Latest Updates
-
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. మన పూర్వీకుల స్పెషల్ బీరకాయ మజ్జిగ పులుసు..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
మండుటెండల్లో ప్రాణం లేచిరావాలా? ఈ సమ్మర్ లో బెల్లం కోల్డ్ కాఫీ ట్రై చేయండి! -
కూల్ డ్రింక్స్ వద్దు..ఆరోగ్యానికి అమృతమంటి పుదీనా మజ్జిగ..5 నిమిషాల్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
శ్రీరామనవమి రోజునే సీతారాముల కళ్యాణం ఎందుకు?..దీని వెనుక ఉన్న రహస్యం ఏంటీ? -
మైసూర్ స్పెషల్ పల్లీ కొబ్బరి చట్నీ..ఈ చట్నీ చేస్తే ఇడ్లీ, దోశలు ఎన్ని తింటారో మీకే తెలీదు! -
ఈ రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహం, ధన లాభం! -
ఈ స్టైల్ లో టమాటా రసం పెడితే.. ఒక్క మెతుకు కూడా వదలకుండా లాగించేస్తారు! -
శ్రీరామనవమి శుభాకాంక్షలు 2026: మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ విషెస్, కోట్స్, వాట్సాప్ స్టేటస్! -
అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. శ్రీరామ నవమి స్పెషల్ పానకం, వడపప్పు ఎలా చేసుకోవాలంటే.. -
నేటి తరం దంపతులకు సీతారాములు నేర్పే 5 అద్భుతమైన జీవిత సత్యాలు!
ప్రపంచంలో ఒక్క నిముషంలో జరిగే 20 షాకింగ్ సంఘటనలు..!!
టైం ఈజ్ గోల్డ్ అన్న సామెత వినే ఉంటారు కదా.దీని అర్ధం తెలుసా??సమయాన్ని బంగారంతో ఎందుకు పోల్చారు??అంటే దీని అర్ధం సమయం కూడా బంగారం లాగ విలువైనదనీ ఏ ఒక్క నిమిషాన్నీ వ్యర్ధం చేయవద్దనీను.జీవితంలో మీకు ఉపయోగపడే పనుల మీద మీ సమయాన్ని వెచ్చించండి.మీకు ఖేదం కలిగించే పనులు చేస్తూ సమయాన్ని వృధా చెయ్యవద్దు.జీవితం చాలా చిన్నది కావున ఒక్క క్షణం కూడా వృధా పోనివ్వకూడదని గుర్తు పెట్టుకోండి.
మీ విలువైన ఒక్క నిమిషంలో ప్రపంచంలో ఎన్ని విషయాలు జరుగుతాయో మీకు తెలుసా??నిమిషానికి ప్రపంచంలో ఎన్ని సంఘటనలు జరుగుతాయో క్రింద ఇచ్చాము. వీటిలో కొన్ని మీకు తెలియకపోవచ్చు.ఇక ఆలశ్యమెందుకు, నిమిషానికి ప్రపంచంలో ఏమేమి జరుగుతాయో చదివి తెలుసుకోండి.

45,632 లీటర్ల వైనుని స్వాహా చేస్తున్నారు:
కేవలం వైన్ మాత్రమే కాదు ఇతర ఆల్కాహాల్ పదార్ధాలన్నీ కలిపిన సంఖ్య ఇది.సందర్భమేదైనా చాలా మందికి మద్యం తాగడమంటే మహా సరదా అన్నమాట.పుట్టినరోజు పార్టీ, సరదాగా అలా టైం పాస్ కోసం బార్లో చేసుకునే పార్టీ..సందర్భం ఏదైనా సరే నిమిషానికి 45,632 లీటర్ల మద్యం సేవిస్తున్నారు.

పది లక్షల పైచిలుకు మందికి శృంగారం మీద మనసు మళ్ళుతోంది:
ప్రతీ నిమిషం దాదాపు పదిహేను లక్షల మందికి శృంగారం మీదకి మనసు మళ్ళుతుందని అంచనా.అందుకే రాబోయే కాలంలో ప్రపంచ జనాభా మరింత పెరిగే అవకాశం ఉందని ఊహిస్తున్నారు.

