Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
Trending : కొత్త బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 లాంచ్.. ధర, ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయ్..!
రాయ్ ఎన్‌ఫీల్డ్ వాళ్లు కొత్త బైక్‌ను లాంచ్ చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ గిరిల్లా 450గా ఇది మార్కెట్‌లోకి లంచ్ చేయబడింది. గతంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ వాళ్లు లాంచ్ చేసిన హిమాలయన్ 450 లాంటి ఎన్నో ఫీచర్లను మీరు ఇందులో చూడవచ్చు. అయితే ఈ బైక్ ధర చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం మార్కెట్ ధరలతో పోలిస్తే ఇది కొంచెం తక్కువగా చెప్పుకోవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ధర రెండు లక్షలకు పైగానే వుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ వాళ్లు లాంచ్ చేసిన హిమాలయన్ 450 మంచి రివ్యూలను రాబట్టుకుంది. ఇదే బైక్‌లో కొన్ని మార్పులను చేసి మళ్లీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450గా మార్కెట్లోకి లాంచ్ చేసారు. వీటిలో ముఖ్యంగా మూడు మార్పులను చేశారు ఒకటి అనలాగ్, రెండు డాష్ మరొకటి ఫ్లాష్ మార్పులను చేశారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా బుక్కింగ్‌లు ప్రారంభమయ్యాయ్. ఆగస్టు 1 నుంచి ఈ బైక్ కు సంబంధించిన టెస్ట్‌రైడ్ లను మొదలుపెట్టనున్నారు. ట్రావెలింగ్‌ను ఇష్టపడేవారు, బైక్ పైన సాహసాలు చేయాలనుకునేవారికి ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ సరిగ్గా సరిపోతుంది. సిటీ రోడ్లకు కూడా ఈ బైక్ బాగా సూట్ అవుతుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్‌కు ఎల్‌ఈడీలతో హెడ్‌ల్యాంపులను ఏర్పాటు చేశారు. దీనికి టెయిల్ ల్యాంప్‌ను అమర్చారు. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450కి ప్రస్తుతం లాంచ్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 కి సీటింగ్ విషయంలో కొంత తేడా వుంది. హిమాలయన్ మోడల్‌లో రెండు సీట్లు వుంటే ప్రస్తుతం గెరిల్లా మోడల్‌లో మొత్తం ఒకటే సీటు వుంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ఇంజన్ హిమాలన్ మోడల్ కన్నా చాలా మెరుగ్గా పనిచేస్తుంది. 452 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో దీన్ని డిజైన్ చేశారు. ఈ బైక్‌లో స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో మొత్తం 6 స్పీడ్ గేర్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఈ బైక్‌ను గూగుల్ మ్యాప్‌కు నేరుగా లింగ్ చేయడం అద్భతమైన ఫీచర్‌గా చెప్పుకోవచ్చు. దీనికి డిజిటల్ డిస్‌ప్లే వుండడం విశేషం.
ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ధర విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో దీని ధర 2.39 లక్షల రూపాయల వరకు వుంటుంది. ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్ల వరకు వుంటుంది. పెట్రోల్ ట్యాంక్ మొత్తం ఫిల్ చేసిన తరువాత బైక్ మొత్తం బరువు సుమారు 185 కిలలో వరకు ఉంటుంది.



Click it and Unblock the Notifications
