హ్యుమన్ వాయిస్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!

By Super Admin

ప్రపంచంలో అందరి కంఠ స్వరాలూ ఒకేలా ఉండవు. కొందరికి దేవ గాయకులంత మధుర కంఠస్వరం ఉంటుంది.అలాంటి స్వరం ఉండటం ఒక వరం.అటువంటి కంఠ స్వరం ఉన్ననుదు మీరు కృతఙులై ఉండాలి. అటువంటి స్వరం గొప్పతనాన్ని గ్రహించలేని పిచ్చివారితే తప్ప మీరు అలాంటి స్వరం ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవరూ??మానవుల కంఠ స్వరం గురించి మీకు తెలీని కొన్ని విషయాలు క్రింద ఇచ్చాము చూడండి.

వయసు ప్రకారం మానవుల కంఠ స్వరం మారుతుంది:

వయసు ప్రకారం మానవుల కంఠ స్వరం మారుతుంది:

మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ స్వరం వేరేగా ఉంటుంది. టీనేజీలోకి రాగానే స్వర గ్రంధులు మందం అవ్వడం వల్ల స్వరం మారుతుంది. అబ్బాయిలలో ముఖ్యంగా ఈ మార్పుని గమనించవచ్చు.మీ కంఠ స్వరం మెక్జో-సోప్రానో లేదా గంభీర స్వరంగా మారవచ్చు.

చాలా మంది మగవారికి గంభీర కంఠ స్వరం ఉంటుంది

చాలా మంది మగవారికి గంభీర కంఠ స్వరం ఉంటుంది

అబ్బయిల కంఠ స్వరం అమ్మాయిలంటే భిన్నంగా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు కదా.కొంత మంది అబ్బాయిలలో గంభీర స్వరం ఉంతే మరి కొంతమందికి మంద్ర స్వరం ఉంటుంది. ఇది సహజమే.కానీ చాల మంది అబ్బాయిలకి గంభీర స్వరం ఉంటుంది. అలా అని అబ్బాయిలలో మంద్ర స్వరం లేని వారు ఉంటారని కాదు.కొంత మందికి మంద్ర స్వరం ఉన్నా చాలా మంది గంభీర స్వరంతోనే ఉంటారు.

మనిషి కంఠస్వరం గరిష్టంగా 129 డెసిబల్స్ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది

మనిషి కంఠస్వరం గరిష్టంగా 129 డెసిబల్స్ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది

గిన్నెస్స్ రికార్డుల ప్రకారం మనిషి కంఠ స్వరం గరిష్టంగా 129 డెసిబల్స్ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది.అంటే ఇది ఏసీ/డీసీ కన్సర్ట్ అప్పూడు వచ్చే శబ్ద శక్తితో సమానం.ఇంగ్లాండులోని కెంట్ ప్రాంతానికి చైందీ జిల్ డ్రేక్ అనే మహిళ ఇంత శబ్దాన్ని తన కంఠ స్వరం ద్వారా సృష్టించగలదు.

మొట్టమొదటిసారి మానవ స్వరాన్ని 1860లో రికార్డు చేసారు:

మొట్టమొదటిసారి మానవ స్వరాన్ని 1860లో రికార్డు చేసారు:

ఇదే సంవత్సరంలో శబ్దాన్ని రికార్డు చేసే పరికరం కనుగొనబడినది.అదే ఫోనటోగ్రాఫ్.ఎడూఅర్డ్-లియోన్-స్కాట్ డే మార్టిన్‌విల్లే దీనిని కనుగొన్నాడు.ఈ పరికరం ద్వార రికార్డు చెయ్యబడిన మొదటి స్వరం కూడా ఇతనిదే.

మానవ మెదడు, కంఠస్వరం పరస్పర కనెక్షన్ కలిగి ఉంతాయి:

మానవ మెదడు, కంఠస్వరం పరస్పర కనెక్షన్ కలిగి ఉంతాయి:

ఈ రెండూ వేరు వేరు కదా ఎలా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయని మీకు అనిపించవచ్చు.ఒక మనిషి పాడుతున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పూడు మనిషి మెదడు చురుకుగా ఉంటుంది.మీరు పాడుతుంటే మెదడులోని కుడి భాగం పనిచేస్తుంది. అదే మీరు మాట్లాడుతోంటే ఎడమ భాగం పని చెయ్యడంవల్ల మీరు మాట్లాడగలుగుతారు.

