For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరాఠా మహారాజ్ ఛత్రపతి శివాజీ గురించి ఆసక్తికరమైన నిజాలు...

|

భారతదేశంపై దండెత్తిన మొఘలు రాజులతో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేశారు. దీంతో మన దేశంలో హిందూ దేశం అంతరించిపోతుందని అంతా అనుకున్నారు.

Unknown Facts About Shivaji,

అయితే అప్పుడే చీకట్లో నుండి నిప్పుకణికలా దూసుకొచ్చాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘలుల దాడి నుండి సమర్థవంతగా ఎదుర్కొన్నాడు. ఆ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు. గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు.

Unknown Facts About Shivaji,

స్వతంత్ర సామ్రాజ్య, మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికిన వీరుడు. ఎన్నో కోటలను స్వాధీనం చేసుకున్నాడు. అన్ని మతాలను సమానంగా చూసిన గొప్ప మహారాజు ఛత్రపతి శివాజీ. 17వ ఏటలోనే యుద్ధ భూమిలోకి అడుగు పెట్టాడు. అంత చిన్న వయసులోనే ఆయన మొఘలు రాజులను ఎలా ఎదుర్కొన్నాడు. ఆయన యుద్ధ తంత్రం ఎలా ఉండేది? శివాజీ మహారాజు బాల్యం నుండి ఆయన వీర మరణం వరకు ఏమి సాధించాడు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం...

16వ శతాబ్దంలో..

16వ శతాబ్దంలో..

క్రీస్తు శకం 1630వ సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన, వైశాఖ మాసపు, శుక్ల పక్షం తదియ రోజున మహారాష్ట్రలోని పూనే జిల్లాలో ఉన్న జునార్ లోని శివనీర్ కోటలో జిజియాబాయి, షహాజీ దంపతులకు శివాజీ జన్మించారు.

తన తల్లి నుండి..

తన తల్లి నుండి..

శివాజీ మహారాజ్ తన తల్లి దగ్గర నుండి పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండటాన్ని నేర్చుకున్నాడు. అంతేకాదు అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమిపైన, ప్రజలతో ఎలా మెలగాలో శివాజీకి తన తల్లి జిజియాబాయి నేర్పించింది. ఆయన తండ్రి పూనేలోనే జాగీరుగా ఉండేవారు.

తన తండ్రి నుండి..

తన తండ్రి నుండి..

శివాజీ తన తండ్రి దగ్గర నుండి యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. అలాగే రాజనీతి మెళకువలను నేర్చుకుంటూ తన తండ్రి పరాజయాలన్నీ కూడా అధ్యయనం చేసేవాడు. అప్పుడే సరికొత్త యుద్ధతంత్రాలను నేర్చుకొన్నాడు. ఇలా యుద్ధానికి సంబంధించిన అన్ని మెళకువలను నేర్చుకున్నాడు.

17వ ఏటలోనే..

17వ ఏటలోనే..

అనంతరం తను 17వ సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే కత్తి పట్టాడు. అంతేకాదు కేవలం వెయ్యి మంది సైన్యంతో వెళ్లి బీజాపూర్ కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత రాజ్ ఘడ్ కొండను కూడా ఛేజిక్కించుకుని పూనే ప్రాంతాన్ని అంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

గెరిల్లా యుద్ధం..

గెరిల్లా యుద్ధం..

‘‘ ఓటమి తప్పదు అనిపిస్తే.. యుద్ధం నుండి తప్పుకోవాలి.. అనుకూల సమయాన్ని చూసుకుని దాడి చేసి గెలవాలి‘‘ ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇదే శివాజీ పాటించే యుద్ధతంత్రం. దీన్నే గెరిల్లా యుద్ధం అంటారట.

లౌకిక వాదం పాటించిన రాజు..

లౌకిక వాదం పాటించిన రాజు..

శివాజీ మహారాజు ముస్లింల దురాక్రమణను వ్యతరిేకించిన్పటికీ, తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించారు. అన్ని మతాల వారినీ సమానంగా ఆదరించారు. ఇతర మతాల వారిని కూడా హిందువుల మాదిరిగానే గౌరవించేవాడు. అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి మరీ వివాహం జరిపించాడట.

శివాజీ స్నేహితుల్లో మహమ్మదీయులు..

శివాజీ స్నేహితుల్లో మహమ్మదీయులు..

ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలా మంది మహమ్మదీయులు ఉన్నారట. అంతేకాదు తన సైనిక వ్యవస్థలో ఎంతో మంది ముస్లింలకు సముచిత స్థానం కల్పించారట.

అంతుబట్టని యుద్ధతంత్రాలు..

అంతుబట్టని యుద్ధతంత్రాలు..

శివాజీ మహారాజ్ యుద్ధ తంత్రాలు శత్రువులకు అంతుబట్టని విధంగా ఉండేవట. తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించాడట.

సైన్యం పట్ల శ్రద్ధ..

సైన్యం పట్ల శ్రద్ధ..

శివాజీ మహారాజ్ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవారట. దీంతో వారంతా వారి ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేసేందుకు సిద్ధపడేవారు. అయితే సైనికులకు ప్రమాదం ఏర్పడే సందర్భంలో ఆయన వారిని అనూహ్యంగా అక్కడి నుండి తప్పించేవారట.

నావికా దళం..

నావికా దళం..

పటిష్టమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుండి కాపాడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఆ కాలంలో ఇలాంటి ఆలోచనలు ఏ రాజులకు రాకపోవడం గమనార్హం.

అత్యంత బలమైన అప్జల్ ఖాన్ ను..

అత్యంత బలమైన అప్జల్ ఖాన్ ను..

యుద్ధంలో భయంకరమైన అఫ్జల్ ఖాన్ ముందుగానే శివాజీ యుద్ధతంత్రాలను, గెరిల్లా యుద్ధాల గురించి తెలుసుకున్నాడట. అందుకే శివాజీని రెచ్చగొట్టేందుకు ముందుగానే శివాజీకి ఇష్టమైన దుర్గమాత దేవాలయాన్ని కూలగొడతాడట. అయితే అప్జల్ కుట్రలను శివాజీ కూడా పసిగట్టి ఆయన్ని సమావేశానికి ఆహ్వానిస్తాడు.

పులి గోర్లతో...

పులి గోర్లతో...

అయితే శివాజీ మహారాజ్ ముందుగానే ఉక్కు కవచాన్ని వేసుకుని, చేతికి పులిగోర్లు ధరించి సమావేశానిక వెళ్తాడు. అక్కడ శివాజీ, అప్జల్ ఖాన్ కేవలం అంగరక్షకులతో మాత్రమే హాలులోకి వెళ్తారు. అక్కడ అఫ్జల్ ఖాన్ శివాజీని కత్తితో పొడించేందుకు ప్రయత్నించగా.. తన పులిగోర్లతో శివాజీ అఫ్జల్ ఖాన్ ను హతమారుస్తాడు. దీంతో శివాజీ మహారాజ్ మరాఠా యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు.

English summary

Unknown Facts About Shivaji, The Warrior-King Of Maratha Empire

Chattrapati Shivaji Maharaj is known to be one of the bravest and finest kings ever in the history of India. He is said to be exceptionally intelligent and valiant king. On his birth anniversary, know some facts about him.
Story first published: Wednesday, February 19, 2020, 9:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more