For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశిని బట్టి మీరు ఏ విషయంలో ధైర్యంగా ఉండాలి ?

ఎట్టిపరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకూడదు. మన చెంత ధైర్యం ఉన్నప్పుడే.. మనం లైఫ్ లో సక్సెస్ అవుతాం, అనుకున్నది సాధించగలుగుతాం.

By Swathi
|

సాహసం శ్వాసగా సాగిపో.. ధైర్యే సాహసే లక్ష్మిః అన్న మాటలు.. మన పెద్దవాళ్లు చెప్పినా.. మనకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి. కాబట్టి ఏ విషయంలోనైనా మంచి గ్రహించాలి, చెడు దగ్గరకు రానీయకూడదు. మనకు తెలిసిన మంచిని నలుగురికి తెలియజేయాలి. అన్యాయం జరుగుతుంటే ధైర్యంగా చెప్పాలి. ధైర్యంగా ఉండటం అనేది.. నిజంగా ప్రతిఒక్కరిలో ప్రత్యేకమైన విషయం.

how to be daring

ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ డబ్బు కన్నా ధైర్యం ఎక్కువగా ఉండాలి. సమాజంలో ఎదురయ్యే సమస్యల నుంచి తప్పించుకోవాలంటే, ఎదురుదెబ్బలను తిప్పికొట్టాలంటే ధైర్యం ఉండాలి. భర్తను కోల్పోయిన భార్య, ప్రమాదాలలో సర్వస్వం కోల్పోయిన వాళ్లు, శారీరక అంగవైకల్యం కలిగిన వాళ్లు.. ఎట్టిపరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకూడదు. మన చెంత ధైర్యం ఉన్నప్పుడే.. మనం లైఫ్ లో సక్సెస్ అవుతాం, అనుకున్నది సాధించగలుగుతాం.

మనం ధైర్యంగా, సాహసం చేయగలిగే సత్తా కలిగి ఉన్నప్పుడే.. ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతాం. అలాగే.. ఎలాంటి సమస్య వచ్చినా.. తట్టుకునే గుండె నిబ్బరం ఉంటుంది. అయితే.. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికే ఒకేలా ధైర్యం ఉండాలని లేదు. ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా, ఒక్కో విషయంలో ధైర్యం, సాహసం ఉంటాయి. మరి మీ రాశిని బట్టి మీరు ఏ విషయంలో ధైర్యవంతులు, ఏ విషయంలో ధైర్యం చేయాలో జ్యోతిష్యం వివరిస్తోంది.

మేషరాశి

మేషరాశి

మేషరాశి వాళ్లు న్యాచురల్ గానే చాలా సాహసవంతులు, చాలా ధైర్యవంతులు. సాహసం చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఎలా నేర్చుకోవాలి, ఎలా ఓర్పుతో ఉండాలి, ఎలా సున్నితంగా ఉండాలి అనేది కాస్త ధైర్యంతో కూడినవి. కానీ.. ఇవన్నీ మీకు చాలా తేలికైన విషయాలు.

వృషభ రాశి

వృషభ రాశి

అందమైన వాటిని ఇష్టపడతారు. స్థిరంగా ఉండానికి అనుకూలంగా భావిస్తారు. ధైర్యంగా ఉండటమనేది.. మీకు కాస్త అసౌకర్యంగా ఉంటుందని భావిస్తారు. జీవితంలో సందేహకరమైన అంశాలతో ఉండటం అనేది.. మీలో ధైర్యంతో కూడినవి. జీవితంలో తీవ్రమైన భావాలు లేదా పరిస్థితులు మీకు ధైర్యంగా ఉండాలని నేర్పిస్తాయి.

మిథున రాశి

మిథున రాశి

మిథునరాశి వాళ్లు చాలా సాహసవంతులు. మీరు ధైర్యంగా ఉండటానికి.. వ్యూహంతో ఏకాగ్రతగా ఉండటం, శ్రద్ధ పెట్టి.. మీకు కావాల్సిన సాధించుకుంటారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి

కర్కాటక రాశివాళ్లు చాలా ఎమోషనల్ గా, సెన్సిటివ్ గా ఉంటారు. ధైర్యంగా ఉండటం అనేది మీకు చాలా కష్టం. అయితే.. మీరు ఈ ప్రపంచంలో ఎలా నడుచుకోవాలి అనేది తెలుస్తుంది. ఏదైనా చేయాలి అనేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చేయాలనుకున్న చేస్తే.. మీ ఫీలింగ్ లో మార్పు వస్తుంది.