దాదాపు 250 మంది బుజ్జిపాపాయిలు పుడుతున్నారు:
ప్రతీ నిమిషం నిమిషానికి పది లక్షలమంది శృంగారం మీద ఇష్టం చూపిస్తున్నారని అధ్యయనం చెప్తోంది.సరైన చర్యలు తీసుకోకపోతే జనాభా విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది.పుట్టే 250 పై చిలుకు పిల్లలలో 113 మంది దారిద్ర రేఖకి దిగివున ఉంటున్నారు, 15 మందికి ఏవో ఒక పుట్టుక లోపాలు ఉంటున్నాయి.

నిమిషానికి జరిగే వివాహాలు:59
ప్రతీ నిమిషం 59 మంది ప్రేమికులు వివాహం చేసుకుంటున్నారు.వివాహం చేసుకుంటున్నారంటే వారి మధ్య ప్రేమ కలకాలం నిలిచేదని చెప్పవచ్చు.

నిమిషాని ఓప్రా విన్‌ఫ్రే సంపాదన 523 డాలర్లు:
నిమిషానికే ఇంత సంపాదనంటే విన్‌ఫ్రే నెలకి,సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందో ఊహించండి.ఇంతకీ ఈవిడెవరో తెలీదా?? విన్‌ఫ్రే ప్రపంచంలో అత్యంత ధనవంతులైన వారిలో ఒకావిడ.అమెరికాకి చెందిన ఈ అరవై రెండేళ్ళ మహిళ టాక్ షో హోస్ట్,నటి,నిర్మాత,మీడియా సంస్థ ప్రొప్రైటర్ మరియూ దాన ధర్మాలు విరివిగా చేసే వ్యక్తి.

నిమిషాని తీసే ఫొటోల సంఖ్య 722,504:
నిమిషానికి ఇన్ని ఫొటోలా అని ఈ సంఖ్య మీద సందేహమే అక్కర్లేదు.ఎందుకంటే ఈరోజుల్లో అందరూ ప్రతీ సందర్భాన్నీ కెమేరాలో బంధించాలనుకుంటున్నారు. బోరు కొడితే కూడా ఫొటోలు తీసుకుంటున్నారు.అందుకే సెల్ఫీలు ప్రచారంలోకి వచ్చాయేమో.చాలా మంది తమ గదిలో ఒంటరిగా ఉన్నప్పుడో లేదా బాత్రూముల్లో కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు.ఫోటోలు తీసుకోవడాన్ని ప్రపంచంలో ఎంత మంది ఆస్వాదిస్తారో ఊహించగలరా??

నైకీ కంపెనీ 36,505 డాలర్లు ఆర్జిస్తుంది:
నిమిషానికే ఇంత మొత్తమంటే నైకీ సంస్థ నెలకి లేదా సంవత్సరానికి ఎంత ఆర్జిస్తుందో ఊహించగలరా??ఇంత ఆర్జిస్తోంది కాబట్టే నైకీ సంస్థ ఇప్పటికీ వృద్ధి రేటుతోనే కొనసాగుతోంది.అమెరికాకి చెందిన ఈ చెప్పుల సంస్థ బట్టలు,యాక్సెసరీస్, ఇంకా ఇతర ఉపకరణాలని ఉత్పత్తి చేస్తోంది.

ఛారిటీ సంస్థలకి 3,137,187 డాలర్లు దానం చేయబడుతున్నాయి:
ఈ మొత్తం చాలా ఎక్కువ కదా.అంటే ఈరోజుల్లో కూడా లేని వారికి సహాయం చేసే దయార్ద్ర హృదయులు చాలా మందే ఉన్నారన్నమాట.ఇది ఆహ్వాదించదగ్గ పరిణామం.దానం చేయబడిన సొమ్ముని ఆశ్రమ/ఛారిటీ నిర్వాహకులు సద్వినియోగం చేస్తారని ఆశిద్దాము.

