For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇటలీ నుండి ఇండియా వరకు సోనియా గాంధీ ప్రస్థానం..

|

సోనియా గాంధీ అసలు పేరు ఎడ్విజ్ ఆంటోనియా అల్బినా మైనో. ఈమె 1946 డిసెంబర్ 9వ తేదీన ఇటలీ దేశంలోని వెనెటో ప్రాంతంలోని లూసియానాలో జన్మించారు. ఈమె చిన్నతనం అంతా అక్కడే గడిచింది.

అయితే ఉన్నత చదువుల నిమిత్తం ఎడ్విజ్ ఆంటోనియా ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లింది. అక్కడే అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కుమారుడిని కలిసింది. ఆ తర్వాత ఆమె ఇండియాకు వచ్చి ఏమి చేసింది. ఎలాంటి పరిస్థితిలో ఆమె రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం.

చేనేత వస్త్రాలంటే ఇష్టం..

చేనేత వస్త్రాలంటే ఇష్టం..

సోనియా గాంధీకి భారతీయ మహిళల మాదిరిగానే చీరలపై అమితమైన ప్రేమ ఉంది. అందరూ చేనేత వస్త్రాలంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమె పెళ్లిలో ధరించిన చీర చేనేతలు నేసినవే. ఆమె తన కుమార్తె ప్రియాంక గాంధీ వివాహం సందర్భంగా రెండోసారి ఆరు గజాల హార్డ్ క్రాఫ్ట్ ఫైనరీని ధరించింది.

PC : Twitter

లాంగ్ డ్రైవ్...

లాంగ్ డ్రైవ్...

సోనియా గాంధీకి పుస్తకాలంటే చచ్చేంత ఇష్టమట. ఆమెను పుస్తకాల పురుగు అని పిలవడంలో ఎలాంటి అతిశయోక్తి అనిపించదు. సోనియా గాంధీ నవలలకు చాలా విలువ ఇస్తారట. రాజీవ్ గాంధీతో వివాహం అయిన తర్వాత ఢిల్లీ విధుల్లో సోనియాగాంధీ లాంగ్ డ్రైవ్ కు వెళ్లేవారట.

కళా రంగంలోనూ..

కళా రంగంలోనూ..

సోనియా గాంధీకి కళా రంగం పట్ల కూడా ఎక్కువ మక్కువ ఉందట. ఆమె రాజకీయాల్లోకి రాక ముందు తన వ్యక్తిగత జీవితం అంతా ఎక్కువగా కళా రంగంలోనే గడిపారంట. అందుకోసమే ఎక్కువ సమయం కేటాయించుకునేవారట. అంతేకాదు శ్రీమతి గాంధీ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ నుండి కళ పునరుద్ధరణపై కోర్సులు కూడా తీసుకున్నారు.

తొమ్మిది భాషలలో నిష్ణాతులు..

తొమ్మిది భాషలలో నిష్ణాతులు..

హిందీ విషయానికి వచ్చేసరికి సోనియా గాంధీని, ఆమె ఉచ్చారణను అనేక మంది తన ఉచ్చరణను తరచుగా విమర్శిస్తుంటారు. అయితే ఆమె ఇంగ్లీష్ భాషతో సహా తొమ్మిది అంతర్జాతీయ భాషలలో నిష్ణాతులు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అంతేకాదు ఆమెకు మద్రాస్ విశ్వ విద్యాలయం మరియు బ్రస్సెల్స్ విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ (సాహిత్యం) పొందారు. బెల్జియం దేశం కూడా ఆమెకు ‘‘ఆర్డర్ ఆఫ్ కింగ్ లియోపోల్ట్‘‘ తో మెచ్చుకుంది.

PC : Twitter

మాస్టర్ చెఫ్ సోనియా..

మాస్టర్ చెఫ్ సోనియా..

సోనియా గాంధీ అద్భుతమైన పాక నైపుణ్యాలను కలిగి ఉంది. ఆమెకు కొత్తగా వివాహం అయిన సందర్భంలో ఎక్కువగా కుకరీ షోలను చూస్తూ సమయం గడిపేదట. పాస్తాను అత్యంత రుచికంగా తయారుచేస్తారట. అందరూ అనుకున్నట్టు ఆమె నూడుల్స్, పిజ్జా లేదా ఏదైనా జంక్ ఫుడ్ ఎక్కువగా తింటుంది అనుకుంటారు. కానీ సోనియా గాంధీ అలాంటి వాటికి దూరమట. అయితే కొత్తగా పెళ్లి అయిన రోజుల్లో ఢిల్లీ వీధుల్లో ఐస్ క్రీమ్ ఎక్కువగా తినేవారట. అంతేకాదు ఆమె యోగా ఔత్సాహికురాలు. ఆమె ప్రతిరోజూ యోగ వర్క అవుట్స్ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు.

