మ‌న దేశంలో అత్యధిక డిగ్రీలున్న‌ వ్య‌క్తి.. మ‌ర్చిపోవ‌ద్దు ఈయ‌న పేరును!

By: sujeeth kumar
Subscribe to Boldsky

42 విశ్వ‌విద్యాల‌యాల నుంచి 20 డిగ్రీ ప‌ట్టాలు పుచ్చుకున్న మ‌హానుభావుడు ... శ్రీ‌కాంత్ జిక‌ర్. అత్యంత విద్యావంతుడు, నైపుణ్యం క‌లిగిన భార‌తీయుడిగా పేరు పొందారు. ఇంత వ‌ర‌కు ఈ ఘ‌న‌త‌ను ఎవ‌రూ సాధించ‌లేదు.

శ్రీ‌కాంత్‌కు 25ఏళ్లు నిండేస‌రికే 14 డిగ్రీలు చేతిలో వ‌చ్చాయి. దీంతో ఆయ‌న‌ పేరును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో న‌మోదు చేశారు.

ఆయ‌న‌ పుచ్చ‌కున్న 20 డిగ్రీ ప‌ట్టాలు ఇవే... వీట‌న్నింటిలోనూ ఆయ‌న‌ ఫ‌స్ట్ క్లాస్‌లో పాస‌వ్వ‌డ‌మే కాదు అనేక రంగాల్లో గోల్డ్ మెడ‌ల్ కూడా సాధించారు.

Can You Believe How Many Degrees He Has?

1. మెడిక‌ల్ డాక్ట‌ర్‌, ఎంబీబీఎస్‌, ఎండీ

2. లా, ఎల్‌.ఎల్‌.బి

3. ఇంట‌ర్నేష‌న‌ల్ లా, ఎల్‌.ఎల్‌.ఎమ్‌

4. మాస్ట‌ర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్‌, డీబీఎమ్‌, ఎంబీఏ

5. బ్యాచిల‌ర్స్ ఇన్ జ‌ర్న‌లిజం

6. ఎం.ఏ. ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌

7. ఎం.ఏ. సోషియాల‌జీ

8. ఎం.ఏ. ఎక‌నామిక్స్‌

9. ఎం.ఏ. సంస్కృతం

10. ఎం.ఏ. హిస్ట‌రీ

11. ఎం.ఏ. ఇంగ్లీష్ లిట‌రేచ‌ర్‌

12. ఎం.ఏ. ఫిలాస‌ఫీ

13. ఎం.ఏ. పొలిటిక‌ల్ సైన్స్‌

14. ఎం.ఏ. ఏంషియంట్ హిస్ట‌రీ, క‌ల్చ‌ర్ అండ్ ఆర్కియాల‌జీ

15. ఎం.ఏ. సైకాల‌జీ

16. డాక్ట‌రేట్ ఇన్ లిట‌రేచ‌ర్ -సాంస్కృతం- విశ్వ‌విద్యాల‌యంలో అత్య‌ధిక డిగ్రీ

17. ఐపీఎస్‌

18. ఐఏఎస్‌

Can You Believe How Many Degrees He Has?

వ్య‌క్తిగ‌త వివ‌రాలు...

సంప్ర‌దాయ మ‌హారాష్ట్ర కుటుంబంలో ఆయ‌న జ‌న్మించారు. స్వ‌స్థ‌లం నాగ‌పూర్‌. ఆయ‌న‌కు స్వ‌యంగా ఒక గ్రంథాల‌యం ఉంది. సుమారు 5వేల పుస్త‌కాల‌తో చాలా పెద్ద‌ది. ఆయ‌నో రాజ‌కీయ‌వేత్త‌. అయినా స‌రే .. ఇవేవీ అడ్డు రాకుండా ఆయ‌న ఎన్నో ప‌ట్టాల‌ను అందుకున్నారు.

Can You Believe How Many Degrees He Has?

రాజ‌కీయ ప్ర‌స్థానం

25ఏళ్ల‌కే శ్రీ‌కాంత్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్ప‌టికే ఆయ‌న 14 శాఖ‌ల‌ను నిర్వ‌ర్తించేవారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా గెలుపొందాక ఆయ‌న‌కు రాష్ట్రంలో మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.

Can You Believe How Many Degrees He Has?

ఇంకా అనేక క‌ళ‌లు

రాజ‌కీయ‌వేత్త కాకుండా మంచి స్టేజ్ ప‌ర్‌ఫార్మ‌ర్‌, ఫొటొగ్రాఫ‌ర్‌, ప్రొఫెష‌న‌ల్ పెయింట‌ర్ కూడా. ఆయ‌న త‌న జ్నానాన్ని త‌న‌కే సొంతం చేసుకోలేదు. ప్ర‌పంచంలో అనేక ప్రాంతాల‌ను సంద‌ర్శించి ఆర్థిక వ్య‌వ‌స్థ, మ‌తం, ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి అద్భుత‌మైన ప్ర‌సంగాలు చేసేవారు.

Can You Believe How Many Degrees He Has?

పాపం 49ఏళ్ల‌కే..

అంత ప్ర‌తిభాశీలి అయిన వ్య‌క్తి త‌న 49వ ఏట ఒక రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందారు. అది 2004వ సంవ‌త్స‌రం జూన్ 2వ తేది. జాతీయ ర‌హ‌దారి నెంబ‌రు 6లో ప్ర‌యాణిస్తుండ‌గా నాగ‌పూర్‌కు స‌మీపంలో ఆయ‌న వెళ్తున్న కారుకు ఎదురుగా వ‌చ్చిన ట్ర‌క్కు ఢీకొన‌డంతో ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆయ‌న కుటుంబానికి ప్ర‌భుత్వం రూ.50.67ల‌క్ష‌లు ప‌రిహారంగా అంద‌జేసింది.

Read more about: life, world, india
English summary

Can You Believe How Many Degrees He Has?

Can you even imagine how many degrees that this man has?
Story first published: Friday, November 10, 2017, 9:00 [IST]
Subscribe Newsletter