For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bhavina Patel:వీలై ఛైర్ నుండి పారాలింపిక్స్ పతకం వరకు భవీనా పటేల్ ప్రస్థానమిలా...

భవీనా పటేల్ ఎవరు? టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తరపున రజతం సక్సెస్ సాధించిన స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ భారతదేశం తరపున పసిడి అంచుల దాకా వెళ్లి పోరాడి ఓడింది టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్.

Who is Bhavina Patel? Inspiring story of 1st Indian para-paddler to win silver medal at Paralympics in Telugu

అయితే భారతదేశం తరపున తొలి రజత పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. టేబుల్ టెన్నిస్ లో ఎవ్వరూ ఊహించని విధంగా ఫైనల్ లోకి ప్రవేశించింది. అంతకుముందు చైనాకు చెందిన మియావో జంగ్ పై శనివారం రోజున సెమీ ఫైనల్ పోరులో గెలిచింది. దాని కంటే ముందు ప్రీక్వార్టర్స్ లో బ్రెజిల్ కి చెందిన ఒలివెరా, క్వార్టర్స్ లో సెర్బియాకి చెందిన రాంకోవిచ్ లను అలవోకగా ఓడించింది.

Who is Bhavina Patel? Inspiring story of 1st Indian para-paddler to win silver medal at Paralympics in Telugu

ఒలివెరా తొమ్మిదో ర్యాంకులో ఉన్నప్పటికీ.. తను డిపెండింగ్ ఛాంపియన్ అయినా తనపై ఆధిపత్యం చెలాయించింది. అయితే ఫైనల్లో భారీ అంచనాలతో అడుగు పెట్టడంతో కొంత ఒత్తిడికి గురైంది. యింగ్ జావోతో క్లాస్-4 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఓడిపోయింది. అయితే మన దేశం తరపున టేబుల్ టెన్నిస్ విభాగంలో రజత పతకం సాధించింది. దేశ ప్రథమ పౌరుడు రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీతో పాటు దేశ్యాప్తంగా భవీనాను అభినందిస్తూ ట్వీట్ల మోత మోగింది. ఈ సందర్భంగా భవీనా పటేల్ ఎవరు? వీల్ చైర్ నుండి పారాలింపిక్స్ పతకం వరకు తన ప్రస్థానంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం...

Who is Bhavina Patel? Inspiring story of 1st Indian para-paddler to win silver medal at Paralympics in Telugu

చిన్నతనంలోనే పోలియో...
గుజరాత్ రాష్ట్రంలోనిన మెహసానాకు చెందిన 34 ఏళ్ల భవీనా చిన్నతనంలోనే పోలియో సోకడంతో కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆ సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల తను పూర్తిగా చికిత్స చేయించలేకపోయింది. అయితే నాలుగు సంవత్సరాల వయసులో ఒక ఆపరేషన్ చేయించుకుంది. అయితే దురద్రుష్టవశాత్తు అది సక్సెస్ కాలేదు. ఆ తర్వాత తన జీవితమంతా వీల్ ఛైర్ కే అంకితమవ్వాల్సి వచ్చింది.

టేబుల్ టెన్నిస్ లో..
తనకు పోలియో వచ్చింది తను ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. తనకు ఇష్టమైన టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించింది. అహ్మదాబాద్ లోని ITI నుండి కంప్యూటర్ సైన్స్ కోర్సులో చదువుతున్నప్పుడు, తనకు ఎంతగానో ఇష్టమైన టేబుల్ టెన్నిస్ లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. అయితే అతి కష్టమ్మీద ట్రైనింగ్ కోసం ఆటో మరియు బస్సులల్లో వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో తన భర్త నికుల్ పటేల్ ను తనకు మద్దతుగా నిలిచారు. అయితే విదేశీ పర్యటనల సమయంలో భవీనా మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందట.

పివి సింధు సరికొత్త రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి తెలుగమ్మాయి..పివి సింధు సరికొత్త రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి తెలుగమ్మాయి..

ఒత్తిడిని జయించడం..

తొలి రోజుల్లో ఫిట్ నెస్ కోసం సరదాగా టేబుల్ టెన్నిస్ స్టార్ట్ చేసిన భవీనా, తర్వాత అదే గేమ్ ని తన కెరీర్ గా ఎంచుకుని కష్టపడింది. ఒత్తిడిని జయించడం.. మొదట్లో వెనుకబడినా పుంజుకోవడాన్ని బాగా అలవాటు చేసుకుంది. మొత్తానికి పారాలింపిక్స్ లో పతకం గెలిచిన భారత రెండో మహిళా అథ్లెట్ గా అరుదైన ఘనత సాధించింది. 2016 సంవత్సరంలో దీపా మాలిక రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.

2011లో ఛాంపియన్ గా గుర్తింపు..
2011 సంవత్సరంలో టేబుల్ టెన్నిస్ థాయ్ లాండ్ లో టోర్నమెంట్లో ఛాంపియన్ షిప్ గెలుచుకోవడం ద్వారా భవీనా తన కెరీర్లో తొలిసారి అతిపెద్ద విజయాన్ని సాధించింది. అప్పుడే ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 2013 సంవత్సరంలో అక్టోబర్ నెలలో బీజింగ్ ఆసియా పారా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ మహిళల సింగిల్స్ క్లాస్-4 ఈవెంట్లో రజత పతకం సాధించి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. 2017 సంవత్సరంలో ఆసియా పారా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో భవీనా కాంస్య పతకాన్ని సైతం కైవసం చేసుకుంది. అయితే అనుకోని కారణాల వల్ల రియో ఒలింపిక్స్ లో భవీనా అర్హత సాధించలేకపోయింది. అయితే టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించడం ద్వారా, ప్రతి ఒక్కరూ కష్టపడితే కచ్చితంగా విజయం సాధించగలరని.. ఉన్నత శిఖరాలను చేరుకోగలమని భవీనా నిరూపించింది.

English summary

Who is Bhavina Patel? Inspiring story of 1st Indian para-paddler to win silver medal at Paralympics in Telugu

Here we are talking about the Who is Bhavina Patel? Know the Success story of India's Silver Medalist at Tokyo Paralympic in Telugu. Read on
Desktop Bottom Promotion