Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
World Milk Day 2021:ప్రపంచ పాల దినోత్సవం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలివే...!
ప్రపంచ పాల దినోత్సవం 2021, తేదీ, థీమ్, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన ప్రపంచ పాల దినోత్సవంగా జరుపుకుంటారు. పాడి రంగాన్ని మెరుగుపరచుకునేందుకు మరియు ప్రపంచ ఆహారంగా పాల ఉత్పత్తుల ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియజేసేందుకు

ఐక్యరాజ్యసమితి(UNO) యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ(FAQ) 2000 సంవత్సరంలో జూన్ 1వ తేదీ నుండి ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పాల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.

ఈరోజున పాల యొక్క ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతతో పాల దినోత్సవం యొక్క థీమ్ 'పాడి రంగంలో స్థిరత్వం'పైనా ఫోకస్ పెడుతుంది. ఈ సందర్భంగా ప్రపంచ పాల దినోత్సవ చరిత్ర, థీమ్, ఈ దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రపంచ పాల దినోత్సవ చరిత్ర..
ప్రపంచ ఆహారంగా పాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి మరియు పాడి రంగాన్ని మెరుగుపరుచుకునేందుకు 2000 నుండి 2001 సంవత్సరం మధ్యన ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ జూన్ 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగ పాల దినోత్సవాన్ని జరుపుకోవాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

ప్రపంచ పాల దినోత్సవ ప్రాముఖ్యత..
ఈ రోజున పాలు మరియు పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం, ప్రపంచవ్యాప్తంగా పాల గురించి ఎక్కువ ప్రచారం చేసేందుకు, వీటిని సుమారు ఒక బిలియన్ మందికి ఎలా జీవనోపాధి దొరుకుతుంది.. పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా, ప్రపంచ ఆహార వ్యవస్తలో పాల రంగం అతి ముఖ్యమైన భాగం. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఆర్థిక, పోషక మరియు సామాజిక ప్రయోజనాలను అందిస్తోంది. భారతదేశం వ్యవసాయాధారిత దేశం కాబట్టి, ఇక్కడ ప్రధాన ఆహారాలలో ఒకటిగా పరిగణించి ఈరోజుకు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. వంటలో పాలను ఉపయోగించడం సాధారణమే. అయితే రోజులో కనీసం ఒకసారైనా మనం తీసుకునే భోజనంలో పాలు ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుంది.

2021 థీమ్..
ఈ ఏడాది ప్రపంచ పాల దినోత్సవం యొక్క థీమ్ ‘పాడి రంగంలో సుస్థిరతతో పాటు పర్యావరణం, పోషణ మరిు సామాజిక-ఆర్థిక సాధికారతపై ఫోకస్ పెట్టడం'. అంతేకాకుండా పాడి కోసం తక్కువ కార్బన్ , భవిష్యత్తుకు ఉపయోగపడేలా వ్యవసాయాన్ని ప్రపంచానికి తిరిగి ప్రవేశపెట్టాలని కూడా ఈసారి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరం పాలు మరియు పాల ఉత్పత్తులను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చడం గురించి మరింత అవగాహన పెంచడమే ఈ థీమ్ లక్ష్యం.

ఎలా జరుపుకుంటారు?
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా సాధారణ కార్యక్రమాలే నిర్వహించనున్నారు. అయితే, గ్లోబల్ డెయిరీ ప్లాట్ ఫామ్ అనేక ప్రచారాలను నిర్వహిస్తోంది. ఈ వేడుకలు ఇప్పటికే ‘ఎంజాయ్ డెయిరీ ర్యాలీ'పేరిట ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న పాల ప్యాకెట్లను దానం చేసే అవకాశం కోల్పోతున్నామని చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఈ ఏడాది సోషల్ మీడియా ద్వారా పాల గురించి ఎక్కువ ప్రచారం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.

పాలతో ప్రయోజనాలు..
పాలు పోషకాలు అధికంగా ఉండే ద్రవం, స్త్రీ క్షీరదాలు తమ పిల్లలను పోషించడానికి ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా మనం వినియోగించే రకాల ఆవులు, గొర్రెల మరియు మేకల నుండి పాలు వస్తాయి. ఈ పాలు తాగడం వల్ల నాలుగు ఆరోగ్య ప్రయోజనాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

పాలలో ప్రోటీన్లు..
పాలలో విటమిన్లు మరియు అద్భుతమైన మినరల్స్ ఉంటాయి. పాలు ప్రోటీన్ యొక్క గొప్ప వనరు. ఒక కప్పు పాలలో సుమారు 8 గ్రాములు ఇది ఉంటుంది. మన బాడీకి సరైన పనితీరు కావాలంటే, ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది పెరుగుదల మరియు డెవలప్ మెంట్ మరియు రోగనిరోధక వ్యవస్థ పెంచడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాదు ఎముకలు కూడా బలంగా మారతాయి. పాలను మీ ఆహారంలో సులభంగా చేర్చొచ్చు. కాఫీ, వోట్మీల్, స్మూతీస్ ఇతర పదార్థాల తయారీలోనూ పాలను విరివిగా ఉపయోగించవచ్చు.



Click it and Unblock the Notifications
