For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చేతిలోని ఈ అదృష్ట రేఖను బట్టి మీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది..?

|

సాధారణంగా మేము ఏదైనా పని జరగనప్పుడు మరియు ఏదైనా అవకాశం చేజారినప్పుడు విధిని నిందిస్తూ ఉండటం సహజం. దీనికి గల కారణం తెలుసుకుంటే బాగుంటుంది కదా. మా జీవితంలో విధి రేఖ ముఖమైన పోకడలను చాటుతుంది.

హస్తసాముద్రికం అనేది ఒక వ్యక్తిపై రేఖల ఆధారంగా ఏడు రకాలుగా ప్రభావాలను కలిగి ఉంటుంది. వీటి ప్రభావాలను బట్టి, మనిషి వర్తమానం, భవిష్యత్తు అంచాన వేస్తుంటారు. కాబట్టి, అరచేతిలో ఫేట్ లైన్ బట్టి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

Destiny through Fate Line
డీప్ విధి రేఖ

డీప్ విధి రేఖ

అరచేతిలో విధి రేఖ డీప్ గా ఉంటే అతను లేదా ఆమెకు తండ్రివైపు సంపద మరియు వివిధ మార్గాల నుండి ఇతర లాభాలను సాధించే అవకాశం ఉంటుంది. అంతేకాక పెద్దవారు వ్యక్తిగతంగా సక్సెస్ ని సాధిస్తారు.

లైట్ విధి రేఖ

లైట్ విధి రేఖ

అరచేతిలో విధి రేఖ లైట్ గా ఉంటే అతను లేదా ఆమె జీవితంలో వైఫల్యాలు మరియు ఇబ్బందులు కలగవచ్చు. దాంతో అతను లేదా ఆమె తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోతారు. కానీ చేతిలోని ఒక బలమైన సూర్య రేఖ అతనికి విజయాన్ని అందిస్తుంది. ఇతర లైన్లు మరియు మౌంట్స్ మార్గం మరియు ఉనికిని ఫలితాలను సవరించవచ్చు.

MOST READ: అనేక జుట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారం మన ఇంటి వైద్యం

 విభజించిన విధి రేఖ

విభజించిన విధి రేఖ

హస్తసాముద్రికం ప్రకారం విధి రేఖ రెండు భాగాలుగా విడిపోయి అరచేతి లో 'y' ఆకారంలో నిర్మాణాన్ని సృష్టిస్తే, అప్పుడు ఆ వ్యక్తి గందరగోళం మరియు వైరుధ్యంతో బాధపడుతున్నారని సూచిస్తుంది. ఈ రేఖల కారణంగా ఒక బలమైన నిర్ణయం తీసుకున్న సరే నిలదొక్కుకోవడం కష్టం అవుతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే అతను ఒక సమయంలో రెండు పడవల స్వారీ చేయవచ్చు.

జిగ్ జాగ్ విధి రేఖ

జిగ్ జాగ్ విధి రేఖ

జిగ్ జాగ్ విధి రేఖ ఉంటే ఆమె లేదా అతని జీవితంలో హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉంటాయి. ఆమె జీవితంలో సమస్యలు మరియు విభేదాలను ఓడించి విజయాన్ని సాధిస్తుంది. అయితే అది అంత సులభంగా రాదు. ఈ రకమైన విధి రేఖ కీలకమైన నిర్ణయాల సమయంలో సంకోచితం అవుతుంది.

బ్రేక్ అయిన విధి రేఖ

బ్రేక్ అయిన విధి రేఖ

అరచేతిలో పగిలిన విధి రేఖ ఉంటే అది అపాయాన్ని సూచిస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో ప్రమాదం జరుగుతుందని అర్ధం. ప్రమాదంలో భౌతిక హాని కలిగించవచ్చు లేదా ప్రమాదంలో ఎక్కువ హాని కలగవచ్చు. అందువల్ల ఈ రేఖ కలిగిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

గొలుసులు విధి రేఖ

గొలుసులు విధి రేఖ

అరచేతిలో విధి రేఖ గొలుసులుగా ఉంటే అతడు లేదా ఆమె జీవితంలో అనేక హెచ్చుతగ్గులను ఎదుర్కోవచ్చు. అతను వైఫల్యం మరియు విజయం మధ్య ఊగిసలాడుతూ ఉండవచ్చు. అతను విజయవంతంగా ఒక పని చేయవచ్చు. అయితే కొన్నిసార్లు ఒక సాధారణ పని చేయడం కొరకు కూడా అపరిమితమైన సమస్యలను ఎదుర్కోవచ్చు.

MOST READ: ట్రీట్మెంట్స్ , థెరఫీలతో నయం కానీ బ్యాక్ పెయిన్ ఈ ఆహారాలతో బై బై చెప్పవచ్చు...

విధి రేఖ కనపడకపోతే

విధి రేఖ కనపడకపోతే

హస్తసాముద్రికం ప్రకారం విధి రేఖ కన్పించవచ్చు లేదా కన్పించకపోవచ్చు. విధి రేఖ లేనివారు వేరే రేఖల ఆధారంగా భవిష్యత్ ను తెలుసుకోవచ్చు. కాబట్టి విధి రేఖ లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

లోతైన బలమైన విధి రేఖ ఉంటే

లోతైన బలమైన విధి రేఖ ఉంటే

లోతైన బలమైన విధి రేఖ ఉంటే వారి జీవితం క్రమశిక్షణతో కూడి ఉంటుంది. మరోవైపు, బలహీనమైన లేదా పేలవమైన విధి రేఖ ఉంటే విరామం లేకుండా తరచూ ఉద్యోగాలు మార్పును సూచిస్తుంది.

భవిష్యత్తు ప్రణాళికను వర్ణిస్తుంది

భవిష్యత్తు ప్రణాళికను వర్ణిస్తుంది

అరచేతిలో ఈ రేఖలు చాలా చిన్న వయస్సులోనే ప్రారంభం అయ్యి వారి భవిష్యత్తు ప్రణాళికను వర్ణిస్తుంది. విధి రేఖ అమాంతం శిరస్సు రేఖ వద్ద ముగిస్తే, ఏదో ఒక విధంగా 30 నుండి 40 ఏళ్ళ మధ్యలో తన లక్ష్యాలకు దూరంగా వెళ్లడాన్ని సూచిస్తుంది.

రుదుగా మధ్య వేలు అన్ని మార్గాల్లో విస్తరించి ఉన్న విధి రేఖ

రుదుగా మధ్య వేలు అన్ని మార్గాల్లో విస్తరించి ఉన్న విధి రేఖ

చాలా మందిలో, మీరు విధి రేఖ హృదయ రేఖకు వెనుకంజలో ఉండటాన్ని చూసి ఉంటారు. చాలా అరుదుగా మధ్య వేలు అన్ని మార్గాల్లో విస్తరించి ఉన్న విధి రేఖతో ఉన్న వారిని చూడవచ్చును.ఇటువంటి వారు వృద్ధాప్యంలో చాలా చురుకుగా ఉంటారు.

English summary

Destiny through Fate Line

We often blame our fate saying that ‘it was not meant for me’ when we lose an opportunity. What if we could find out what our fate holds? The fate line can reveal what will be the important trends in our life.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more