For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ రాత్రి నిద్రలో ఒకే సమయానికి మెలకువ వస్తే దేనికి సంకేతం ?

By Swathi
|

బాగా గాఢ నిద్రలో ఉండగా ఉక్కసారిగా మెలకువ వస్తోందా ? అది కూడా అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున నిద్రలో మెలకువ వస్తోందా ? ఆ సమయంలో టైం చూస్తున్నారా ? అది కూడా ప్రతి రోజూ ఒకే సమయంలో మెలకువ వస్తోందా ? సరిగ్గా గమనించారా ? ఒకే సమయంలో మెలకువ రావడం ఏంటా అని వండర్ అవుతున్నారా ? నిజమే మీకు ఒకే సమయానికి మెలకువ వస్తోందంటే.. వండరే..!!

మీరు నిద్రపోయే భంగిమ మీ ప్రవర్తనను డిసైడ్ చేస్తుందా ?

మన శరీరం కొన్ని సంకేతాలను తన దారిలో ఇస్తుంది. అవి ఏమిటి, ఎందుకు, ఎలా అని గ్రహించడం కూడా కష్టమే అవుతుంది. ఒకే సమయంలో నిద్ర నుంచి మెలకువ రావడం అనేది యాధృచ్చికంగా జరిగే ప్రక్రియ. మీ ఎనర్జీ బ్లాక్ అయిందని తెలిపే సంకేతం అయి ఉండవచ్చు. మీ శరీరంలోని అవయవాలు యాక్టివ్ గా పనిచేస్తున్నాయనే సంకేతం కావచ్చు.

చెడు కలలు ఎందుకు వస్తాయి ? చెడు జరగబోతుందని సంకేతమా ?

శరీరంలో జరిగే మార్పులు, అవయవాల పనితీరు.. మనకు నిద్రలో మెలకువ రావడానికి కారణమవుతుందా ? అసలు, నిద్రభంగానికి, అవయవాల పనితీరుకి సంబంధమేంటి ? మెలకువ వచ్చే సమయాన్ని బట్టి.. అసలు వాస్తవం తెలుసుకోవచ్చా ? మరి ఏ సమయంలో మెలకువ వస్తే దేనికి సంకేతమో ఇప్పుడే తెలుసుకోండి.. మీ ప్రశ్నకు సమాధానం వెతుక్కోండి..

రాత్రి 9 నుంచి 11 గంటల మధ్యలో

రాత్రి 9 నుంచి 11 గంటల మధ్యలో

రాత్రి 9 నుంచి 11 గంటల మధ్యలో చాలామంది నిద్ర మొదలుపెట్టే సమయం. అంటే.. ఇంకా అప్పుడప్పుడే బెడ్ పై వాలి ఉంటారు. అయితే కొంతమంది తొమ్మిదికే నిద్రపోవచ్చు. అలాంటప్పుడు 11లోపు మెలకువ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఈ సమయంలో మెలకువ వస్తే.. మీ మెదడు ఎక్కువగా ఆలోచిస్తోందని తెలుపుతుంది.

11 గంటల నుంచి 1 గంట మధ్యలో

11 గంటల నుంచి 1 గంట మధ్యలో

సాధారణంగా రాత్రి 11 గంటల నుంచి 1 గంటల మధ్యలో గాల్ బ్లాడర్ శరీరంలోని ఫ్యాట్స్ ని కరిగిస్తుంది. ఈ సమయంలో మీకు నిద్రకు ఇబ్బందిగా మారిందంటే.. మానసిక ఒత్తిడి కారణం అయి ఉండవచ్చు.

కారణం

కారణం

ఎక్కువగా అన్ హెల్తీ ఫ్యాట్స్, ఆయిల్స్ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా రాత్రి 11 నుంచి 1 గంట మధ్యలో మెలకువ రావడానికి కారణమవుతుంది.

1 గంట నుంచి 3 గంటల మధ్యలో

1 గంట నుంచి 3 గంటల మధ్యలో

ఈ సమయంలో లివర్ చాలా కష్టపడుతుంది. శరీరంలోని మలినాలను విడుదల చేసి.. ఫ్రెష్ బ్లడ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో మెలకువ వచ్చిందంటే.. మీ అటెన్షన్ ని లివర్ కోరుకుంటోందని అర్ధం.

కారణం

కారణం

ఒకవేళ మీరు లేట్ నైట్ లో ఆల్కహాల్ సేవించారని తెలపడానికి కూడా ఇదో సంకేతమని గుర్తించండి.

3 గంటల నుంచి 5 గంటల మధ్యలో

3 గంటల నుంచి 5 గంటల మధ్యలో

ఈ సమయంలో మీకు మెలకువ వస్తోందంటే శ్వాస సమస్యగా ఉన్నట్టు గుర్తించాలి. ఎందుకంటే.. ఈ సమయంలో ఊపిరితిత్తులు ఆక్సిజన్ పొందడానికి ప్రయత్నిస్తుంటాయి.

ఎక్సర్ సైజ్

ఎక్సర్ సైజ్

3 నుంచి 5 గంటల మధ్య పదేపదే నిద్రకు ఆటంకం ఏర్పడుతూ ఉంటే.. బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేయాలి. శ్వాస సరిగా అందేలా జాగ్రత్త పడాలి. అప్పుడు మీరు మళ్లీ నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది.

5 గంట నుంచి 7 గంటల మధ్యలో

5 గంట నుంచి 7 గంటల మధ్యలో

శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపే సమయం ఇది. మీ శరీరాన్నంతటినీ క్లియర్ చేసే సమయం. కాబట్టి.. హెల్తీ మైండ్ తో రోజుని ప్రారంభించడానికి రెడీ అయిపోండి. అలాగే ఈ సమయంలో మీ శరీరంలోని పెద్ద అవయవం పేగులు పనిచేస్తాయి. కాబట్టి అదే సమయంలో నిద్రలేవడం చాలా మంచిది.

అనారోగ్య సమస్యలు

అనారోగ్య సమస్యలు

లేటుగా నిద్రలేస్తే.. తాజాదనాన్ని కోల్పోయి, అలసిపోయినట్టు ఉంటారు. అసమతుల్య ఆహారం తీసుకుంటారు. అలాగే లేటుగా ఆహారం తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

English summary

If You Wake Up Every Night At The Same Time And Wonder Why It Happens

If You Wake Up Every Night At The Same Time And Wonder Why It Happens. The body gives out signs in its own ways which need to be interpreted well.
Story first published:Wednesday, June 1, 2016, 11:49 [IST]
Desktop Bottom Promotion