నిమిషానికి 2 దొంగతనాలు:
అవును ఇది నిజమే.ప్రతీ నిమిషం 2 దొంగతనాలు నమోదు చేయబడుతున్నాయంటే రోజులో అమెరికాలో ఎన్ని దొంగతనాలు జరుగుతాయో.అమెరికా లాంటి శక్తి వంతమైన దేశంలో కూడా నేరం చెయ్యడానికి జంకట్లేదంటే ఇది నిజంగా విచారించదగ్గ విషయమే.

360 సార్లు మెరుపులు భూమిని తాకుతాయి:
మీకు తెలియకపోవచ్చు కానీ ప్రతీ నిమిషం 360 సార్లు మెరుపు భూమిని తాకుతుంది.ఈ లెక్కన రోజులో ఎంత మంది మెరుపుల వల్ల మరణించి ఉండవచ్చు లేదా ఎంత ఆస్థి నష్టం జరిగి ఉండవచ్చు??అందువల్లే మెరుపుల వల్ల ఇంత మంది మరణించారు అన్న వార్తలు వింటూ ఉంటాము.

ఎయిడ్స్/హెచ్ఐవీ కేసుల నమోదు:
ప్రపంచంలో ఎయిడ్స్/హెచ్ఐవీ వేగంగా వ్యాప్తి చెందడం కలవర పెట్టే అంశం.ప్రతీ నిమిషం తొమ్మిది మంది దీని బారిన పడుతున్నారు.ఇది సోకిందని తెలియగానే ఎంత మంది జీవితం మీద ఆశ వదులుకుంటున్నారో ఊహించగలరా అసలు??

అమెరికాలో 120,673 పౌండ్ల ఆహార వ్యర్ధాలు సేకరించబడతాయి:
ఇంత ఆహార వ్యర్ధం వల్ల ఎన్ని డబ్బులు కూడా వృధా అవుతాయో ఆలోచించారా??ఇంత వ్యర్ధం చేసే బదులు అన్నార్తూల కడుపు నింపగలిగితే బాగుంటుంది. అమెరికా ప్రజలు ఈ విషయంలో ఏదో ఒకటీ చెయ్యాలి ఎందుకంటే ఇన్ని పౌండ్ల ఆహారా వ్యర్ధాలంటే మాటలు కాదు.ఆహారాన్ని వృధా చేయకూడదు ఎందుకంటే ఈరోజుల్లో పని దొరకడమే గగనమైపోతోంది.

నిమిషానికి 5 భూకంపాలొస్తాయి:
మీకు తెలీదేమో కానీ ప్రతీ నిమిషం ప్రపంచంలో ఎక్కడో అక్కడ 5 భూకంపాలు నమోదవుతున్నాయి.ఈ 5 భూకంపాల తీవ్రత వేరుగా ఉండవచ్చు.కొన్ని అతి బలమైన కట్టడాన్ని కూడా కూల్చేసేంత అతి తీవ్రమైనవైతే మరి కొన్ని భూకంపాలు వచ్చినట్టు కూడా మీకు తెలీదు.ఇలాంటి తీవ్ర భూకంపాల వల్లే ప్రపంచంలో ఫలానా చోట తీవ్ర భూకంపం వల్ల నష్టం జరిగిందనే వార్తలు వింటూ ఉంటాము.

1,875,000 మంది ఫేస్‌బుక్ వినియోగదారులు తమ ఫేస్బుక్కులో లైక్ కోదతారు:
నిమిషానికి ఇంత మంది ఏదో ఒక విషయానికి లైక్ కొడుతున్నారంటే ఫేస్‌బుక్ వినియోగదారులు బిలియన్లలో ఉంటారని తెలుస్తోంది కదా.వీరు లైక్ చేసేది ఇతరుల స్టేశ్ అప్డేట్ కావచ్చు, వీడియోలు,లేదా ఇతర ఫేస్‌బుక్ పేజీలు.ప్రతీ నిమిషం చాలా మంది ఆన్ లైన్లో తమ ఫేస్‌బుక్ అకౌంట్ చెక్ చేసుకుంటారని తెలుస్తోంది.

