Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
అన్నీ తస్సు బాంబులే: పాకిస్తాన్ ని మోసం చేసిన చైనా..ప్రపంచం ముందు పరువు పోయిందిగా
జమ్మూకశ్మీర్ లోని హెహల్గామ్ లో గత నెలలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత దీనికి వెనుక ఉన్నది పాకిస్తానే అని భారత్ గుర్తించింది. దీంతో పాకిస్తాన్ కు ఈసారి గట్టిగా బుద్ధి చెప్పి తీరాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలో మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసి పేల్చేసింది భారత్. ఈ ఆపరేషన్ కి 'సింధూర్' అనే పేరు పెట్టారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సాయుధ దళాలకు చెందిన ఇద్దరు మహిళా అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం జరిగింది. పాకిస్తాన్ కనుక ఎదురుదాడికి దిగడానికి ట్రై చేస్తే ఫలితం దారుణంగా ఉంటుందని ఈ విలేఖరుల సమవేశంతో భారత్ హెచ్చరించింది. అయితే కుక్క తోక ఎప్పుడూ వంకరే అన్నట్లుగా పాక్ మనమీద దాడి చేయడానికి ట్రై చేసి భంగపడింది.

ఇవాళ(మే 8)మనదేశంలోని 15 సిటీలను టార్గెట్ గా చేసుకొని పాకిస్తాన్ మిసైల్ దాడులకు పాల్పడింది. అయితే మన దగ్గర ఉన్న S 400 ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్ పాక్ పంపిన క్షిపణులన్నింటిని పేల్చి పడేసింది. పాక్ ఏ తీవ్రతతో దాడి చేసిందో అదే రేంజ్ తో భారత్ ప్రతీకార దాడులు చేసింది. భారత్ ప్రతీకార దాడిలో పాకిస్తాన్ HQ9 వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. అయితే ఈ సంఘట తర్వాత పాకిస్తాన్ చైనా ఆయుధాలపై ఎంతగా ఆధారపడాల్సి వచ్చిందో క్లియర్ గా అందరికీ అర్థమైపోయింది. ఇందుకోసం పాకిస్తాన్ వేల కోట్ల రూపాయిలు కూడా ఖర్చు చేసింది. అయితే ఇప్పుడు చైనా ఆయుధాలన్నీ మనం వాడే చైనా వస్తువుల్లానే పాడవటం చూసి పాకిస్తానీలు అవాక్కవుతున్నారు.
పాకిస్తాన్ దగ్గర ఆరు ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇందులో చైనాలో తయారైన HQ-9P?HQ-9BE కూడా ఉంది. ఇది 100-200 కి.మీ వరకు రక్షణ కల్పించగలదు. ఈ చైనా ఆయుధంలో AESA రాడార్,మాక్ 14 మిసైల్స్ కూడా ఉన్నాయి. మరోవైపు, భారత్-రష్యా జాయింట్ గా డెవలప్ చేసిన బ్రహోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని అడ్డుకోడానికి పాక్ దగ్గ LY-80/LY-80E అనే ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్ ఉంది. స్కాల్ప్ మిసైల్ ఎటాక్స్ ని అడ్డుకోడానికి పాకిస్తాన్ కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టి చైనా నుంచి FM-90 అనే ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్ కొనింది.
ఫ్రాన్స్ లో తయారైన క్రోటుల్ అనే ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్ కూడా పాక్ దగ్గర ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ లో అవన్నీ ఇప్పుడు ధ్వంసమయ్యాయి. ఫలితంగా వేల కోట్లు ఖర్చు పెట్టి పాకిస్తాన్..డ్రాగన్ దేశం నుంచి కొన్న ఆయుధాల విషయంలో పూర్తిగా మోసపోయిందిరోయ్ అంటే నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో పాక్ దుస్థితిపై సెటైర్లు వేస్తున్నారు. చైనా కారణంగా ప్రపంచం ముందు పాకిస్తాన్ నవ్వులపాలైపోయిందని..చైనాని నమ్ముకున్న ఎవరికైనా ఇదే దుస్థితి అని కామెంట్స్ చేస్తున్నారు. పాక్ ఆర్మీ కూడా చైనాపై ఈ విషయంలో ఫ్రష్టేషన్ ఫీల్ అవుతున్నట్లు సమాచారం. ఏం చేయాలి రా బాబు అని పాక్ ఆర్మీ ఇప్పుడు అనవసరంగా భారత్ తో పెట్టుకున్నామే అంటూ బాధపడుతున్నట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications