75th Independence Day:స్వాతంత్రం కోసం పోరాడిన.. యంగ్ అండ్ డైనమిక్ హీరోస్..!

స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యంగెస్ట్ ఫ్రీడం ఫైటర్స్..

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ...

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది. 1947 ఇండియాకు స్వాతంత్రం వచ్చింది.మన ఇండియకు స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతో మంది మహామహనీయులు పోరాటం చేశారు. భారదేశానికి స్వాతంత్యం రాకముందు ఎందరో మన దేశాన్ని పాలించారు. పర్శియన్స్, ఇరానీస్, మంగోళీయులు మరియు ముఘాలాయిలు వివిధ గ్రూపులుగా భారదేశాన్ని శాసించి ఏలినవారే.

చివరకు బ్రిటీష్ పాలనలో మన భారదేశం అట్టడుకింది.ఈ బ్రిటీష్ పాలనలో దాదాపు 200సంవత్సరాలు మన భారతదేశం అనగారిపోయింది. చివరికీ వారి అన్యాయాన్ని అరచకాలను అరికట్టడానికి , భారదేశ స్వాతంత్రం పొందడానికి కొంత మంది నాయకులు ముందుకు వచ్చారు.1857లో ది ఇండియన్ రెబిలియన్ గ్రూప్ తో ఇడియన్ ఫ్రీడమ్ ఫైట్ తో ప్రారంభించారు. అప్పటి నుండి భారతదేశానికి స్వాతంత్రం పొందడానికి 90సంవత్సరాలు పట్టింది. .

భారతదేశం స్వాతంత్రం పొందడానికి కొన్ని వేల సంఖ్యలో స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు. వీరిలో చాలా మంది చాలా చిన్న వయస్సులో పాల్గొన్నారు. వారిలో కొంత మంది చిన్న వయస్సులోనే స్వాతంత్రం కోసం పోరటాం చేసి చిర స్మరనీయులుగా నిలిచిపోయారు. అలాంటి వారి మీరు కూడా తెలుసుకోవాలిగా...

భగత్ సింగ్ :

భగత్ సింగ్ :

భగత్ సింగ్, స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు.భారత స్వాతంత్ర్యోద్యమము లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే 'షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు'. చరిత్రకారుడు కె.ఎన్. పణిక్కర్ ప్రకారం భగత్ సింగ్, భారతదేశంలో ఆరంభ మార్కిస్టు. భగత్ సింగ్ హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఒకడు. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్‌లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు. యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం మరియు సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు.

Image curtesy

శివరామ్ రాజ్ గురు:

శివరామ్ రాజ్ గురు:

హరి శివరాం రాజ్ గురు (ఆగష్టు 24, 1908 - మార్చి 23, 1931) భారత స్వాతంత్ర ఉద్యమ, ఉద్యమకారుడు. మహారాష్ట్ర లోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతను భగత్ సింగ్ మరియు సుఖ్ దేవ్ ల సహచరునిగా ప్రసిధ్ధి. ఇతర లాహోర్ కాన్సిప్పిరెన్సీ కేస్, సెంట్రల్ అంసెబ్లీ బాంబ్ బ్లాస్ట్ వివిధ విషయాల్లో బాగా పాపులర్ అయ్యాడు. 1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందులకు గాను భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన ఈ ముగ్గురు విప్లవకారులు (భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్) లను 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో సాయంకాలం 7.33 సమయానికి ఉరి తీశారు.Image curtesy http://www.worldblaze.in/

చంద్రశేఖర్ ఆజాద్:

చంద్రశేఖర్ ఆజాద్:

ఇండియాకు స్వాతంత్ర పొందడానికి పోరాటం చేసిన వారిలో చంద్రశేఖర్ అజాద్ ఒకరు. చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) జూలై 23, 1906 బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్ లో జన్మించారు . ఈయన భారతీయ ఉద్యమకారుడు,స్వాతంత్య్ర సమర యోధుడు - చంద్రశేఖర్‌ అజాద్. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు...చంద్రశేఖర్ అజాద్.కా.షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, త్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన కా.చంద్రశేఖర్ అజాద్.Image curtesy

సుఖ్ దేవ్:

సుఖ్ దేవ్:

సుఖ్ దేవ్ థాపర్ (15 మే 1907 - మార్చి 23, 1931) భారత స్వాతంత్ర్య సమర, ఉద్యమకారుడు. ఇతను భగత్ సింగ్ మరియు రాజ్‌గురు ల సహచరునిగా ప్రసిధ్ధి. 1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం పై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి "జె.పి. సాండర్స్" ను హతమార్చినందులకు గాను మార్చి 23 1931 న ఉరితీయబడ్డాడు.Image curtesy

 కుదిరమ్ బోస్.:

కుదిరమ్ బోస్.:

