ప్రేమకోసం కొంతమంది వ్యక్తులు చేసిన పిచ్చిపనులు

By: Deepti
Subscribe to Boldsky

ప్రేమ ఏ విపరీత పని చేయడానికైనా మనుషులను ప్రేరేపించగలదు. నిజమైన ప్రేమికుడిగా మీ ప్రేమను నిరూపించుకోడానికి మీరు ఏమైనా చేస్తారు, కదా? ఇదిగో, అలానే కొంతమంది వ్యక్తులు చేసిన పిచ్చిపనులు చూడండి.

కొంతమంది జంటలు తమ ప్రేమ నిరూపణలో వారి పిచ్చిని ఏదీ మించలేదని మనకి చూపిస్తూనే ఉంటారు.

వారి ప్రియురాళ్ళకు ప్రేమను నిరూపించటానికి కొంతమంది అబ్బాయిలు చేసిన ఈ వింత పనులను తెలుసుకోండి.

మనచుట్టూ ఉన్నవారే చేసిన ఈ విచిత్ర విషయాలను ఒకసారి చూడండి.

ప్రేమకోసం కొంతమంది వ్యక్తులు చేసిన పిచ్చిపనులు

ప్రేయసి కోసం ఆమె పరీక్షకి హాజరైన యువకుడు!

ఒక పరీక్షలో ప్రేయసి వేషంలో పరీక్ష రాయడానికి వచ్చిన అబ్బాయి దొరికిపోయాడు! అతన్ని విచారించినప్పుడు తను ప్రేమించిన అమ్మాయికి మంచిమార్కులు రావాలనే ఇలా చేసానని తెలిపాడు! పిచ్చిగా అన్పిస్తోంది కదా?

ప్రేమకోసం కొంతమంది వ్యక్తులు చేసిన పిచ్చిపనులు

ప్రేయసికి తన ప్రేమ తెలపటం కోసం ప్రమాదాన్ని సృష్టించిన యువకుడు...

ఈ అబ్బాయి తన ప్రియురాలికి ప్రేమను ఒక సరికొత్త పద్ధతిలో తెలపాలనుకున్నాడు.దానికోసం రచయితలు,కెమెరామెన్, దర్శకులు,ఇంకా మేకప్ మ్యాన్ ,స్టంట్ మ్యాన్ల సాయంతో ఒక ప్రమాద సంఘటనను సినీఫక్కీలో సృష్టించాడు! ఈ సదరు అమ్మాయి ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు,ఆమెకి తన ప్రియుడి శవం కన్పించింది. ఆమె భయం,బాధతో అరవటంతో అతను లేచి ఆమె లేకుండా తాను లేడని నిరూపించాడు.

ప్రేమకోసం కొంతమంది వ్యక్తులు చేసిన పిచ్చిపనులు

ప్రియురాలిలా కన్పించటానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న యువకుడు

ఈ అబ్బాయి ప్రేమ ఎంత విపరీతమైనదంటే తన ప్రేయసిలానే అచ్చం కన్పించాలని ఆపరేషన్లు చేయించుకున్నాడు.ముక్కుమార్పిడి నుంచి ఇతర ఆపరేషన్ల వరకూ, ఆ అమ్మాయి చనిపోయినా కూడా,ఆమెలానే కన్పించాలని ఇంకా సర్జరీలు చేయించుకుంటూనే ఉన్నాడు!

ప్రేమకోసం కొంతమంది వ్యక్తులు చేసిన పిచ్చిపనులు

తన ప్రేమకోసం 6000 మెట్లను చేత్తో చెక్కిన ప్రియుడు!

ఆ అమ్మాయికన్నా అబ్బాయి 10 ఏళ్ళు చిన్నవాడైనా,ఆమెని పిచ్చిగా ప్రేమించాడు.ఇద్దరూ పారిపోయి కొండాకోనల్లో,అక్కడి గుహల్లో 50ఏళ్ళు బ్రతికారు.ఆ సమయంలోనే అతను ఆమె ఆ కొండల్లో ప్రయాణించడానికి వీలుగా 6000 మెట్లను చేత్తో తొలిచాడు! దీన్నే నిజమైన ప్రేమ అంటారు !

ఇలాంటి కథలు ఇంకేవైనా విన్నారా? కామెంట్ సెక్షన్ లో కింద మాతో పంచుకోండి.

English summary

Bizarre Things That People Have Done For The Sake Of Love in Telugu

These are the guys who have done some of the most bizarre things to just prove their love for their partners.
Story first published: Saturday, June 17, 2017, 18:00 [IST]
Subscribe Newsletter