For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిగ్నేచర్ లో డాట్స్, లైన్స్ ఉంటే దేనికి సంకేతమో తెలుసా.. ??

By Swathi
|

సిగ్నేచర్, ఆటోగ్రాఫ్, సంతకం.. ఇలా రకరకాలుగా పిలుస్తాం. సెలబ్రెటీల సిగ్నేచర్ ని ఆటోగ్రాఫ్ అంటాం. అదే.. ఏదైనా ఆఫిషియల్ ఉపయోగించేటప్పుడు సిగ్నేచర్ లేదా తెలుగులో సంతకం అని పిలుస్తాం. ఈ సిగ్నేచర్ స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది.

మీ క్యారెక్టర్ కి, మీ బ్లడ్ టైప్ కి సంబంధమేంటి ?

కొంతమంది పూర్తీ పేరుని.. వివరంగా రాస్తారు. అదే సిగ్నేచర్ గా పెట్టే అలవాటు ఉంటుంది. మరికొందరి సిగ్నేచర్.. ఫస్ట్ లెటర్, చివరి లెటర్ మాత్రమే అర్థం అయ్యేలా ఉంటుంది. అలాగే కొంతమంది ఇంటి పేరుని హైలైట్ చేస్తే.. మరికొందరు.. వాళ్ల పేరుని హైలైట్ చేస్తూ సిగ్నేచర్ చేస్తారు.

అలాగే చాలా మంది సిగ్నేచర్ చేసేటప్పుడు గీతలు, చుక్కలు, కొన్ని రకాల వంపులతో.. వాళ్లకు నచ్చిన స్టైల్ ఫాలో అవుతుంటారు. కొంతమంది అయితే.. వాళ్ల పేరుని షార్ట్ గా మార్చేసి.. అంటే ఇంటిపేరులో సగం, తమ పేరులో సగం అక్షరాలను తీసుకుని కూడా సిగ్నేచర్ గా మార్చుకుంటారు.

చేతి గోళ్లను బట్టి పర్సనాలిటీ అంచనా వేయవచ్చా ?

ఇలా రకరకాల స్టైల్స్ లో చేసే సిగ్నేచర్ వాళ్ల వ్యక్తిత్వాన్ని అద్భుతంగా వివరిస్తుందట. సంతకం చేసేటప్పుడు వాళ్లు ఉపయోగించే.. వంపులు, గీతలు, చుక్కలు, అక్షరాలను బట్టి.. వాళ్ల స్వభావాన్ని అంచనా వేయవచ్చట. మరి మీ సిగ్నెచర్ మీ వ్యక్తిత్వాన్ని ఎలా వివరిస్తోందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా.. అయితే.. ఈ కింది స్లైడ్స్ క్లిక్ చేయండి..

చివర్లో లైన్ ఉంటే

చివర్లో లైన్ ఉంటే

సిగ్నేచర్ చేసేటప్పుడు చివర్లో లైన్ పెట్టే అలవాటు ఉన్నవాళ్లు.. చొరవ తీసుకునే స్వభావం కలిగి ఉంటారు. అలాగే చాలా సంకల్సం, నిర్ణయాత్మకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.

ఇంటిపేరు అస్పష్టంగా ఉంటే

ఇంటిపేరు అస్పష్టంగా ఉంటే

కొంతమంది సిగ్నేచర్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ ని క్లియర్ గా రాసి, ఇంటిపేరుని అస్పష్టంగా రాస్తారు. ఇలాంటి సిగ్నేచర్ స్టైల్ కలిగిన వాళ్లు.. వ్యక్తిగత విజయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే త్వరగా కలిసిపోయే తత్వం కలిగి ఉంటారు.

చుక్కలు లేకుండా

చుక్కలు లేకుండా

సిగ్నేచర్ లో ఎక్కడా డాట్స్ ( చుక్కలు ) లేకుండా.. ఊరికే పేరు రాసి వదిలేసే వాళ్లు.. పెద్ద పెద్ద వాటిపై ఫోకస్ చేస్తారు. చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు.

ఇన్షియల్స్

ఇన్షియల్స్

కేవలం ఇన్ఫియల్స్ తో సిగ్నేచర్ చేసే అలవాటు ఉన్నవాళ్లు.. వాళ్ల గురించి పెద్దగా ఇతరులతో పంచుకోరు. వాళ్లు చాలా ప్రైవేట్ వ్యక్తులు. ఉదాహరణకు మార్క్ జుకర్ బర్గ్ ఇలాంటి సిగ్నేచర్ స్టైల్ కలిగి ఉంటారు. అందుకే.. ఈయన స్థాపించిన ఫేస్ బుక్ ఇతని వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంది.

అస్పష్టమైన సిగ్నేచర్

అస్పష్టమైన సిగ్నేచర్

కొంతమంది సిగ్నేచర్ స్టైల్ చూస్తే.. వాళ్ల పేరు ఏమాత్రం అర్థం కాదు. ఇలాంటి సిగ్నేచర్ స్టైల్ కలిగిన వాళ్లు.. చాలా షార్ప్ గా, తెలివితేటలు కలిగి, బిజీ లైఫ్ స్టైల్ కలిగి ఉంటారు.