మానవ కంఠ స్వరం చాలా రకాల ధ్వనులని ఉత్పత్తి చేస్తుంది.

మానవ కంఠ స్వరం చాలా రకాల ధ్వనులని ఉత్పత్తి చేస్తుంది.

మానవ స్వరం ఎలా కావాలంటే అలా వంగుతుంది. అందుకే మంచి నైపుణ్యం ఉన్న స్వరానుకరణ నిపుణులు రకరకాల ధ్వనులని తమ నోటితో సృష్టించగలరు.కార్టూన్ కారక్టర్లకి డబ్బింగ్ చెప్పేవాళ్ళు, సినిమాలకి డబ్బింగ్ చెప్పేవారు ఈ కోవలోకే వస్తారు.ఇక త్రోట్ సింగర్స్ ని ఎలా మర్చిపోతాము?? వారు తమ కంఠం ద్వారా నాలుగు రకాల స్వరాలని సృష్టించగలరు.

కంఠం ఉచ్చస్థితిలో ఉత్పత్తి చేసే శబ్దం 10 ఆక్టేవులు

కంఠం ఉచ్చస్థితిలో ఉత్పత్తి చేసే శబ్దం 10 ఆక్టేవులు

మారియా కేర్ స్వరం ఉత్పత్తి చేసే 5 ఆక్టేవుల స్వరమే అతి పెద్దది అని మీరనుకుంటే పొరపాటే.టింస్టారంస్ దీనికి రెండింతలు అంటే 10 ఆక్టేవుల స్వరాన్ని ఉత్పత్తి చెయ్యగలడు.ఒక సగటు గాయకుడు ఉత్పత్తి చెయ్యగలిగే శబ్దానికి ఇది 3 రెట్లు ఎక్కువ.

అతి తక్కువ నోట్‌లో పాడిన్స్ స్వరం -7 జీ లేదా 0.189 హెర్త్జ్:

అతి తక్కువ నోట్‌లో పాడిన్స్ స్వరం -7 జీ లేదా 0.189 హెర్త్జ్:

ప్రసిద్ధ గాయకుడు టిం స్టారంస్ ఈ రికార్డుని కలిగి ఉన్నాడు.ఇది పియానోలో అతి తక్కువ నోట్.దీనివల్ల ఈ స్వరాన్ని మానవులు వినలేరు.లో ఫ్రీక్వెన్సీ మైక్రో్‌ఫోన్ ఉపయోగించి సౌండ్ అనాలిసిస్ ద్వారా మాత్రమే ఈ స్వరాన్ని వినగలము.

కాస్ట్రషన్ ద్వారా గంభీర స్వరాన్ని నివారించవచ్చు:

కాస్ట్రషన్ ద్వారా గంభీర స్వరాన్ని నివారించవచ్చు:

వయసుతో పాటు స్వరం గంభీరంగా మారుతుంది ముఖ్యంగా మగవారికి. కాస్ట్రేషన్(బీజ గ్రంధులని తొలగించడం)ద్వారా స్వరం అలా మారకుండా నివారించవచ్చు.అవును ఇది నిజమే.యవ్వనానికి ముందే కాస్ట్రెషన్ ద్వారా మగవారి గొంతు గంభీరంగా మారకుండా చెయ్యవచ్చు.ఇలా కాస్ట్రేషన్ చేయించుకున్నవారిని కాస్ట్రాటీ అంటారు.

కాస్ట్రాటీ గాయకులు పెద్దమొత్తంలో సంపాదిస్తారు:

కాస్ట్రాటీ గాయకులు పెద్దమొత్తంలో సంపాదిస్తారు:

కొన్ని సంవత్సరాల క్రితం చాలా మంది మగవారు కాస్ట్రేషన్ చేయించుకోవడానికి తయారయ్యారు.దీనికి కారణం వారి స్వరాన్ని గంభీరంగా మార్చుకోకుండా అలాగే హై గా మెయింటెయిన్ చెయ్యడం కోసం.కానీ అసలు కారణం పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికే చాలా మంది మగవారు కాస్ట్రేషన్‌కి సిద్ధపడుతున్నారనేది విచారించదగ్గ విషయం.మామూలు గాయకుల కంటే కాస్ట్రేషన్ చేయించుకున్నవారికి అధిక మొత్తంలో డబ్బు ముడుతుంది.

Story first published: Saturday, October 1, 2016, 13:00 [IST]
Desktop Bottom Promotion