Latest Updates
-
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.! -
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.!
Maha Shivratri 2023: బడ్జెట్‌లో జ్యోతిర్లింగాల దర్శనభాగ్యం.. రైల్వే టూర్ ప్యాకేజీ
ప్రముఖ శివాలయాలను, జ్యోతిర్లింగాను దర్శించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
మహాశివరాత్రి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 18వ తేదీన మహా శివరాత్రి. ఈ రోజుల శివాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడనున్నాయి. ఈ పర్వదినం సందర్భంగా ప్రముఖ శివాలయాలను, జ్యోతిర్లింగాను దర్శించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

దేశంలో పర్యాటకాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీ 12 రాత్రులు, 13 రోజుల పాటు ఉండనుంది. ఈ టూర్ లో భాగంగా దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు.

ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు:
1. సోమనాథ్ ఆలయం - గుజరాత్
2. కాశీ విశ్వనాథ్ - వారణాసి
3. మహాకాళేశ్వరుడు - ఉజ్జయిని
4. మల్లిఖార్జున - శ్రీశైలం
5. ఓంకారేశ్వర్ - మధ్యప్రదేశ్
6. కేదర్ నాథ్ - ఉత్తరాఖండ్
7. భీమశంకర్ - మహారాష్ట్ర
8. బైద్యనాథ్ - ఝార్ఖండ్
9. రామనాథస్వామి - తమిళనాడు
10. నాగేశ్వర - గుజరాత్
11. త్రయంబకేశ్వర - మహారాష్ట్ర
12. ఘృష్ణేశ్వర - మహారాష్ట్ర

12 రాత్రులు, 13 రోజుల పాటు టూర్:
భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) జ్యోతిర్లింగాలను సందర్శించేలా ఈ టూర్ ప్యాకేజీని తీర్చిదిద్దింది. ఈ ప్రయాణంలో ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, భేట్ ద్వారక, శివరాజ్ పూర్ బీచ్ వంటి ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను చూడొచ్చు. ఐఆర్‌సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లు, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ అధికారుల ద్వారా, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లేవారికి కూడా ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మొత్తం టూర్ 12 రాత్రులు, 13 రోజుల పాటు ఉంటుంది.

టూర్ ప్యాకేజీ గురించి ఇతర వివరాలు:
తేదీ: మార్చి 08, 2023 నుండి మార్చి 20, 2023 వరకు
ప్యాకేజీ కోడ్: SZBD384A
ప్యాకేజీ ధర: రూ.15,350
మరింత సమాచారం కోసం www.irctcportal.in పోర్టల్ సందర్శించవచ్చు.
రూ.15,350
సోమనాథ్ ఆలయం - గుజరాత్
కాశీ విశ్వనాథ్ - వారణాసి
మహాకాళేశ్వరుడు - ఉజ్జయిని
మల్లిఖార్జున - శ్రీశైలం
ఓంకారేశ్వర్ - మధ్యప్రదేశ్
కేదర్ నాథ్ - ఉత్తరాఖండ్
భీమశంకర్ - మహారాష్ట్ర
బైద్యనాథ్ - ఝార్ఖండ్
రామనాథస్వామి - తమిళనాడు
నాగేశ్వర - గుజరాత్
త్రయంబకేశ్వర - మహారాష్ట్ర
ఘృష్ణేశ్వర - మహారాష్ట్ర
భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్



Click it and Unblock the Notifications
