Latest Updates
-
సెర్బియా ఎన్నికల్లో జెన్ జీ సంచలనం..విద్యార్థుల ఆందోళన దెబ్బకి కుప్పకూలిన ప్రభుత్వం.. -
మాంసాహారాన్ని మించే రుచితో స్పైసీ సోయా చుక్కా..రైస్, చపాతీ, దోశలోకి బెస్ట్ సైడ్ డిష్ -
మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉందో లేదో..ఇలా తెలుసుకోండి -
జస్ట్ 5 నిమిషాల్లో టేస్టీ ఎగ్ పరోటా..ఈజీగా చేసుకోండిలా -
ఇట్ట తయారయ్యారేందే: ప్రియుడితో సుఖం కావాలని భర్తను దారుణంగా.. -
ప్రేమించిన పాపానికి ఇంత ఘోరమా? తండ్రీకొడుకులను నగ్నంగా నడిపించిన యువతి కుటుంబం! -
పంజాబీ జీరా ఆలూ ఫ్రై.. అన్నం, పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే సైడ్ డిష్! -
బీహారీ స్పెషల్ దాల్ పిఠీ..ఇది తింటే పిజ్జా, బర్గర్లు కూడా మర్చిపోతారు! -
షుగర్ పేషెంట్లు తినాల్సిన బెస్ట్ హెల్తీ స్నాక్స్ ఇవే.. -
బెండకాయ ఫ్రై ఇలా చేస్తే..కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ..పప్పుచారు, రసంలో నంజుకుంటే కేక
గొరిల్లాతో ఫైట్‌కు సిద్ధపడిన మైక్ టైసన్.. చివరికి ఏమయ్యిందో తెలుసా?
ప్రపంచంలోనే గొప్ప బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ గురించి మీరందరూ వినే ఉంటారు. బాక్సింగ్ లెజెండ్‌లో మైక్ టైసన్‌కు మొదటి స్థానం ఉంది. ఎన్నోసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతను బాక్సింగ్‌లో రారాజు. బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విజయ్ దేవరకొండ నటించిన లిగర్ చిత్రంలో మైక్ టైసన్ నటించారు. అదేవిధంగా కన్నడలో పొగరు అనే సినిమాలో నటించేందుకు అంగీకరించిన ఆయన చివరి క్షణంలో ప్రాజెక్టు నుంచి వైదొలిగారు.
అలాంటి గొప్ప ఛాంపియన్‌కి, జేక్ పాల్ లాంటి మరో ఛాంపియన్‌కు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అమెరికాలోని టెక్సాస్‌లోని ఆర్లింగ్టన్ స్టేడియంలో మైక్ టైసన్, జేక్ పాల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ జేక్ విజయం సాధించాడు. ఈ మ్యాచ్ నిన్న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైంది.

నెట్‌ఫ్లిక్స్ ప్రకారం ఈ మ్యాచ్‌ను 60 మిలియన్లకు పైగా ప్రేక్షకులు వీక్షించారట. ప్రపంచం మొత్తం ఎంతో ఆతృతగా చూసిన ఈ మ్యాచ్‌లో మైక్ టైసన్ ఓడిపోవడం కొందరిని నిరాశకు గురిచేసినప్పటికీ బాక్సింగ్ ప్రియులకు మాత్రం మంచి ఆనందాన్ని అందించింది. మైక్ టైసన్ మంచి శరీరం కలిగిన బాక్సర్. మంచి బాడీతో ఉంటారు. అలాంటి బాక్సర్ జేక్ పాల్‌తో ఓడిపోవడం కొంత నిరాశకు గురి చేసింది.
గొరిల్లాతో ఫైట్
మైక్ టైసన్ బలమైన వ్యక్తి. అతని శరీరం చాలా ధృడంగా, బలంగా ఉంటుంది. అలాంటి బాక్సర్ తన వయసులో.. తాను ఫామ్‌లో ఉన్న సమయంలో గొరిల్లాతో కూడా పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు. దానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మైక్ టైసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మైక్ టైసన్ తాను ఫామ్‌లో ఉన్నప్పుడు.. అప్పటికీ బాక్సింగ్ ఆడుతున్నప్పుడు తన భార్య రాబిన్ గివెన్స్‌తో కలిసి న్యూయార్క్‌లోని ఒక జూకు వెళ్తాడు. ఆ జూలో ఒక గొరిల్లాను చూసి దానితో ఫైట్ చేయాలని అనుకుంటాడు. ఆ గొరిల్లా మైక్ టైసన్‌తో పోలిస్తే రెండు రేట్లు అధికంగా బరువు ఉంటుంది. అలాగే అధికంగా బలమైనది కూడా. ఆ గొరిల్లాతో పోటీ పడేందుకు తనను లోపలికి అనుమతించాలని, అనుమతిస్తే పదివేల డాలర్లు ఇస్తానని జూ కీపర్‌తో చెప్తాడు.
అయితే బలమైన గొరిల్లాతో పోటీ పడితే మైక్ టైసన్ ప్రాణానికి ప్రమాదమని భావించిన ఆ జూ కీపర్ టైసన్ ఆఫర్‌ను తిరస్కరిస్తాడు. దీంతో టైసన్ కూడా వెనక్కి తగ్గిపోతాడు. ఈ విషయాన్ని స్వయంగా మైక్ టైసన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దాని గురించి చెప్తూ ఆయన నవ్వుకున్నాడు కూడా. తాను ఎంత తెలివి తక్కువ పని చేశానో తరువాత అర్థమైనదని, తాను కచ్చితంగా ఓడిపోవడంతో పాటు ప్రాణాలతో వచ్చేవాడినో కాదో తెలియదని చెప్పుకుంటూ నవ్వుకున్నారు. కానీ మైక్ టైసన్ ఇప్పటికీ బాక్సింగ్ ప్రపంచంలో రారాజు అని చెప్పుకోవచ్చు.
బాక్సింగ్ మాత్రమే కాదు..
మైక్ టైసన్ కేవలం బాక్సింగ్ రాజు మాత్రమే కాదు. అతను ఆస్తిలో కూడా రాజే. ఇటీవలి నివేదికలో, అతని నికర ఆస్తి విలువ సుమారు 10 మిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా. ఇందులో అతనికి బంగ్లా, లగ్జరీ కారు, వాచ్‌తో పాటు అనేక ఆస్తులు ఉన్నాయి. 58 ఏళ్ల అతను ఇప్పుడు బాక్సింగ్‌కు దూరంగా ఉన్నాడు. అతను తరచుగా హాలీవుడ్ సినిమాలలో కనిపిస్తాడు.



Click it and Unblock the Notifications