సింహరాశి

సింహరాశి

సింహరాశి వాళ్లు చాలా పూజ్యనీయమైనవాళ్లు. ప్రేమిస్తారు. అలాగే కొన్నిసార్లు హైడ్రామా చేస్తారు. మీరు ప్రత్యేక ఆకర్షణగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు ధైర్యంగా, సాహసం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించాలి అనేది నేర్చుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు ఇతరులపై ఆధారపడకూడదు అనేది, అంతర్గత అంగీకారం గురించి నేర్చుకోవాలి. ఈ విషయంలో.. మీరు ధైర్యం చేయాలి.

కన్యారాశి

కన్యారాశి

మీరు మెస్ ఏర్పాటు చేయాలి అనుకుంటారు. కానీ.. మీకు ప్రతీది చాలా ఆర్గనైజ్డ్ గా, చాలా పర్ఫెక్ట్ గా, క్యాటగిరైజ్డ్ గా ఉండాలనుకుంటారు. కానీ మీ లోపాల కారణంగా.. మెస్ అనేది మీకు సాహసంతో కూడినది. అలాగే కొన్నిసార్లు బాధ్యతారహితంగా ఉండటం అనేది మీకు సాహసం లాంటిది.

తులారాశి

తులారాశి

ఒకవేళ మీరు తప్పు నిర్ణయం తీసుకున్నా.. దాని నుంచి మీరు చాలా నేర్చుకుంటారు. కాబట్టి.. ఏదైనా చేయడానికి ధైర్యం చేయండి. దానికి పూర్తీగా కమిట్ అవండి. రెండు విషయాలు, రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడానికి అప్పుడప్పుడు ఇబ్బందిపడతారు. ఏదో ఒకటి తీసుకుని.. దాంతో వెళ్లండి. సరైన నిర్ణయం తీసుకుంటానో లేదో అన్న భయం అవసరం లేదు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివాళ్లకు ధైర్యంగా ఉండటానికి ప్రోత్సహం అవసరం లేదు. మీరు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. మీ జీవితంలో బ్రైట్ సైడ్ ని చూడటానికి సాహసం చేస్తారు. ఒకదానికోసం డేర్ చేయరు.. కొంచెం ఫన్ ఉండేలా జాగ్రత్తపడతారు.

ధనస్సు రాశి

ధనస్సు రాశి

ఏ దారి ఆసక్తికరంగా ఉంటే.. అటువైపు వెళ్తారు ధనస్సు రాశివాళ్లు. మీరు చాలా సాహసవంతులు, చాలా సందర్భాల్లో పొరపాట్లు చేస్తారు. ఏ విషయానికి నో చెప్పాలి అనేది మీరు నేర్చుకోవాలి. ప్రతిదానికి పోరాడటం కంటే.. ఎలా కట్ చేయాలి అనేది నేర్చుకోవాలి.

మరక రాశి

మరక రాశి

మకరరాశి వాళ్లు.. ఎక్కడైనా సక్సెస్ అవుతారు. ఎలాంటి శిఖరాన్నై అధిరోహించి.. బంగారు పథకాలు సాధిస్తారు. అయితే కొన్ని మీ సొంత నియమాలు కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి దానిపై సాహసం చేయాలి. సంప్రదాయబద్ధంగా ఉండటం మీకు నిజంగా బావుంటుంది. ట్రెడిషనల్ ఉంటే.. ఇతరులు బావుంటుందని చెప్తారని కాదు.. మీకు అలానే నచ్చుతుందని సంప్రదాయబద్దంగా ఉంటారు.

 కుంభరాశి

కుంభరాశి

కొన్నిసార్లు మిమ్మల్ని మీరే ఓడించుకుంటారు. మీరు చాలా తెలివైన, మేధో సంపత్తి కలిగినవాళ్లు. మీ ఫీలింగ్స్ వల్ల మీరు సాహసం చేయలేకపోతారు. తప్రతి సారి.. ఫీలింగ్స్ లో అర్థం ఉండదు. కాబట్టి.. ఒకసారి ఫీలింగ్స్ ని పక్కనపెట్టి.. ధైర్యం చేయాలి.

మీనరాశి

మీనరాశి

మీనరాశి వాళ్లు వివరాలతో ఉండటానికి డేర్ చేయాలి. పనిచేయాలి, ప్రాక్టీస్ చేయాలి. వ్యవస్థీకృతమై ఉండటానికి సాహసం చేయాలి.

English summary

How to Be Daring Based on Your Zodiac Sign

How to Be Daring Based on Your Zodiac Sign. To know more about read on..
Desktop Bottom Promotion