For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ambedkar jayanti 2022 : మనలో స్ఫూర్తిని నింపే అంబేద్కర్ ప్రేరణాత్మక సూక్తులు...

|

అది మన దేశానికి మధ్యలో ఉండే రాష్ట్రం. అదే మధ్యప్రదేశ్ లోని అంబవాడలో 1891వ సంవత్సరంలో ఓ తక్కువ కులానికి చెందిన వారికి ఓ బాలుడు జన్మించాడు. అది కూడా వారికి 14వ సంతానం ఆయన. ఆయన చిన్నప్పుడు చదువుకోవడానికి పాఠశాలకు వెళితే బయటే కూర్చోబెట్టేవారు. అందరితో అస్సలు కలవనిచ్చే వారు కాదు. అంతేకాదు తనకు ఒక వేళ దాహం నీళ్లు తాగాలనిపిస్తే, అక్కడ పని చేసే గుమాస్తా కొంత ఎత్తులో నుండి తన చేయి పొత్తిళ్లలోకి నీళ్లు పోసేవాడు. ఆ రోజుల్లో అంటరానితనం అత్యంత దారుణంగా ఉండేది.

ఇలాంటి పరిస్థితులే ఆయనలో చైతన్యం కలిగేలా చేశాయి. అతని మెదడుపై తీవ్ర ప్రభావం చూపాయి. అందుకే తన ఆత్మవిశ్వాసంతో అందరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అందరూ సమానమనే భావన తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ఆయనెవరో కాదు బాబా సాహెబ్ అంబేద్కర్. ఏప్రిల్ 14వ తేదీ ఆయన పుట్టినరోజు. ఈయనను బాబా సాహెబ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంబేద్కర్ మన దేశంలో అంటరానితనాన్ని పూర్తిగా పారదోలేందుకు చాలా ఎక్కువగా ఆలోచించేవాడు. ఇందుకోసం 1927 సంవత్సరంలో ఒక ఉద్యమం మొదలుపెట్టాడు. దేవాలయాల్లోకి అంటరాని వారు ప్రవేశించడానికి అవకాశం కలిగించాలంటూ, అది వారి హక్కు అంటూ పోరాడాడు. ఇలా ఎన్నో ఉద్యమాలు చేసాడు. వీటన్నింటి వల్ల ఈయనను అభిమానించేవారు రోజు రోజుకు పెరిగిపోయారు. 1930 సంవత్సరంలో కల్ రామ్ దేవాలయ సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. అలా అంటరానితనాన్ని కూకటివేళ్లతో సహా తరిమికొట్టే అంబేద్కర్ యొక్క కొన్ని సూక్తులను ఇప్పుడు చూద్దాం...

ఆచరణ..

ఆచరణ..

ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు

ఫలితం..

ఫలితం..

సకాలంలో సరైన చర్య తీసుకుంటే, దాని ఫలితం పది కాలాల పాటు నిలుస్తుంది.

నా దేశమే..

నా దేశమే..

నేను, నా దేశం ఈ రెండింటిలో నా దేశమే అత్యంత ముఖ్యమైనది.

సమాజం చైతన్యవంతం కావాలంటే..

సమాజం చైతన్యవంతం కావాలంటే..

మూడ విశ్వాసాలను హేతువాదానికి నిలబడని వాదనలను నమ్మకూడదు..

సమాజం చైతన్యవంతం కావాలంటే, కాలానుగుణంగా సాగిపోవాలి

కులం పునాదుల మీద..

కులం పునాదుల మీద..

కులం పునాదుల మీద దేనిని సాధించలేం. ఒక జాతిని, నీతిని నిర్మించలేం.

జనంలో నిలిచిపోతావు..

జనంలో నిలిచిపోతావు..

నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు

విమర్శలు వస్తున్నాయంటే..

విమర్శలు వస్తున్నాయంటే..

ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయంటే.. నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం.

నిజమైన విద్య..

నిజమైన విద్య..

జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య..

ఆ రెండూ తప్పే..

ఆ రెండూ తప్పే..

మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే..

విద్యావంతులై ఆత్మగౌరవంతో..

విద్యావంతులై ఆత్మగౌరవంతో..

దేశానికి గాని, జాతికి గాని సంఖ్యా బలం ఒక్కటే సరిపోదు, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది.

పశువు కంటే ప్రమాదకరం..

పశువు కంటే ప్రమాదకరం..

వినయం, శీలం లేని విద్యావంతుడు, పశువు కంటే ప్రమాదకరం.

అత్యంత హీనమైనది..

అత్యంత హీనమైనది..

క్రూరత్వం కంటే నీచత్వమే అత్యంత హీనమైనది. ఎవ్వరినీ నీచంగా చూడకండి.

మనమే సత్తా పెంచుకుని..

మనమే సత్తా పెంచుకుని..

ఎవరో వేసిన సంకెళ్లని వారినే వచ్చి తీసేయమని చెప్పడం కంటే, మనమే సత్తా పెంచుకుని వాటిని ఛేదించడం మంచిది.

పులుల్లా బతకండి..

పులుల్లా బతకండి..

మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు. కాబట్టి పులుల్లా బతకండి.

సమాజ సంక్షేమం కోసం..

సమాజ సంక్షేమం కోసం..

జీవించేందుకు మనిషి తినాలి. సమాజ సంక్షేమం కోసం జీవించాలి.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు జన్మించారు?

మధ్యప్రదేశ్ లోని అంబవాడలో 1891వ సంవత్సరంలో ఓ తక్కువ కులానికి చెందిన వారికి ఓ బాలుడు జన్మించాడు. అది కూడా వారికి 14వ సంతానం ఆయన. ఆయన చిన్నప్పుడు చదువుకోవడానికి పాఠశాలకు వెళితే బయటే కూర్చోబెట్టేవారు. అందరితో అస్సలు కలవనిచ్చే వారు కాదు. అంతేకాదు తనకు ఒక వేళ దాహం నీళ్లు తాగాలనిపిస్తే, అక్కడ పని చేసే గుమాస్తా కొంత ఎత్తులో నుండి తన చేయి పొత్తిళ్లలోకి నీళ్లు పోసేవాడు. ఆ రోజుల్లో అంటరానితనం అత్యంత దారుణంగా ఉండేది.

English summary

Inspirational Quotes of Ambedkar

Here are the some inspirational quotes of ambedkar. Take a look
Desktop Bottom Promotion