Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
Miracle Temples: ప్రతి రోజూ మిరాకిల్స్ జరిగే 5 ఆలయాలు..సైన్స్ కి అందని రహస్యాలు!
మనదేశంలో గుడులకు లేదా ప్రార్థనా ప్థలాలకు కొదవే లేదు. గల్లీ గల్లీకో గుడి లేదా మసీదు లేదా చర్చి ఉంటుంది. అయితే ప్రార్థనా ప్థలాల్లో మిరాకిల్స్ మాట మనం తరచుగా వింటుంటాం,సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాం. ఆ చర్చికి వెళ్తే పెద్ద పెద్ద డాక్టర్స్ నయం చేయని రోగం చిటికెలో నయం అయిపోయిందని చెబుతుండటం, మసీదులో తాయత్తు ఇస్తే రోగాలు,దెయ్యాల భయాలు పోతాయని..గుడికి వెళ్లి పూజలు చేస్తే కోటీశ్వరులు అయిపోతారని తరచుగా చెబుతుండటం,సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుంటాం. ఇదంతా కొందరు నమ్ముతారు,కొందరు అంతా ఫేస్ అని కొట్టిపారేస్తుంటారు. కానీ ఎవరి విశ్వాసం వాళ్లది..ఎవరి నమ్మకం వారిది.
అయితే టెక్నాలజీ రాజ్యమేలుతున్న ఈ ప్రపంచంలో అచంచలమైన నమ్మకం పర్వతాలను కదిలించగలదని, కనీసం వాటిని దివ్యకాంతులతో ప్రకాశింపజేయగలదని మనదేశంలోని కొన్ని ఆలయాలు నిశ్శబ్దంగా గుర్తుచేస్తాయి. మనదేశంలో 5 ఆలయాల్లో ప్రతిరోజూ మిరాకిల్స్ జరుగుతాయి. ఆ ఆలయాలు ఎక్కడున్నాయో ఇక్కడ చూడండి.

కామాఖ్య ఆలయం
అసోం రాష్ట్రంలోని గౌహతి నగర శివార్లలో ఉన్న నీలాచల పర్వతాలపై కొలువై ఉన్న కామాఖ్య దేవి ఆలయం భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన శక్తి పీఠాలలో అగ్రగణ్యమైనది. ఈ గుడిని ప్రపంచంలోనే ప్రత్యేకం చేసే ఒక అద్భుతం ఇక్కడ ఏటా జరుగుతుంది. అదే అంబుబాచి మేళా. ఈ సమయంలో సాక్షాత్తూ అమ్మవారే రుతుక్రమం చెందుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మూడు రోజుల పాటు ఆలయ గర్భగుడిని మూసివేస్తారు. ఆ సమయంలో గర్భగుడిలోని భూగర్భ జల ఊట ఎటువంటి రంగులు కలపకుండానే ఎర్రగా మారుతుంది.
సైంటిస్టులు దీనిని భూమిలోని సహజ ఖనిజాల రసాయనిక చర్యగా వివరించడానికి ప్రయత్నించినా ప్రతి సంవత్సరం రుతుపవనాల ఆగమనంతో ఇది కచ్చితంగా ముడిపడి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భూమాత తన సృజనశక్తిని పునరుద్ధరించుకుంటుందనే ప్రాచీన నమ్మకానికి ఇది ప్రతీక. ఆ మూడు రోజుల తర్వాత ఆ పవిత్ర జలంలో తడిపిన ఎర్రటి వస్త్రాన్ని (అంగవస్త్రం) ప్రసాదంగా స్వీకరించడానికి భక్తులు రోజుల తరబడి వేచి ఉంటారు.

శ్రీ సిద్ధివినాయక ఆలయం
ముంబై నగరంలోని శ్రీ సిద్ధివినాయక ఆలయం ఎంతో శక్తివంతమైనది. కోరిన కోర్కెలు తీర్చడంలో ఈ ఆలయానికి ఉన్న ఖ్యాతి కేవలం పురాణాల నుండి వచ్చింది కాదు, శతాబ్దాల భక్తి,లెక్కలేనన్ని అనుభవాల నుండి పుట్టింది. సామాన్యుల నుండి సెలబ్రిటీల దాకా లక్షలాది మంది ఇక్కడ చేసిన ప్రార్థనలు తమ తలరాతను మార్చాయని చెబుతారు. కుడివైపునకు తిరిగిన తొండంతో ఉన్న ఇక్కడి గణపతి విగ్రహం అత్యంత శక్తివంతమైనదని, త్వరితగతిన ఫలాలను ఇస్తుందని నమ్ముతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయాన్ని 1801లో సంతానం లేని దేవూబాయి పాటిల్ అనే మహిళ నిర్మించింది. తనకు లేని సంతాన భాగ్యం ఇతరులకు కలగాలని ఆమె ప్రార్థించింది. అప్పటి నుండి ఎందరో దంపతులు ఇక్కడ మొక్కుకుని సంతానంతో తిరిగి రావడం పరిపాటిగా మారింది.