మరో యంగెస్ట్ ఫ్రీరడం ఫైటర్ కుదిరమ్ బోస్. ప్రభుత్వం అనుసరించిన దమననీతికి వ్యతిరేకంగా బ్రిటిష్ అధికారులను హత్యచేయడానికి కొందరు యువకులు రమష్యసంఘాలుగా ఏర్పడ్డారు. భూపేంద్రానథ్ దత్, వి.డి సావర్కర్, ఖుదీరామ్ బోస్ మొదలైనవారు వీరిలో ప్రముఖులు. ప్రభుత్వం ఖుదీరామ్ బోస్ కు కింగ్స్ ఫోర్డ్ పై హాత్యాప్రయత్నం చేసినందుకు మరణ శిక్ష విధించింది. ఈ ఉద్యమం బ్రిటిష్ అధికారులను భయభ్రాంతులను చేసింది. Image curtesy

సుభాష్ చంద్రబోస్:

సుభాష్ చంద్రబోస్:

ప్రభావతి, జనకీనాథ్‌ బోస్‌ దంపతులకు తేదీ 24-01-1897వ సంవత్సరంలో ఒరిస్సాలో ని కట్‌ లో జన్మించాడు నేతాజీ సుభాష్‌ చం ద్రబోస్‌ 1920 లండన్‌లో ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. చిత్తరంజన్‌ దాస్‌ ఈయనకు మార్గదర్శి. స్వాతంత్య్రోద్య మంలో పాల్గొని 1921లో అరెస్టయ్యాడు. కాంగ్రెస్‌లో కొంతకాలం కొనసాగిన తరువాత ఫార్వర్డ్‌ బ్లాక్‌ అనే పార్టీని స్థాపించాడు. 1941 లో బ్రిటీష్‌ పోలీసుల కన్నుగప్పి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.Image curtesy http://www.worldblaze.in/

 ఝాన్సీ లక్ష్మీబాయి.

ఝాన్సీ లక్ష్మీబాయి.

మరాఠా రాణి ఝాన్సీ రాష్ట్రాన్ని పాలించింది, రాణి లక్ష్మీ బాయి భారత చరిత్రలో అత్యంత ప్రాచుర్యం మహిళా యోధులు ఒకటి. మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం లో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన లో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. మరియు భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డుకొన్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారత దేశం యొక్క "జాయన్ ఆఫ్ ఆర్క్" లాగా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.Image curtesy

అష్ఫాఖుల్లా ఖాన్:

అష్ఫాఖుల్లా ఖాన్:

అష్ఫాకుల్లా ఖాన్ (అక్టోబర్ 22, 1900 - డిసెంబర్ 19, 1927) భారతీయ స్వంతంత్ర సమరయోధుడు. నామాతృభూమిని ఆంగ్లేయుల శృంఖలాల నుంచి విముక్తం చేయాలనుకున్నా ను. నా త్యాగం వృ«థా కాదు. మరెందరో త్యాగధనులకు స్ఫూర్తినిస్తుంది. నా హిందూస్థాన్ స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది. చాలా త్వరగా బానిస సంకెళ్ళు తెగి పోతాయి. దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతున్నాను' అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడును ముద్డాడి మెడలో తానే వేసుకున్నాడు.

నా దేశ సోదరులారా! మీరు మొదట భారతీయులు. ఆ తర్వాతే వివిధ మతా లవారు. మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐక్యమత్యంతో ఆంగ్లేయుల ను ఎదిరించండి. దేశ విముక్తే మన లక్ష్యం కావా లి--అష్ఫాఖుల్లా ఖాన్ . భరతమాత స్వేచ్చ కోసం సర్దార్ భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల కంటే నాలుగు సంవత్స రాల ముందే ఉరిశిక్షపడిన దేశభక్తుడు అష్ఫాఖుల్లా ఖాన్.Image curtesy http://www.worldblaze.in/

మంగళ్ పాండే:

మంగళ్ పాండే:

మంగళ్ పాండే ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి. కోల్కతా దగ్గర బారక్ పూర్ వద్ద మార్చి 29, 1857, మధ్యాహ్నం, ల్యూటినెంట్ బాగ్ వద్ద, బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. ఇందుకు కారణం బ్రిటిషు వారు సిపాయిలకు ఆవు కొవ్వు మరియు పంది కొవ్వును పూసి తయారుచేసిన తూటాలు (cartridges) ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి. ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు . సుమారు రెండుశతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే. . అప్పటివరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలవొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే !Image curtesy http://www.worldblaze.in/

రామ్ ప్రసాద్ బిసిమిల్:

రామ్ ప్రసాద్ బిసిమిల్:

1925 ట్రైయిన్ లో దొంగతనం జరిగిన తర్వాత ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ గా పేరుపొందినాడు. రామ్ ప్రసాద్ బిసిమిల్ ఉత్తర్ ప్రదేశ్ లోని సహజాన్ పుర్ లో జన్మించారు . రామ్ ప్రసాద్ ఆర్య సమాజ్ లో చేరారు మరియు టాలెంటెండ్ రచయిత కూడా . తన 30 ఏళ్ళ వయస్సులో 19 డిసెంబర్ , 1927లో క్యాపిటల్ పనిష్ మెంట్ ఇచ్చారు. ఈయన రచనలు చాలా ఉద్వేగ పూరితంగా ఉంటాయి. భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులు ఝైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు, బిస్మిల్ రాసిన సర్ఫరోషి కి ఇతని పాటలు ఎంతో మానసిక ధైర్యాన్ని ఇచ్చింది.Image curtesy http://www.worldblaze.in/

Desktop Bottom Promotion