పరిశుభ్రత విషయంలో..

పరిశుభ్రత విషయంలో..

సోనియా గాంధీ కూడా మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాదిరిగానే శుభ్రత విషయంలో నిజమైన భక్తి కలిగి ఉంది. ఆమె ఒక అమ్మలాగా తన గదిని దుమ్ము దులుపుకుంటూ ఉంటుందట.

రాజీవ్ గాంధీతో వివాహం..

రాజీవ్ గాంధీతో వివాహం..

ఇంగ్లాండులోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకునేందుకు వెళ్లిన రాజీవ్ గాంధీ అక్కడే సోనియా గాంధీతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత వారు 1968లో వివాహం చేసుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి అధికారిక నివాసంలోకి వెళ్లారు. అప్పటికే రాజకీయాల్లోకి వచ్చే సువర్ణావకాశం ఉన్నా రాజీవ్ ఏవియేషన్ రంగంపై ఉన్న ఆసక్తితో రాజకీయాలకు దూరంగా ఉండేవారు. అయితే అతని సోదరుడు 1980లో అకస్మాత్తుగా మరణించాడు. దీంతో రాజీవ్ అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.

సోనియా గాంధీ ప్రచారం..

సోనియా గాంధీ ప్రచారం..

1984లో రాజీవ్ గాంధీ తల్లి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యకు గురైనపుడు, రాజీవ్ గాంధీని ప్రధానిగా ప్రకటించారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ కోసం సోనియా గాంధీ ప్రచారం చేసింది. అయితే ఆమె అప్పుడే రాజకీయాల్లోకి రాలేదు. ఆమె తనకు ఇష్టమైన కళా రంగానికి సంబంధించి అధ్యయనం చేస్తుండేది. భారతదేశ కళా సంపదను కాపాడటానికి ఎంతగానో కృషి చేసింది.

PC : Twitter

రాజీవ్ హత్య తర్వాత..

రాజీవ్ హత్య తర్వాత..

1991లో రాజీవ్ గాంధీ కూడా హత్యకు గురైనప్పుడు, సోనియా గాంధీని నెహ్రూ-గాంధీ రాజవంశం యొక్క సహజ వారసుడిగా చూశారు. అప్పుడే ఆమెకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లభించింది. అయితే ఈ ప్రతిపాదన గురించి ఆమె బహిరంగంగా చర్చించడానికి నిరాకరించింది. అయితే 1993లో ఆమె ఉత్తరప్రదేశ్ లోని అమేథిలో రాజీవ్ గాంధీ నియోజకవర్గాన్ని సందర్శించింది. జనాన్ని కూడా ఉత్సాహ పరిచింది. అనంతరం ఆమె భారతీయ ప్రజా జీవితానికి అంకితమై అనేక ట్రస్టులు మరియు కమిటీల తరపున దేశవ్యాప్తంగా పర్యటించారు.

PC : Twitter

అత్యంత శక్తివంతమైన మహిళ..

అత్యంత శక్తివంతమైన మహిళ..

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందింది. ఆమె ప్రముఖ బ్రిటీష్ మ్యాగజైన్ న్యూ స్టేట్స్ మాన్ వారు నిర్వహించిన వార్షిక సర్వే ‘‘ది వరల్డ్స్ 50 అత్యంత ప్రభావవంతమైన వారు‘‘లో సోనియా గాంధీకి చోటు లభించింది. అయితే ఆమెకు ఫోర్బ్స్ మ్యాగజైన్ లో కూడా అత్యంత శక్తివంతమైన మహిళగా 2004, 2007, 2010 సంవత్సరాల్లో చోటు కల్పించింది.

PC :Twitter

English summary

Sonia Gandhi Birthday 2019 : Interesting Facts about Sonia Gandhi

When Rajiv was assassinated in 1991, Sonia was seen by many as the natural heir to the Nehru-Gandhi dynasty, and she was offered the leadership of the Congress Party. She rejected the offer and refused to discuss politics publicly.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more