చాలా స్టైల్ గా ఉంటే

చాలా స్టైల్ గా ఉంటే

చాలా స్టైలిష్ గా సిగ్నేచర్ చేసేవాళ్లు సృజనాత్మ నైపుణ్యం కలిగి ఉంటారు.

ముద్దు పేరుతో సిగ్నేచర్

ముద్దు పేరుతో సిగ్నేచర్

ముద్దు పేరుతో సంతకం చేసేవాళ్లు.. స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి.

పెద్ద పెద్ద అక్షరాలతో

పెద్ద పెద్ద అక్షరాలతో

పెద్ద పెద్ద అక్షరాలతో సిగ్నేచర్ చేసేవాళ్లు.. బహిర్ముఖ స్వభావం కలిగి ఉంటారు. చాలా కాన్ఫిడెన్స్ కలిగి ఉంటారు.

క్యాపిటల్ లెటర్స్ ని పెద్దగా రాస్తే

క్యాపిటల్ లెటర్స్ ని పెద్దగా రాస్తే

క్యాపిటల్ లెటర్స్ ని ఉపయోగిస్తూ.. పెద్ద పెద్దగా సిగ్నేచర్ చేసేవాళ్లు.. చాలా కాన్ఫిడెన్స్ తో పాటు, స్ట్రాంగ్ సెన్స్ కలిగి ఉంటారు. చాలా ఆత్మగౌరవం కలిగి ఉంటారు. ఉదాహరణకు బరాక్ ఒబామా ఈ స్టైల్లోనే సిగ్నేచర్ చేస్తారు.

ఇంటిపేరు లేకుండా

ఇంటిపేరు లేకుండా

ఇంటిపేరు ఉపయోగించకుండా.. కొంతమంది సిగ్నేచర్ చేస్తుంటారు. ఇలాంటి సిగ్నేచర్ స్టైల్ కలిగిన వాళ్లు.. బిజినెస్ లో రాణిస్తారు. అంటే.. వారసత్వంగా వ్యాపార రంగాలు పొంది.. రిలాక్స్ అవుతారన్నమాట.

కింది నుంచి పైకి ఉంటే

కింది నుంచి పైకి ఉంటే

కొంతమంది సిగ్నేచర్ ని కింద మొదలుపెట్టి.. కాస్త వంపుగా పైకి టర్న్ చేస్తారు. ఇలాంటి సిగ్నేచర్ స్టైల్ కలిగిన వాళ్లు.. ఆశావాదంపై బలమైన అభిప్రాయం కలిగి ఉంటారు.

కింది వైపుగా

కింది వైపుగా

కొంతమంది సిగ్నేచర్ చేసేటప్పుడు.. కింది వైపుగా రాస్తారు. అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి చూస్తే.. అది.. కిందకు వాలినట్టు ఉంటుంది. ఇలాంటి సిగ్నేచర్ చేసేవాళ్లు.. మీటింగ్స్ లో హెచ్చరికలు ఉంటాయి. కాబట్టి ఏదైనా రిస్క్ చేసేముందు ఆలోచించాలి. నిరాశావాదం కలిగి ఉంటారు.

అండర్ లైన్

అండర్ లైన్

సిగ్నేచర్ మొత్తానికి ఒక గీత అండర్ లైన్ లా వేసే అలవాటు ఉన్నవాళ్లు.. వ్యక్తిగత ప్రాధాన్యత కలిగి ఉంటారు.

స్పష్టంగా ఉంటే

స్పష్టంగా ఉంటే

ఒకవేళ సిగ్నేచర్ చేసినప్పుడు దాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా ఉంటే.. వాళ్లు.. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారని సూచిస్తుంది. చాలా ఓపెన్ గా ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడతారు.

కుడివైపుకి ఏటవాలుగా ఉంటే

కుడివైపుకి ఏటవాలుగా ఉంటే

ఒకవేళ సిగ్నేచర్ కుడివైపుకి ఏటవాలుగా ఉంటే.. ఔట్ గోయింగ్ పర్సనాలిటీ కలిగి ఉంటారు.

చివర్లో సమయం ఉంటే

చివర్లో సమయం ఉంటే

సిగ్నేచర్ చేసిన తర్వాత చివర్లో కొంతమంది సమయాన్ని కూడా చేరుస్తారు. ఇలాంటి అలవాటు అవసరం లేని చోటు కూడా ఉంటే.. వాళ్లు.. చాలా స్ట్రాంగ్ పర్సన్ అని, చురుకైన వ్యాపార వేత్త అని సూచిస్తుంది.

English summary

Your signature reveals more about you than your face!

Your signature reveals more about you than your face! So let's have a look at what they think with these 15 handy examples.
Story first published:Tuesday, July 12, 2016, 16:29 [IST]
Desktop Bottom Promotion