Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
ఇద్దరు పెళ్లాలు కలిసి తమ ముద్దుల మొగుడికి ఎలాంటి బహుమతి ఇచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం...!
ధన శేఖరన్ మొదటి భార్య సెల్వి వజూర్ అగరామ్ పంచాయతీ నుంచి తిరిగి ఆ పదవికి ఎన్నికయ్యారు. ఆమెకు 345 ఓల్ల మెజార్టీ వచ్చింది.
మన దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న మగవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. చాలా మంది రెండో పెళ్లిని తప్పుగా కూడా భావిస్తారు. ఇక మహిళలు అయితే తమ భర్త ఎల్లప్పుడూ తమకే సొంతం కావాలని ఆశిస్తుంటారు. కానీ కొందరు మహిళలు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తారు. అలాంటి వారే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు మహిళలు.
వీరిద్దరూ ఒకే మగాడిని కావాలనుకున్నారు. ఇంతకీ ఆ మగాడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అతను ఏ సెలబ్రిటీనో లేదా సినిమా హీరోనో, స్పోర్ట్స్ స్టారో కాదు. ఒక సాధారణ రైతు. ఈయనపై మోజు పడ్డ ఆ ఇద్దరు మహిళలు పెళ్లి విషయంలో పెద్దలను ఒప్పించి తమ పంతం నెగ్గించుకున్నారు. అందరి కంటే భిన్నంగా వీరంతా కలిసిమెలసి సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు.

అయితే వారి గ్రామంలో నిర్వహించిన ఓ పోటీలో ఆ రైతు భార్యలు పాల్గొన్నారు. అందులో ఘన విజయం కూడా సాధించారు. దీంతో ఆ రైతు ఆనందంతో ఉబ్బితబ్బిబయి పోయాడు. ఇంతకీ ఆ పోటీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...

ఎన్నికల హడావుడి...
మన దేశంలో ఎన్నికల్లో పోటీ అంటే ఎంత హడావుడి ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసే వారి వ్యక్తిగత జీవితం ఎంత కరెక్టుగా ఉంటే అంత మంచిదని అందరూ భావిస్తారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో ఎప్పటి నుండో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చాలా మందికి బలహీనత..
చాలా మంది రాజకీయ నాయకులు రెండు వివాహాల బలహీనత వల్ల రాజకీయాల్లో రాణించలేకపోతారు. వ్యక్తిగత జీవితం వేరు. రాజకీయ జీవితం వేరు అని చెప్పుకోవడానికి అనేక తంటాలు పడటం మనం చూస్తూ ఉంటాం.

ఆ రైతు భార్యలు..
అయితే తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా వందవాసి పంచాయతీ యూనియన్ పరిధిలోని వళిపూర్ గ్రామంలో ధనశేఖరన్ అనే రైతుకు ఇద్దరు భార్యలు. ధనశేఖరన్ భార్యలలో మొదటి పెళ్లాం సెల్వి(46), రెండో పెళ్లాం (37) ఇద్దరు వేర్వేరు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు..

పోటీ చేయడమే ఒక ఎత్తయితే..
తన ఇద్దరు భార్యలు ఎన్నికల్లో పోటీ చేయడమే ఒక ఎత్తు అయితే.. వారిద్దరూ ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం గొప్ప విశేషం. దీంతో ధనశేఖరన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఎక్కడెక్కడ పోటీ చేశారంటే..
ధన శేఖరన్ మొదటి భార్య సెల్వి వజూర్ అగరామ్ పంచాయతీ నుంచి తిరిగి ఆ పదవికి ఎన్నికయ్యారు. ఆమెకు 345 ఓల్ల మెజార్టీ వచ్చింది. ఈమె ఈ పదవికి పోటీ చేయడం రెండోసారి. ఈ గ్రామంలో మొత్తం 1600 మంది ఓటర్లు ఉన్నారు. ఇక రెండో భార్య కాంచనకు కోలిల్ కుప్పం సాత్తనూరు పంచాయతీలో ఓటు హక్కు ఉండటంతో ఆమె అక్కడ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అక్కడ కూడా ఆమె విజయఢంకా మోగించింది.

మొదటి భార్య గురించి..
తన మొదటి విజయం గురించి రైతు ధనశేఖరన్ ఇలా అన్నారు. ‘‘తన మొదటి భార్య 2011 నుండి 2016 సంవత్సర కాలంలో తను పదవిలో ఉన్నంత కాలం మంచి పనులు చేసింది. అందుకే ఈ గ్రామ ప్రజలు ఆమెపై ఎంతో నమ్మకంతో మళ్లీ ఈ విజయాన్ని కట్టబెట్టారు‘‘ అని మీడియా ప్రతినిధులకు చెప్పారు.

రెండో భార్య గురించి..
కోయిల్ కుప్పం పంచాయతీలో కూడా తన రెండో భార్య కాంచన కమ్మని విజయం సాధించడం పట్ల ధనశేఖరన్ ఇలా స్పందించాడు. ‘‘అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విజయం చిరస్మరణీయమైంది‘‘ అని తెలిపారు. డబుల్ ధమాకా కొట్టిన ధనశేఖరన్ తన ఇద్దరు పెళ్లాలతో విజయ సంబరాలు చేసుకున్నాడు.

సెల్ఫీల కోసం..
ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు అయిన ధనశేఖరన్ తన ఇద్దరు భార్యలతో కలిసి గెలుపు సంబరాలు చేసుకుంటుంటే వారితో సెల్ఫీలు దిగేందుకు అక్కడి ప్రజలు పోటీ పడ్డారు. దీంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
