Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
సనాతన ధర్మ టూర్ కి బయల్దేరిన ఏపీ డిప్యూటీ సీఎం..పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది!..ఫొటోలు చూడండి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర భాగంగా ఇవాళ హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి కొచ్చికి బయలుదేరారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం పర్యటన చేపట్టిన పవన్..నేటి నుంచి నాలుగు రోజుల పాటు కేరళ,తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేరళ ఆర్థిక రాజధాని కొచ్చిన్ కు బయల్దేరి వెళ్లారు. కొచ్చి దగ్గర్లోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించి తర్వాత తిరువనంతపురం వెళ్లి అనంత పద్మ నాభ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు.
సనాతన ధర్మ యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను కూడా పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూ అప్పటినుంచి ఆయన సతాన ధర్మం గురించి చేస్తున్న వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి. తిరుపతి లడ్డూ వివాదం వేళ పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెర మీదకు తెచ్చారు. దేశ వ్యాప్తంగా పవన్ డిమాండ్ కు మద్దతు లభించింది.

సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసమే
హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పవన్ ఇందు కోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఐదు రోజుల పాటు దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ స్కెచ్ లో భాగమా?
అయితే ఇదంతా బీజేపీ స్కెచ్ లో భాగమేనని, ఏపీ డిప్యూటీ సీఎం సనాతన ధర్మ టూర్ వెనక బీజేపీ వ్యూహం ఉంది అనే వాదన వినిపిస్తోంది. ఎన్డీఏలో భాగ స్వామిగా ఉన్న పవన్..కమలం పార్టీ పెద్దల ఆదేశాలతోనే ఈ టూర్ పెట్టుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు,పవన్ కళ్యాణ్ ముందుగా అనుకున్న మొక్కులను తీర్చుకునేందుకు ఈ పర్యటన చేపట్టాలని కొందరు చెబుతున్నారు.
జమిలి ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దక్షిణాదిన ఏపీలో మినహా.. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. ఏపీలోనూ కూటమి భాగస్వామిగా ఉంది. దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితం అయింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కు దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జారుగుతోందని రాజకీయ వర్గాలు నుంచి సమాచారం.



Click it and Unblock the Notifications