Latest Updates
-
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో..
Netaji Birth Anniversary : మనలో పోరాట పటిమను పెంచే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సందేశాలివే...
నేతాజీ సందేశాలను ఓసారి స్మరించుకుందాం...
'మీరు నాకు రక్తం ఇస్తే.. నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను' అనే నినాదం భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన నినాదాల్లో ఒక ప్రముఖమైన దానిని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు అందించారు. ఈయన ఆలిండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండుసార్లు మరియు భారత జాతీయ సైన్యం నాయకుడిగా కూడా పని చేశారు. అంతేకాదు ఈయన 'ఆజాద్ హిందూ ఫౌజ్' అనే సంస్థను ఏర్పాటు చేసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఒడిశాలోని కటక్ లో 1897, జనవరి 23వ తేదీన జన్మించిన ఈయన అతి తక్కువ కాలంలో అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదిగారు.

అదే సమయంలో గాంధీజీతో విభేదించారు. బ్రిటీష్ వారి నుండి భారతదేశానికి విముక్తి కలగాలంటే శాంతి, అహింస మార్గాలే కాదు.. సాయుధ పోరాటం కూడా చేయాలన్నారు. అప్పుడే మనకు స్వాతంత్య్రం వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి. రామక్రిష్ణ పరమహంస, స్వామి వివేకానందుల మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవడానికి తీర్మానించారు.

'మానవసేవే మాధవసేవ' అనే నినాదం, రామక్రిష్ణ ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత భారతదేశ స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్నారు. శ్రీ ఆర్యా పత్రికలో ఆయన సంపాదకులుగా రాసిన వ్యాసాలు స్వాతంత్య్ర సమరంలో పాల్గొనే వీరుల్లో మంచి ఉత్సాహాన్ని నింపాయి. తను డిగ్రీ పూర్తి చేసి ఇంగ్లండ్ కు వెళ్లిన సమయంలోనే జలియన్ వాలా బాగ్ ఉదంతం చోటు చేసుకుంది. అదే సందర్భంలో యువతలో ఉత్సాహాన్ని రేకెత్తించే మరియు మనకు స్ఫూర్తినిచ్చే సందేశాలు. నినాదాలను ఎన్నో ఇచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా ఆయన నినాదాలను, మాటలను మరోసారి గుర్తు చేసుకుందాం...

శత్రువుతో పోరాటంలో..
‘ధైర్యం, నిర్భయం మరియు అజేయత సంప్రదాయం లేని సైన్యం శక్తివంతమైన శత్రువుతో పోరాటంలో ఎప్పటికీ విజయం సాధించలేదు..'

ఒక వ్యక్తి ఆలోచన..
‘ఒక వ్యక్తి ఆలోచన కోసం చనిపోవచ్చు. కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత కూడా చాలా మంది జీవితా్లోకి ప్రవేశిస్తుంది. అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది'

స్వేచ్ఛ అనేది..
‘స్వేచ్ఛ ఎవ్వరి నుండి ఇవ్వబడదు.. మనకు మనమే తీసుకోవాలి...'

మన కర్తవ్యం
‘మనకు స్వేచ్ఛ కోసం మనం రక్తం చిందించడం అనేది మన కర్తవ్యం'..

అక్కడే సగం ఆసక్తి కోల్పోతాం..
‘పోరాటం చేయకపోయినా.. మరియు రిస్క్ తీసుకోకపోయినా అక్కడే సగం ఆసక్తి కోల్పోతాం..'

మనం ఎప్పటికీ ఒకటి గుర్తుంచుకోవాలి..
‘మనం ఎప్పటికీ ఒకటి గుర్తుంచుకోవాలి. అన్యాయంతో రాజీ పడటం అంటే మనం అతిపెద్ద నేరం చేసినట్టే..'

చరిత్రలో ఇంతవరకు..
‘చరిత్రలో ఇంతవరకు నిజమైన మార్పు ఏదీ చర్చ ద్వారా సాధించబడలేదు'

ఒక కోరిక ఉండాలి..
‘ఈరోజు మనకు ఒక కోరిక ఉండాలి. భారతదేశం జీవించేలా చనిపోవాలనే కోరిక..'

బలంగా కనిపించడం..
‘రాజకీయ భేరసారాల రహస్యం ఏంటంటే.. మీరు నిజంగా ఉన్న దానికంటే చాలా బలంగా కనిపించడం'

ఈ భూమిపై లేదు..
‘భారతదేశం యొక్క విధిపై మీ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి. భారతదేశాన్ని బానిసత్వంలో ఉంచగల శక్తి ఈ భూమిపై లేదు. భారతదేశం స్వేచ్ఛగా ఉంటుంది మరియు అది కూడా అతి త్వరలో ఉంటుంది'.
సుభాష్ చంద్ర బోస్ డిశాలోని కటక్ లో 1897, జనవరి 23వ తేదీన జన్మించిన ఈయన అతి తక్కువ కాలంలో అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదిగారు.



Click it and Unblock the Notifications











