Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్టార్ హీరోయిన్‌ను చంపేసిన కప్ప.. భయంకరమైన ఈ నిజం తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది!
ఈ భూమిపై ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎన్నో జీవ చరాలు, విషపూరితమైన వింత జీవ రాశులు ఈ భూమిపై నివశిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమెజాన్ అడవుల్లో ఇలాంటి రహస్యమైన జీవ జంతువులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అయితే ఓ నటి అమెజాన్ అడవుల్లోని కప్ప కారణంగా మృతి చెందడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కప్ప కారణంగా నటి ఎలా చనిపోయింది, దానికి కారణాలు ఏంటి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎవరీ నటి?
మెక్సికోకు చెందిన ఆ నటి పేరు మార్సెలా అల్కాజర్ రోడ్రిగ్జ్. ఆమె పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించారు. పలు విధమైన సినిమాల్లో కూడా వివిధ రకాల చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఈ నటి ఇటీవల దక్షిణ అమెరికాలో నిర్వహించిన ఓ సాంప్రదాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాంప్రదాయకమైన పద్దతిలో కప్పు నీటిని తాగడంతో పాటు శరీరంపై ట్యాటూలు వేసుకొని కప్పు శ్లేస్మాన్ని రాసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనప్పటికీ అమెజాన్ అడవుల లాంటి కొన్ని ప్రదేశాల్లో దీనిని ఇప్పటికీ పాటిస్తారు?

ఎలా చనిపోయింది?
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు కాంబో అనే విషపూరితమైన కప్పు నీటిని తాగాల్సి ఉంటుంది. ఇది చాలా విషపూరితమైనది. దీనిని తాగడం వల్ల శరీరంలోని రోగాలు నయమవుతాయని, టాక్సిన్స్ దూరమవుతాయని అక్కడి వ్యక్తులు విశ్వసిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులకు ముందుగా కప్పు నుంచి వచ్చిన ఒక లీటర్ నీటిని తాగిస్తారు. ఆ తరువాత శరీరంపై ట్యాటూలు వేసి, కప్పు శ్లేస్మాన్ని రాస్తారు.
ఈ పద్దతిలోనే ఆ నటికి కూడా ముందుగా ఒక లీటర్ కప్పు నీటిని తాగించారు. ఆ తరువాత శరీరంపై ట్యాటూలు వేశారు. అనంతరం కప్పు శ్లేస్మాన్ని పూశారు. ఈ శ్లేస్మం కప్పు రసం, బురదతో తయారు చేస్తారు. ఇలా చేసిన తరువాత ఆ నటి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కప్పు నీటి విషం శరీరంలోకి పూర్తిగా ఇంకిపోయింది. దీని కారణంగా ఆ నటికి వాంతులు విరేచనాలు కావడం మొదలయ్యాయి. గుండె కొట్టుకోవడం ఎక్కువయ్యింది. బీపీ పెరిగిపోయింది. ఊపిరి తిత్తులు చెడిపోయాయి. రక్త ప్రసరణ తగ్గిపోవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అలాగే ఆ నటి పూర్తిగా వాసిపోయింది. కేవలం ఒక్క అరగంటలోనే ఆమె తన చావును చూసేసింది. ఈ లక్షణాలు కనిపించిన అరగంటలోపు ఆసుపత్రికి తరలిస్తే ప్రమాదం తప్పుతుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో ఆ నటి చనిపోయింది.
ఈ విధంగా ఆ నటి తన ప్రాణాలను వీడాల్సి వచ్చింది. ఎంత సాంప్రదాయకమైన కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా కాదని ఏది పడితే అది తాగడం తినడం చేస్తే ఈ నటి లాగానే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి సాంప్రదాయకమైన పాల్గొనే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం.



Click it and Unblock the Notifications