Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
కొత్త ఏడాదిలో ఇంట్లో ఈ మొక్కలు నాటితే అదృష్టం తలుపు తడుతుంది
కొత్త సంవత్సరం బాగుండాలంటే, పట్టిందల్లా బంగారం కావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని పెంచడం వల్ల అష్టైశ్వర్యాలు వస్తాయి. శ్రేయస్సు సిద్ధిస్తుంది.
కొత్త సంవత్సరం రాబోతుంది. రాబోయే ఏడాదైనా మంచిగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. తలపెట్టిన పని పూర్తి కావాలని, మంచి ఉద్యోగం రావాలని, వ్యాపారం లాభాల్లో సాగాలని, పెళ్లి కావాలని ఇలాంటి చాలా కోరికలు ఉంటాయి. కొందరికి 2022 చాలా అసంతృప్తితో సాగినా 2023 ఏడాది బాగుండవచ్చు. కొందరికి 2022 బాగున్నా, 2023లో ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. అలా కాకుండా కొత్త సంవత్సరం కొత్త ఆశలు చిగురించాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలు పెంచుకుంటే అదృష్టం కలిసివస్తుంది.

కొత్త సంవత్సరం బాగుండాలంటే, పట్టిందల్లా బంగారం కావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని పెంచడం వల్ల అష్టైశ్వర్యాలు వస్తాయి. శ్రేయస్సు సిద్ధిస్తుంది.

క్రాసులా మొక్క
క్రాసులా ప్లాంట్‌ను జేడ్ ప్లాంట్, లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ మొక్క అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ మొక్క మనీ ప్లాంట్ కంటే కూడా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
దీనిని ఇంట్లో పెంచితే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. క్రాసులా మొక్కను పెంచితే కొత్త ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లోపురోగతి కనిపిస్తుంది. క్రాసులా మొక్కను ఇంటి మెయిన్ డోర్‌కు కుడి వైపున లేదా ఆఫీస్ డెస్క్‌లో పెంచుకోవచ్చు.

తులసి మొక్క
హిందూ మతంలో తులసి మొక్కకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సరైన దిశలో తులసి మొక్కను నాటడం ద్వారా సానుకూల శక్తి వస్తుంది. దీంతో పాటు ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబ కష్టాలు సమసిపోతాయి. ఇంట్లో తులసి మొక్కను నాటడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. విష్ణువు అనుగ్రహం సిద్ధిస్తుంది.

ఉసిరి చెట్టు
హిందూ శాస్త్రాల ప్రకారం ఉసిరి చెట్టు అంటే విష్ణువుకు ప్రతిరూపం. ఉసిరి చెట్టును నిత్యం పూజిస్తే ఇంట్లో సకల ఐశ్వర్యాలు ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉసిరి చెట్టు ఇంట్లో పెంచుకుంటే తలపెట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. అనుకున్న ఫలితాలు వస్తాయి.
ఉసిరి చెట్టును ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి. దీని వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ఆక్/అకోడా/మదార్ మొక్క
ఆక్ మొక్కను అకోడా, మదార్ అని కూడా పిలుస్తుంటారు. వాస్తు శాస్త్రంలో ఆక్ మొక్కను పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కొత్త సంవత్సరంలో ఇంట్లో దీన్ని నాటడం ద్వారా ఆనందం, శాంతి కలుగుతాయి. ఆర్థికి పరిస్థితి బాగుంటుంది. తెల్లటి రంగు ఆకు మొక్కను నాటడం ద్వారా శత్రువులపై విజయం సాధించవచ్చు.

అశోక చెట్టు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున అశోక చెట్టును నాటుకోవాలి. అశోక చెట్టును నాటుకోవడం వల్ల ఇంట్లోకి సంపద వస్తుంది. లక్ష్మీ దేవి యొక్క అనంతమైన అనుగ్రహం లభిస్తుంది. అశోక వృక్షం ఉన్న ఇంట్లో దుష్ట శక్తులు ఉండవని వాస్తు శాస్త్రం చెబుతోంది. అశోక చెట్టు మానసిక, శారీరక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

లక్కీ బ్యాంబూ ట్రీ
లక్కీ వెదురు మొక్క చాలా మంది ఇళ్లల్లో కనిపిస్తుంది. లక్కీ బ్యాంబూ ట్రీ సంపదను ఆకర్షిస్తుంది. ఈ మొక్కను పవిత్రతకు చిహ్నంలా భావిస్తారు. ఎండ తగలని చోట కూడా ఈ మొక్క చక్కగా పెరుగుతుంది. ఈ మొక్కను ఇంట్లో, కార్యాలయాల్లో, దుకాణాల్లో పెంచితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కాండాలు బేసి సంఖ్యలో ఉన్నవాటినే ఎంచుకోవాలి.



Click it and Unblock the Notifications