For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గాంధీ జయంతి 2019 : మహాత్మ గాంధీ సూక్తులు, సందేశాలు..

అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఆరోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటామని ప్రకటించింది.

|

ప్రతి సంవత్సరం మన దేశంలో అక్టోబర్ 2వ తేదీ అంటే ఎంత ముఖ్యమైన రోజో అందరికీ తెలిసిందే. ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని పిలువబడే మహాత్మ గాంధీ పుట్టినరోజుకు ఈ సంవత్సరం ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈసారి గాంధీజీ 150వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. అహింసనే ఆయుధంగా చేసుకుని, దాని ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడు

మహాత్మ గాంధీ. మన దేశంలో బ్రిటీష్ పాలన బానిసత్వం నుండి రక్షించడానికి మరియు బ్రిటీష్ పాలకులు మన దేశాన్ని వదలివెళ్లమని బలవంతం చేయకుండా శాంతియుతంగా అనేక ఆందోళనలు చేశారు. అంతేకాదు అదే సమయంలో కొన్ని సందేశాలను సైతం ఇచ్చారు. ఒక చెంప కొడితే మరో చెంప చూపమన్నారు. అందుకే గాంధీకి ప్రపంచవ్యాప్తంగా అంత గొప్పగౌరవం దక్కింది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా విదేశీ తిరస్కరణను చేపట్టారు. అందరూ స్వదేశీ వస్తువులనే వాడాలని సూచించారు. అందరికీ చెప్పడమే కాదు తాను కూడా ఆచరించి చూపాడు. అప్పటి నుండి గాంధీజీ కేవలం స్వదేశీ వస్త్రాలను, వస్తువులను వాడారు. అందరిలోనూ ఉద్యమ స్ఫూర్తిని రగిల్చారు.

Gandhi Jayanti

ఇదంతా గుర్తించిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జూన్ 15 2007న ఒక గొప్ప తీర్మానం చేసింది. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఆరోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటామని ప్రకటించింది. 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ లోని పోర్బందర్ లో పుట్టాడు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న గాంధీ ఆ తర్వాత దేశానికి స్వాతంత్య్రం కోసం ఉద్యమం చేశారు. అలా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొద్ది రోజులకే ఆయన గాడ్సే చేతిలో హత్యకు గురయ్యాడు. ఇక ఈ ఏడాది మహాత్మ గాంధీజీది 150 జయంతి కాబట్టి ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కలిగించే సందేశాలు, సూక్తులేంటో చూడండి. మీరు ఆచరించండి..

Gandhi Jayanti

1) ''శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది''

Gandhi Jayanti

2) ''నా దగ్గర ప్రేమ తప్ప మరో ఆయుధం లేదు. ప్రపంచంతో స్నేహం చేయడం నా గమ్యం''

Gandhi Jayanti

3) ''నన్ను స్తుతించే వారి కంటే నన్ను కఠినంగా విమర్శించే వారి వల్లనే, నేను అధికంగా మంచిని పొందాను''

Gandhi Jayanti

4) ''కష్టపడి పని చేయని వ్యక్తికి తిండి తినే హక్కు లేదు''

Gandhi Jayanti

5) ''లేని గొప్పదనం ఉందని చెబితే, ఉన్న గొప్పదం కూడా ఊడిపోతుంది''

6) ''చదువులో ఆనందాన్ని పొందితే, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటావు''

Gandhi Jayanti

7) ''ఎంత గొప్పగా చెప్పావో నీ చేతలు చెప్పాలి. ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి''

8) ''తనకు తాను తృప్తి చెందితే మానవుడు ఎదగలేడు''

English summary

Gandhi Jayanti 2019: Quotes of Mahatma Gandhi

On the occasion of gandhi jayanti, we bring you mahatma gandhis most inspiring quotes
Story first published:Tuesday, October 1, 2019, 16:09 [IST]
Desktop Bottom Promotion