Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
కేఏ పాల్ చేసి చూపించాడుగా!..కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష పూర్తిగా రద్దు
కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యింది. హత్య కేసులో దోషిగా తేలిన నిమిష ప్రియ మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఇండియన్ గ్రాండ్ ముఫ్తీ ఆఫీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రాండ్ ముఫ్తీ.. భారతదేశంలోని సున్నీ ముస్లిం కమ్యూనిటీలో అత్యంత సీనియర్, ప్రభావవంతమైన మత అథారిటీ. యెమెన్ రాజధాని సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిమిష ప్రియ మరణశిక్షను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించినట్లు గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
వాస్తవానికి జూలై 15, 2025న నిమిషా ప్రియకు యెమెన్‌లో మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా..చివరి నిమిషంలో అది వాయిదా పడటం భారతీయులందరికీ, ముఖ్యంగా కేరళ ప్రజలకు ఒక పెద్ద ఊరటనిచ్చింది. ఈ కేసులో నిమిషా ప్రియకు ఎదురైన కఠినమైన తీర్పు, ఆమెను కాపాడేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఫౌండర్, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏపాల్ కూడా నిమిష ఉరిశిక్ష రద్దు విషయంలో తన వంతు పాత్రను పోషించారు. గత కొన్ని రోజులుగా యెమెన్ దేశంలో ఉండి ఆయన స్థాయిలో చర్చలు జరిపారు. నిమిష ప్రియ భర్త,కుమార్తెని కలిసి ధైర్యం చెప్పారు.

నిమిష ప్రియను రిలీజ్ చేయాలని,ద్వేషం కంటే ప్రేమ శక్తివంతమైనదని..అనేక ఏళ్లుగా అంతర్యుద్దంలో అతలాకుతలమైన యెమెన్ లో శాశ్వత శాంతి కోసం మధ్యవర్తిత్వం వహించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు నిమిష ప్రియ భర్త,కుమార్తెను కలిసి సందర్భంగా కేఏ పాల్ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో విడుదల చేశారు. తప్పకుండా నిమిష ప్రియ విడుదలవుతుందని కొద్ది రోజుల క్రితమే కేఏపాల్ చెప్పారు. పాల్ అన్నట్లుగానే చావబోయిన నిమిష ప్రియ మరణం నుంచి తప్పించుకుంది.
అసలు నిమిష ప్రియ పూర్తి కేసు వివరాలు ఇవే
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా, కొల్లెంగోడ్ కు చెందిన 37 ఏళ్ల నిమిషా ప్రియ.. 2011లో నర్సుగా పనిచేయడానికి యెమెన్ వెళ్ళింది. కొంతకాలం నర్సుగా పనిచేసిన నిమిష ప్రియ ఆ దేశంలోనే ఓ క్లినిక్ పెట్టాలని నిర్ణయించుకుంది. అయితే యెమెన్ దేశం చట్టాల ప్రకారం..విదేశీయులు సొంతంగా వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వామి అవసరం. దీంతో ఆమె యెమెన్ పౌరుడైన తలాల్ అబ్దో మహదీతో కలిసి మెడికల్ క్లినిక్ ను ప్రారంభించింది. అయితే కొంతకాలం తర్వాత నిమిషా ప్రియ, తలాల్ మధ్య విభేదాలు తలెత్తాయి.
నిమిష ఆరోపణల ప్రకారం..తలాల్ ఆమెను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దోపిడీ చేశాడని, ఆమె పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నాడని, మాదక ద్రవ్యాలు ఇచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపుల నుంచి బయటపడటానికి నిమిషా ప్రియ ఒక ప్లాన్ వేసింది. తన సహోద్యోగి, యెమెన్ జాతీయురాలైన హనన్ తో కలిసి తలాల్ కు మత్తుమందు ఇవ్వాలని నిర్ణయించుకుంది. తలాల్ అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు తన పాస్ పోర్టును తిరిగి తీసుకోవాలని ఆమె భావించింది. అయితే ఇచ్చిన మత్తుమందు మోతాదు ఎక్కువ కావడంతో తలాల్ మహదీ మరణించాడు. తలాల్ చనిపోయిన తర్వాత నిమిష ప్రియ, ఆమె సహచరి హనన్ తో కలిసి తలాల్ శరీరాన్ని ముక్కలుగా చేసి ఒక నీటి ట్యాంక్ లో పడేశారు.
తలాల్ మహదీ అదృశ్యం అయిన తర్వాత కుబుంబసభ్యుల కంప్లెయింట్ తో పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. చివరికి పోలీసులు ఈ కేసులో విచారణ జరిపి 2017 ఆగస్టులో నిమిషా ప్రియను, ఆమెకు సహకరించిన హనన్ ను యెమెన్ సరిహద్దుల్లోని సౌదీ అరేబియా సమీపంలో పారిపోతుండగా అరెస్ట్ చేసినట్లు సమాచారం. 2020లో సనా ట్రయల్ కోర్టు నిమిష ప్రియకు మరణశిక్ష విధించింది.



Click it and Unblock the Notifications