షిర్డీ సాయిబాబా మందిరం
షిర్డీ అనే పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది సాయి బాబా. ఆయన ఒక ఫకీరు, అన్ని మతాల సారాంశం ఒక్కటేనని చాటిన గురువు. ఆయన ప్రవచించిన ఏకైక సత్యం సబ్ కా మాలిక్ ఏక్(అందరి దేవుడు ఒక్కడే). ఆయన మహాసమాధి చెంది వందేళ్లు దాటినా, ఆయన ఉనికి ఇప్పటికీ షిర్డీ గాలిలో నిండి ఉందని నమ్ముతారు. సాయిబాబా స్వయంగా వెలిగించిన ధుని (పవిత్ర అగ్ని) ఆయన నివసించిన ద్వారకామాయిలో నేటికీ నిరంతరం ప్రజ్వలిస్తూనే ఉంది. ఈ పవిత్రాగ్ని నుండి వచ్చే బూడిదను ఊదీ అంటారు. దీనికి అద్భుతమైన రోగనివారణ శక్తులు ఉన్నాయని, ఎలాంటి అనారోగ్యాన్నైనా నయం చేస్తుందని భక్తులు బలంగా నమ్ముతారు. ఊదీతో స్వస్థత పొందిన వారు లక్షల్లో ఉన్నారు. ప్రతి రోజూ పొద్దున్నే సూర్యుని తొలి కిరణాలు సాయిబాబా పాలరాతి విగ్రహంపై పడి మందిరాన్ని ప్రకాశవంతం చేస్తాయి. అది చూస్తే ప్రకృతి కూడా ఆ మహనీయునికి నమస్కరిస్తోందా అనిపిస్తుంది.

తిరుపతి బాలాజీ ఆలయం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. కానీ ఇక్కడి సంపద పోగయ్యే విధానం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రతిరోజూ, వేలాది మంది భక్తులు ఏడుకొండల వాడికి బంగారం, డబ్బు, నగలు సమర్పిస్తారు. రోజుకు కోట్లాది రూపాయల విరాళాలు వస్తున్నా, ప్రతి పైసా ప్రజాసేవకే వినియోగించడం ఇక్కడి విశేషం. నిత్యాన్నదాన పథకం ద్వారా రోజూ 50000 మందికి పైగా భక్తులకు భోజనం పెట్టడం, దేశవ్యాప్తంగా హాస్పిటల్స్, విద్యాసంస్థలను నడపడం ఈ దైవిక సంపదతోనే సాధ్యమవుతోంది. భక్తులు తమ అహంకారాన్ని విడిచిపెట్టడానికి గుర్తుగా తలనీలాలు సమర్పిస్తారు. ఈ వెంట్రుకలను విక్రయించడం ద్వారా కూడా ఆలయానికి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. ఇది భగవంతుడికి మనం ఎంత ఇస్తే ఆయన సమాజానికి అంతకు రెట్టింపు తిరిగిస్తాడనే నమ్మకానికి ప్రతీక.

వైష్ణో దేవి ఆలయం
జమ్మూ నగరానికి సమీపంలో త్రికూట పర్వతాలలోని ఒక గుహలో ఉన్న వైష్ణోదేవి ఆలయంకి వెళ్లాలంటే అమ్మ ఆజ్ణ ఉండాల్సిందే అంటారు. ఆ జగన్మాత పిలవనిదే ఎవరూ ఆ యాత్ర చేయలేరని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలుగా మూడు సహజసిద్ధమైన శిలారూపాలు (పిండిలు) ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు సందర్శిస్తున్నా, శతాబ్దాలుగా ఈ పిండిలు తేమకు గానీ, కాలానికి గానీ ఏమాత్రం చెక్కుచెదరకుండా ఎలా ఉన్నాయో సైంటిస్టులకు అంతుచిక్కడం లేదు. ప్రతి సంవత్సరం లక్షల మందికి పైగా భక్తులు ఈ యాత్ర చేస్తారు. ఎందరో తమకు అలౌకిక అనుభవాలు ఎదురయ్యాయని, అనారోగ్యాల నుండి ఆకస్మికంగా కోలుకున్నామని చెబుతారు. శతాబ్దాలుగా ప్రకృతి వైపరీత్యాలు కూడా ఈ పవిత్ర మందిరానికి హాని కలిగించలేకపోవడం ఆ తల్లి మహిమేనని భక్తులు విశ్వసిస్తారు.



Click it and Unblock the Notifications