Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఉదయాన్నేఉత్సాహాంగా నిద్రలేవడం ఎలా?
మీరు పనికి ఆలస్యమవుతున్నారు, కనీసం ఉపాహారం కూడా తీసుకోకుండా వొచ్చారు మరియు ఎక్కువ గంటలు పని చేయవలసివొస్తుందని చిరాకయిన మనసుతో ఉన్నారు. మరోవైపు, మీ సహోద్యోగి ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నానని మిమ్మలిని ఊదరకొడుతుంటే, మీకు ఒకవైపు అతనిని చెంపపగలగొట్టాలని అనిపించినా, ఒకవైపు అతనిలా మీరు ఉండలేదని బాధపడుతుంటారు: ఒక ఉత్సాహవంతమైన వ్యక్తి.
అలా తయారవటానికి మీకు ఆత్మవిశ్వాసం మరియు అంకితభావం ఉండాలి, కాని మీ మనస్సు మరియు శరీరానికి శిక్షణ ద్వారా ఉదయాన్నే ఉత్సాహంగా లేవటం సాధ్యమే. ఇక్కడ దీనికి కావలసిన 6 చిట్కాలు ఇస్తున్నాము.

లేట్ రాత్రులకు స్వస్తి చెప్పండి
మీకు ఈ విషయం బాగా తెలుసు మరియు ఇది నిజం. మీ శరీరం మరియు మనసుకు సాధ్యమైనంత తొందరగా రాత్రుళ్ళు నిద్రపోవటం అలవాటు చేయండి మరియు ఈ అలవాటు వలన మరుసటిరోజు త్వరగా లేవగాలుగుతారు. మామూలు సమయం కంటే ఒక గంట ముందుగా అన్ని కార్యక్రమాలు ముగించండి మరియు అర్థరాత్రి ప్రదర్శనలు, ప్రాజెక్టులు మరుసటి రోజు చేయవచ్చు, వాటినన్నిటిని పక్కన పెట్టి ముందు నిద్రకు ఉపక్రమించండి.

మీయొక్క ఉపాహారం మానవొద్దు
ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఉన్న ఉపాహారాన్ని తీసుకోండి. ఉదయం ఉపాహారం తప్పించాలనుకోవటం మంచి ఆలోచన కాదు మరియు ఇలా చేయతంవలన కేవలం మీకు శక్తి రాకపోవటమే కాదు, మీ ఉదయపు ఉత్సాహమంతా పోతుంది. పండ్లతోపాటు ఓట్స్ తీసుకోండి, తక్కువ కొవ్వు ఉన్న పెరుగు లేదా పీనట్ బటర్ తో హోల్ గ్రెయిన్ బ్రెడ్ తీసుకోండి.

మీ మనసును సరిగా ఉంచుకోండి
ఒక ఉత్సాహంతో మీరు సాదాసీదాగా మరియు ప్రశాంతంగా సంభాషణ జరపండి. సానుకూల ఆలోచనతో 'నేను ఉదయాన్నే లేస్తాను' అని అనుకోండి, కాని 'ఉదయాన్నే లేవాలి' అని కాదు. మీరు మనసులో ఏదయినా తలపెడితే అది చేస్తాను అని గట్టిగా నమ్మండి, దీనివలన మీ మనసులో ఏకాగ్రత పెరుగుతుంది, ఇది మీ కలలను సాకారం చేస్తుంది.

ఉదయాన్నే నడక ప్రారంభించండి
మీకు ఉదయాన్నే లేవాలంటే కష్టంగా అనిపిస్తే ఈ చిన్న ట్రిక్ ఉపయోగించండి. రాత్రి పడుకునే ముందు గడియారం అలారం పెట్టుకొని మీ ప్రక్కనే పెట్టుకోకండి. గడియారాన్ని మీ గదికి అవతల ఉంచండి. అలారం ఆపటానికి మీరు అవతలి గదిలోకి వెళతారు. అలా నడక మొదలు పెడతారు.

ఉదయాన్ని కాంతివంతం చేయండి
ఉదయాన్నే కిటికీ గుండా పడే సూర్యుని కాంతికిరణాలకంటే మరి ఏదీ కూడా మీ మనసును ఉత్తేజపరచదు. మీ కిటికీలు మూసి ఉంటే, మిమ్మలిని మేల్కొల్పటానికి ప్రత్యేకంగా లైట్ బాక్సులు దొరుకుతాయి. అవి $50-$200 వరకు ఖరీదు ఉంటాయి. ఖర్చు అనుకుంటే మీ పడకను కిటికీకి దగ్గరగా మార్చుకోండి.

దీని కోసం ఒక అనువర్తనం
ఎప్పుడైనా స్మార్ట్ అలారం లేదా మాథ్ అలారం విన్నారా? మీరు ఉదయాన్నే పడక నుండి లేవటానికి ఈ రెండూ గొప్పవే! వీటిని మీ ఫోన్ లో సులభంగా అమలుచేయవొచ్చు. మీ ఫోన్ పూర్తిగా ఆగిపోయెంత వరకు ఉండకుండా మీ ఫోన్ లో అలారం ఆపటానికి తప్పనిసరిగా లేస్తారు. మీకు ఈ పధ్ధతి చాలా బాగా పని చేస్తుంది. వెంటనే అమలు చేయండి మరియు మీ మనసును మరియు శరీరాన్ని ఉత్సాహంగా మరియు ఉత్తేజితంగా ఉంచుకోండి.



Click it and Unblock the Notifications