107 మరణాలు:
ప్రపంచంలో నమోదైన మరణాలని పరిశీలిస్తే ప్రతీ నిమిషం 107 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ లెక్కన రోజులో ఎంత మంది మరణిస్తారు??ఈ సంఖ్య సరి అయినదే అయ్యి ఉండవచ్చు ఎందుకంటే నిమిషానికి 257 మంది పిల్లలు పుడుతున్నారు కదా.ఇంతకీ ఈ మరణాలకి కారణం, ప్రమాదాలు లేదా ఇతర కారణాలు.

18 మంది ఆకలితో మరణిస్తున్నారు:
భోజన సమయాల్లో సరైన భోజనం లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు.వీరెంత దురదృష్టవంతులో కదా.ఈ సమస్య చాలా పెద్దది కనుక ప్రతీ ప్రభుత్వం దీని గురించి ఏదో ఒకటి చెయ్యాలి.ధనవంతులు వారికున్న దాంట్లో కొంచమైనా లేని వారికిస్తే ఈ సమస్య కొంచమైనా తగ్గు ముఖం పట్టవచ్చు.

150,184 గిఫ్టులు ఇవ్వబడతాయి
మీరు కనుక మీ దగ్గరి వారి నుండి ప్రతీ రోజూ లేదా వారం లేదా కనీసం నెలకి ఒక్క బహుమతైనా అందుకోవట్లేదంటే మీరు చాలా అన్ లక్కీ అని చెప్పవచ్చు.ప్రతీ నిమిషం బహుమతులందుకునే 150.184 మందిలో మీరు లేరన్నమాట.ప్రతీ నిమిషం బహుమతులు అందుకునే వారి సంఖ్య ఇంత ఉంటుందని మీరు కనీసం ఊహించారా??మీరు కనుక ఈ సమయంలో బహుమతి అందుకుంటున్నవారిలో ఒకరయితే ఎన్ని బహుమతులు అందుకుటున్నారు?

ప్రపంచంలోకి 257 మంది బుజ్జి పాపాయిలు అడుగిడుతారు:
ఈ పాపాయిలందరూ పెళ్ళి అయిన వారికీ మరియూ ఇంకా పెళ్ళి కాకుండా సహ జీవనం చేస్తున్న వారికీ పుట్టినవారు.అంటే ఈ ప్రపంచంలో పెళ్ళికి ముందే శృంగారం జరిపే వారి సంఖ్య ఎక్కువవుతోందని చెప్పవచ్చు.

48,000,000 ఫోను కాల్స్ చేయబడతాయి
ఈ సంఖ్య ఎంత పెద్దగా ఉందో కదా.ఈ లెక్కన రోజులో ఎన్ని ఫోను కాల్సు నమోదవుతాయో కదా. ఈ ఫోను కాల్స్అన్నీ వ్యక్తిగతమైనవి లేదా వ్యాపార లావాదేవీలకి సంబంధించిన్వి కావచ్చు.

అమెరికాలో 3 అతి కౄరమైన నేరాలు జరుగుతాయి.
అంటే ఈ లెక్కన ప్రతీ రోజూ 180 అతి కౄరమైన నేరాలు అమెరికాలో జరుగుతాయన్నమాట.మీరు కనుక ఈ నేరాలా బాధితులయితే మీరు దురదృష్టవంతులనై చెప్పవచ్చు.ఈ లెక్కన ప్రతీ రోజూ ప్రపంచంలో ఎన్ని నేరాలు జరుగుతాయో ఊహించుకోండి.ప్రపంచంలో రోజూ జరిగే నేరాలా సంఖ్య ఖచ్చితంగా చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటాయని చెప్పవచ్చు. ఇవండీ ఒక నిమిషంలో మీ చుట్టూ జరిగే షాకింగ్ సంఘటనలు.ఈ సమాచారం చదివి మీకు ఆశ్చర్యం అనిపించట్లేదూ??



Click it and Unblock the Notifications











