Latest Updates
-
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.! -
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.!
Radha Vembu: దేశంలో 3వ అత్యంత సంపన్న మహిళా రాధా వెంబు, ఆమె ఎవరో, ఏం చేస్తారో తెలుసా?
50 ఏళ్ల రాధా వెంబు దేశంలోని 3వ అత్యంత సంపన్న మహిళ. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో కిరణ్ మంజుదార్ షా, ఫల్గుణి నాయర్ ఒకటి, రెండవ స్థానాల్లో ఉండగా రాధా వెంబు 3వ స్థానంలో ఉన్నారు.
50 ఏళ్ల రాధా వెంబు దేశంలోని 3వ అత్యంత సంపన్న మహిళ. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో కిరణ్ మంజుదార్ షా, ఫల్గుణి నాయర్ ఒకటి, రెండవ స్థానాల్లో ఉండగా రాధా వెంబు 3వ స్థానంలో ఉన్నారు.

ఫోర్బ్స్ రియల్ టైం రిచ్ లిస్ట్ ప్రకారం రాధా వెంబు ఆదాయం 2.6 బిలియన్ డాలర్లు అంటే రూ.21,455 కోట్లు. రాధా వెంబు ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో 1176వ స్థానంలో ఉన్నారు. తన స్వయం కృషితో ఒక సంస్థను నిర్మించి తన కాళ్లపై తాను నిలదొక్కుకుని పైకి ఎదిగిన వ్యక్తిగా రాధా వెంబు గుర్తింపు పొందారు.
రాధా వెంబు జీవితం:
రాధా వెంబు 1972లో జన్మించారు. వెంబు తండ్రి మద్రాసు హైకోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పని చేసే వారు. రాధా వెంబు మద్రాసులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో చదివి, ఇండస్ట్రీయల్ మేనేజ్‌మెంట్‌లో పట్టభద్రులయ్యారు. రాధా వెంబు 1996లో తన సోదరులు శ్రీధర్ వెంబు, శేఖర్ వెంబుతో కలిసి చదువుకుంటున్న సమయంలోనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ నిర్మాణంలో శ్రీధర్ వెంబుది కీలక పాత్ర.
6 కోట్ల మంది కస్టమర్లు:
జోహో మెయిల్ ప్రొడక్ట్ మేనేజర్ గా దాదాపు 250 మంది వ్యక్తుల బృందానికి రాధా వెంబు నాయకత్వం వహిస్తున్నారు. జోహో మెయిల్ కు టెక్సాస్ లోని ఆస్టిన్ లో 375 ఎకరాల విస్తీర్ణంలో కార్యాలయం ఉంది. చెన్నైలోని ప్రధాన కార్యాలయంలోనే ఉంటూ రాధా వెంబు పని చేస్తుంటారు.
ఈ కంపెనీకి 6 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల్లో జోహోకు కార్యాలయాలు ఉన్నాయి. క్లౌడ్ ఆధారిత వ్యాపార సాఫ్ట్ వేర్‌కు పేరుగాంచిన జోహో ప్రస్తుతం వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా అరట్టై అనే సాఫ్ట్‌వేర్‌ను తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉంది.
ఒకవైపు జోహో, మరోవైపు ఇతర బాధ్యతలు:
రాధా వెంబు ఒకవైపు జోహో కార్యకలాపాలను నిర్వహిస్తూనే మరోవైపు జానకి హై-టెక్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆగ్రో ఎన్జీవోకు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అలాగే హైలాండ్ వ్యాలీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి కూడా డైరెక్టర్ గా ఉన్నారు. రాధా వెంబు భర్త, ఒక బిడ్డతో కలిసి జీవిస్తున్నారు.
చెన్నై, తమిళనాడు
1996లో వెంబు తన సోదరులతో కలిసి జోహో ప్రారంభించారు. అడ్వెంట్ నెట్ అనే నెట్ వర్క్ పరికరాల ప్రొవైడర్ల కోసం సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ హౌజ్ ను స్థాపించారు.
జోహో తమిళనాడులోని చెన్నైలో ప్రారంభించారు. 2021 నాటికి 12 దేశాల్లో జోహోకు కార్యాలయాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications
