, సాహిత్యం పట్ల, ఎంతో ఆసక్తి కనబరిచేవారు. సంగీత ప్రియుడైన భగత్ సింగ్ నాటకాలలో కూడా పాల్గొనేవారు. అంతేకాదు ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు కూడా ఉంది. ఇక ఆయన ధైర్యం గురించి చెప్పాల్సి వస్తే చాలా ఉదాహరణలున్నాయి.

ఇంక్విలాబ్ జిందాబాద్..

ఇంక్విలాబ్ జిందాబాద్..

అంతకుముందు విప్లవాత్మక ఉద్యమంలో చేరాడు. మన దేశంలో బ్రిటీష్ పాలక ప్రభుత్వానికి వెళ్లాడు. వ్లాదిమిర్ లెనిన్ సారథ్యంలోని సోషలిజం మరియు సోషలిస్టు విప్లవాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఆయనే ‘ఇంక్విలాబ్ జిందాబాద్‘ అనే శక్తివంతమైన నినాదాన్ని రూపొందించాడు. ఇదే భారత స్వాతంత్య్ర పోరాటం యొక్క నినాదంగా మారింది. అసెంబ్లీ మీద బాంబు వేసినప్పుడు తప్పించుకునేందుకు అవకాశం ఉన్నా కూడా ఆయనే స్వచ్ఛందంగా అరెస్టు అవుతాడు. కోర్టును కూడా ఒక రాజకీయ ప్రచార వేదికగా తయారు చేసుకున్నాడు. అందుకే స్వచ్ఛందంగా లొంగిపోయి చరిత్రాత్మకమైన వాంగ్మూలాన్ని కోర్టులో ఇవ్వడం విశేషం.

స్వచ్ఛందంగా లొంగిపోయాం..

స్వచ్ఛందంగా లొంగిపోయాం..

‘మా దృష్టిలో దేశం అత్యంత క్లిష్ట పరిస్థితులలో ఉంది. ఈ దశలో దిక్కులు పిక్కటిల్లేలా హెచ్చరించాల్సిన అవసరం ఉంది. మాకు తోచిన రీతిలో మేము 1929 ఏప్రిల్ 8వ తేదీన రెండు బాంబులు విసిరాం. అవి పేలడం వల్ల అతి కొద్దిమందికి స్వల్పమైన గాయాలు అయ్యాయి. ఛాంబర్ లో గందరగోళం ఏర్పడింది. ప్రేక్షకులు, సభ్యులూ, అసెంబ్లీలో నుండి బయటకు వచ్చారు. తప్పించుకునే సదావకాశం ఉన్నప్పటికీ నేనూ నా సహచరుడు బటుకేశ్వర దత్తూ స్వచ్ఛందంగా లొంగిపోయాం! అని ప్రభుత్వాన్ని హెచ్చరించడం చాలా అవసరం అనిపించి మాత్రమే మేము ఈ పని చేశాం‘ అని అన్నాడు. తర్వాత 116 రోజుల జైలు శిక్ష అనుభవించాడు. ఆ సమయంలోనూ అతను పుస్తకాలు చదవడం, పాటలు పాడటం వంటి పనులను క్రమం తప్పకుండా చేసేవాడు. ఆ తర్వాత ఓ బ్రిటీష్ పోలీస్ అధికారిని చంపాడనే నెపంతో 1931 మార్చి 23న భగత్ సింగ్ ను ఉరి తీశారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ కొన్ని ఆశయాలు, సందేశాలు, సూక్తులను వినిపించారు.

2) తిరుగుబాటు విప్లవం కాదు.

2) తిరుగుబాటు విప్లవం కాదు.

‘‘తిరుగుబాటు అనేది ఒక విప్లవం కాదు. అది చివరికి ముగింపునకు దారి తీయవచ్చు.‘‘

3) నన్ను చంపవచ్చు.. నా ఆలోచనలను కాదు..

3) నన్ను చంపవచ్చు.. నా ఆలోచనలను కాదు..

‘‘వారు నన్ను చంపవచ్చు. కానీ వారు నా ఆలోచనలను చంపలేరు. వారు నా శరీరాన్ని చూర్ణం చేయగలరు. కానీ వారు నా ఆత్మను చూర్ణం చేయలేరు‘‘

4) ఆశయాలను చంపలేరు.

4) ఆశయాలను చంపలేరు.

‘‘మనుషులను చంపడం చాలా సులభం. కానీ మీరు ఆశయాలను చంపలేరు‘‘

5) స్వేచ్ఛగా..

5) స్వేచ్ఛగా..

‘‘ నా బూడిద యొక్క ప్రతి చిన్న అణువు వేడిగా ఉండే నా కదలికలో ఉంది. నేను జైలులో కూడా స్వేచ్ఛగా ఉన్నాను‘‘

6) ప్రేమ..

6) ప్రేమ..

‘‘ప్రేమ ఎల్లప్పుడూ మనిషి పాత్రను ఉద్దరిస్తుంది. ఇది అతన్ని ఎప్పటికీ తగ్గించదు. ప్రేమ ఎప్పుడూ ప్రేమగానే ఉంటుంది‘‘.

7) బిగ్గరగా..

7) బిగ్గరగా..

‘‘చెవిటి వారికి వినబడాలంటే శబ్దం చాలా బిగ్గరగా ఉండాలి‘‘

8) ఒకే వస్తువులు..

8) ఒకే వస్తువులు..

‘‘ప్రేమికులు, వెర్రివాళ్లు మరియు కవులు ఒకే వస్తువులతో తయారవుతారు‘‘

9) బాంబులతో విప్లవం కాదు..

9) బాంబులతో విప్లవం కాదు..

‘‘విప్లవం తప్పనిసరిగా కలహాలతో కలవలేదు. బాంబులు మరియు తుపాకులు విప్లవం చేయవు. విప్లవం అనే కత్తిని మీ ఆలోచనలపై పదును పెట్టండి.

10) మానవాళిని ప్రభావితం చేసేవన్నీ..

10) మానవాళిని ప్రభావితం చేసేవన్నీ..

‘‘నేను ఒక మనిషిని మరియు మానవాళిని ప్రభావితం చేసేవన్నీ నాకు సంబంధించనవే‘‘

11) కొన్ని సమయాల్లో..

11) కొన్ని సమయాల్లో..

‘‘కొన్ని గొప్ప సమయాల్లో హింస అనేది చాలా అవసరం‘‘

12) విప్లవాత్మక ఆలోచనలు..

12) విప్లవాత్మక ఆలోచనలు..

‘‘కనికరం లేని విమర్శలు మరియు స్వతంత్రమైన ఆలోచనలు, విప్లవాత్మక ఆలోచనల యొక్క రెండు అవసరమైన విశిష్ట లక్షణాలు‘‘

13) ప్రజల చిత్తశుద్ధి

13) ప్రజల చిత్తశుద్ధి

"ప్రజల చిత్తశుద్ధి వ్యక్తీకరణ అయినంత కాలం మాత్రమే చట్టం యొక్క పవిత్రతను కొనసాగించవచ్చు".

English summary

Bhagat Singh’s 112th Birth Anniversary: Facts About The Revolutionary Freedom Fighter and his Quotes

When Bhagat Singh was 12 years old, he bunked school to visit the site of the Jallianwala Bagh massacre. He quit school at the age of 13 to devote his life to Indian independence. When Bhagat was 14 years old, he took part in a protest against the killing of a large number of unarmed people at Nankana Sahib gurudwara.
Desktop Bottom Promotion