Latest Updates
-
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
క్లీన్ షేవ్ అబ్బాయిలంటే అమ్మాయిలకు ఎందుకంత క్రేజ్ ?
గడ్డం పెంచుకోవడం ఇప్పుడొక ట్రెండ్. అబ్బాయిలు గడ్డం పెంచుకోవడానికి చాలా ఇష్టపడతారు. అది కూడా రకరకాల స్టైల్స్ ఫాలో అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో సినిమాల్లో ట్రెండ్స్ ఫాలో అవుతూ.. కొత్త కొత్త స్టైల్స్ లో గడ్డం పెంచేసి.. ఎదుటివాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.
అయితే గడ్డం పెంచుకునే స్టైల్ కొంతమందికి సెట్ అవుతుంది. మరికొంతమందికి సెట్ కాకపోవచ్చు. అయితే వాళ్ల పర్సనాలిటీ, గడ్డం పెంచే స్టైల్ ని బట్టి ఎట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అలాగే చాలా మంది అబ్బాయిలు గడ్డం పెంచడం వల్ల సీరియస్ గా, ఇంటెలిజెంట్స్ గా కనిపిస్తామని భావిస్తారు.
కానీ తాజా అధ్యయనాలు చాలా ఆసక్తికర విషయం బయటపెట్టాయి. గడ్డం పెంచుకున్న అబ్బాయిల కంటే.. క్లీన్ షేవ్ చేసుకున్న మగవాళ్లనే అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు అమ్మాయిలు క్లీన్ షేవ్ అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడతారో తెలుసుకోవాలనుందా ?
అయితే ఈ ఆర్టికల్ చదివేయండి..

ముద్దు
ముద్దు పెట్టుకునేటప్పుడు.. మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గడ్డం పెంచుకోవడం వల్ల అది గుచ్చుకుంటుంది కాబట్టి.. క్లీన్ షేవ్ ఇష్టపడతారు.

ఎట్రాక్షన్
పెరిగిన గడ్డం అందరికీ సూట్ అవదు. నీట్ గా షేవ్ చేసుకుంటే.. ప్రతి ఒక్క అబ్బాయి చాలా స్మార్ట్ గా కనిపిస్తాడు. అమ్మాయిలను ఇట్టే ఆకట్టుకోవచ్చు.

బాధ్యత
క్లీన్ గా షేవ్ చేసుకున్న అబ్బాయిలు చాలా ఎట్రాక్టివ్ గా, రెస్పాన్సిబుల్ గా, నమ్మకస్తులుగా ఉంటారని చాలామంది అమ్మాయిలు భావిస్తారట. అందుకే క్లీన్ షేవ్ చేసుకుని అమ్మాయిల మనసు గెలుచుకోండి.

యంగ్ లుక్
గడ్డం పెంచుకున్నప్పటి కంటే.. క్లీన్ గా షేవ్ చేసుకున్నప్పుడే అబ్బాయిలు మరింత యంగ్ గా కనిపిస్తారట. అందుకే అమ్మాయిలు క్లీన్ షేవ్ అబ్బాయిలకు ఎట్రాక్ట్ అయిపోతారు.

ఎలాంటి డ్రెస్ కైనా
గడ్డం లేకుండా.. నీట్ గా షేవ్ చేసుకున్నప్పుడు.. సూట్, ఫార్మల్ ఎలాంటి డ్రెస్సింగ్ కైనా చాలా బాగా సెట్ అవుతుంది. అంతేకాదు.. క్లీన్ షేవ్ అతనిలోని కాన్ఫిడెన్స్ ని తెలుపుతుందట.

దూకుడు స్వభావం
గడ్డం పెంచుకున్న వ్యక్తి.. చాలా దూకుడుగా వ్యవహరిస్తారన్న భావన కలిగిస్తారట. అందుకే అమ్మాయిలు గడ్డం పెరిగిన అబ్బాయిలను ఇష్టపడరట. అంతేకాదు క్లీన్ గా షేవ్ చేసుకున్న వ్యక్తి స్వభావం చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటుందట.

కాన్ఫిడెన్స్
క్లీన్ గా షేవ్ చేసుకున్న అబ్బాయిలకు వాళ్ల అందం గురించి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుందట. అందుకే వాళ్లు మరింత ఆకట్టుకోవడానికి గడ్డం, మీసాలపై ఆధారపడకుండా ఉంటారట.

సెక్సీ లుక్
క్లీన్ షేవ్ చేసుకున్న అబ్బాయిల ఫేస్ చాలా సెక్సీ లుక్ తీసుకొస్తుందని చాలా మంది అమ్మాయిలు.. స్టడీస్ లో వివరించారట. అందుకే క్లీన్ షేవ్ అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారట.

లేజీ
గడ్డం పెంచుకున్న అబ్బాయిలను లేజీగా ఫీలవుతారట. తనను తాను ఎట్రాక్టివ్ కనిపించడానికి షేవ్ చేసుకోవడం లేదంటే.. అతను లేజీగా ఉన్నడని భావిస్తారు.



Click it and Unblock the Notifications
