For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విక్టరీ వెంకటేష్ 59 బర్త్ డే స్పెషల్ : హీరో వెంకీ గురించి ఆసక్తికరమైన విషయాలు...

1990వ దశకంలో వచ్చిన సినిమాలన్నీ విజయ పరంపర కొనసాగడంతో విక్టరీ ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. చాలా మంది దగ్గుబాటి వెంకటేష్ అంటే ఎవరో తెలియదు అంటారు.

|

ఈ రోజుల్లో నిర్మాతల కుమారులు కూడా హీరోలు అవుతున్నారు. అయితే వారంతా హీరోలు అవ్వడం అనేది పెద్ద పనేం కాదు. వారు సక్సెస్ సాధించడమే వారికి పెద్దపని. నిర్మాతలలో చాలా మందిది నట కుటుంబం అనేది ఉండదు. వారి కుటుంబంలో నటన ఉండదు. అయితే ఇలాంటి అపొహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ విక్టరీ వెంకటేష్ ఓన్ టాలెంట్ తో ఫ్యామిలీ, యాక్షన్, క్లాసిక్, ప్రేమ, కామెడీతో పాటు నవ రసాల తన నటనతో ఎందరినో అభిమానులను సంపాదించుకున్నాడు.

Venkatesh

దక్షిణాదిన నిర్మాత కుమారులలో హీరోలైన వారిలో విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వాడు. డిసెంబర్ 13వ తేదీన వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మీకు తెలియని రహస్యాలను తెలియజేస్తున్నాము.. అవేంటో ఈ స్టోరీలో చూడండి...

వెంకీ బాల్యం..

వెంకీ బాల్యం..

వెండి తెరపై వెంకీ కనిపిస్తే చాలు ఆ సినిమా సక్సెస్ అనే పేరు సంపాదించుకున్న అతను 1960 డిసెంబర్ 13వ తేదీన గుంటూరు జిల్లా కారంచేడులో జన్మించాడు.

విక్టరీ వెంకటేష్ గా ఫేమస్..

విక్టరీ వెంకటేష్ గా ఫేమస్..

1990వ దశకంలో వచ్చిన సినిమాలన్నీ విజయ పరంపర కొనసాగడంతో విక్టరీ ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. చాలా మంది దగ్గుబాటి వెంకటేష్ అంటే ఎవరో తెలియదు అంటారు. అయితే విక్టరీ వెంకటేష్ అంటే మాత్రం అందరూ టక్కున గుర్తు పట్టేస్తారు.

క్రికెట్ అంటే ప్రాణం..

క్రికెట్ అంటే ప్రాణం..

విక్టరీ వెంకటేష్ చిన్ననాటి నుండే క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఇండియా మ్యాచులు స్వదేశంలో జరిగినా, విదేశాల్లో జరిగినా అస్సలు మిస్సవ్వడు. ఏకంగా క్రికెట్ స్టేడియంకు వెళ్లి మరీ మ్యాచులను తిలకిస్తాడు. అంతే కాదండోయ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లోనూ చాలా ఉత్సాహంగా పాల్గొంటాడు. అంతే కాదండోయ్ క్రికెట్ సంబంధించి అందరికీ ‘వసంతం‘ పంచాడు.

ఆదర్శ వివాహం..

ఆదర్శ వివాహం..

వెంకటేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు అయినప్పటికీ ఆయన రెడ్డి కుటుంబం నుండి వచ్చిన నీరజారెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆయనకే కాదు ఆయన తండ్రి రామానాయుడుకు కుల పట్టింపులు లేవట. మద్రాసులో ఉన్న సమయంలో చిత్తూరు జిల్లా గంగవరపు సుబ్బారెడ్డి కుమార్తె నీరజా రెడ్డిని తొలుత రామానాయుడే ఒకే చేశారట. ఆ తర్వాతే వెంకటేష్ కు ఆమె నచ్చడంతో వారి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారట.

తొలి సినిమా...

తొలి సినిమా...

సాధారణంగా వారసత్వం అనేది కేవలం తొలి అవకాశాన్ని ఇస్తుంది. కానీ టాలెంట్ ఉంటేనే ఎవరైనా విజయవంతంగా రాణించగలుగుతారు. తన తండ్రి అండతో ‘కలియుగ పాండవులు‘ పేరిట తొలి సినిమా తీసిన విక్టరీ వెంకటేష్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. క్లాస్, మాస్, కామెడీ, ముఖ్యంగా ఫ్యామిలీ సినిమాలను చేసి అమ్మాయిలలో అద్భుతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇప్పటికీ వెంకీ మామ పేరిట వరుస సినిమాలు చేస్తూ తన సత్తా ఏంటో చూపుతున్నాడు.

33 ఏళ్లకు పైగా..

33 ఏళ్లకు పైగా..

విక్టరీ వెంకటేష్ 33 ఏళ్ల నుండి తన సినీ ప్రస్థానాన్ని సింపుల్ గా, అందరి కంటే విభిన్నంగా కొనసాగిస్తున్నాడు. వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ తెలుగు బోల్డ్ స్కై తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

English summary

Unknown facts about Victory Venkatesh

Here we talking about unknown facts about victory venkatesh. Read on,
Story first published:Friday, December 13, 2019, 14:56 [IST]
Desktop Bottom Promotion