చాణక్య నీతి : మీ జీవితంలో సరైన వ్యక్తులను ఎంపిక చేసుకోవడం ఎలా?

Posted By:
Subscribe to Boldsky

మన జీవితంలో వివిధ రకాల మనుషులు వచ్చి వెళుతుంటారు. కొందరు తాత్కాలికంగా వుంటారు కానీ కొంతమంది శాశ్వతంగా గుర్తుండి పోతారు. కొంతమంది మన జీవితంలో సంతోషాన్ని ఇస్తారు మరి కొంతమంది దుఃఖాన్ని మిగల్చవచ్చు. అయితే, ఈ రెండు రకాల వ్యక్తులు కూడా జీవితంలో ముఖ్యం. మన జీవితంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరు ఏదో ఒక అంశానికి దోహదపడతారు. వీరి వల్ల సంతోషంగానీ, ఇబ్బందులుగానీ, సమస్యలుగానీ కొంత కాలమే ఉంటాయి.

మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. ఎవరో ఒకరితో సంబంధాలకు ప్రయత్నిస్తాడు. ఈ బంధాలు మన ఉనికి చాటుకోడానికి చాలా ముఖ్యమైనవి. సమాజంలో మన స్థానాన్ని గుర్తించి, మన ప్రతిబింబాన్ని చూపించే అద్దం లాంటివి.

చాణక్య ప్రకారం మగవారికి ఇవే అత్యంత దురదృష్టకరమైన సందర్భాలు..!!

అన్ని సంబంధాలు విలువైనవి కావు. ఎందుకంటే మన ముందు ఒకలా, వెనుక ఒకలా మాట్లాడతారు. నిజాయితీగా ఉండేవారిని గుర్తించడం చాలా కష్టం. దీని వల్ల స్నేహం లేదా బంధం బలపడటం, విడిపోవడం జరుగుతుంది.

నిజమైన స్నేహితులు గురించి చాణక్యుడు చెప్పిన నగ్న సత్యం. కష్టాల్లో ఉన్నప్పుడు మన వెన్నంటి ఉండి సహాయం చేసేవారు నిజమైన స్నేహితులు. ఇలాంటి వ్యక్తులు ప్రపంచం మారినా మన వెంటే ఉంటారు.

చాణిక్యుడు గొప్ప గురువు, మార్గదర్శి మరియు తత్వవేత్త, తన నీతి ద్వారా రెండు ముఖాలున్నవారి వ్యక్తిత్వాన్ని గుర్తించినప్పుడు ఇంకా సమయం ఉందని సలహా ఇచ్చాడు. ఎలాగో తెలుసుకోవడానికి క్రింద చదవండి ...

1. నిజమైన స్నేహితుల గురించి యూనివర్సల్ ట్రూత్ :

1. నిజమైన స్నేహితుల గురించి యూనివర్సల్ ట్రూత్ :

నిజమైన స్నేహితులు గురించి చాణక్యుడు చెప్పిన నగ్న సత్యం. కష్టాల్లో ఉన్నప్పుడు మన వెన్నంటి ఉండి సహాయం చేసేవారు నిజమైన స్నేహితులు. ఇలాంటి వ్యక్తులు ప్రపంచం మారినా మన వెంటే ఉంటారు.

చాణుక్యుడి ప్రకారం: ఈ 6 లక్షణాలున్న వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు..!!

2. నిజమైన ధైర్యం :

2. నిజమైన ధైర్యం :

యుద్ధ సమయంలో ధైర్యంగల యోధులను, అనుచరులను గుర్తించినట్లే మన వెంట ఉండేవారిని కష్టాల్లో ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు. శత్రు నాశనానికి బయలుదేరి ఆ పని పూర్తయినంత వరకు వెనక్కు రాని వ్యక్తి ధైర్యవంతుడు.

3. ఏకాకి లేదా ఒంటరి తనంతో ఉన్నప్పుడు

3. ఏకాకి లేదా ఒంటరి తనంతో ఉన్నప్పుడు

ఏకాకి లేదా ఒంటరి తనంతో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వ్యక్తులు దాన్ని నుంచి బయటకు లాగడానికి ప్రయత్నించడం సహజం. వాస్తవిక కారణం నుంచి పక్కకు జరిగి మెదడులో అనేక సందేహాలతో తరచూ మన ఆలోచనలు మారిపోతాయి.

4. నిజమైన స్వచ్ఛతకు సూచన

4. నిజమైన స్వచ్ఛతకు సూచన

ఒంటరిగా ఉన్నప్పుడు ఓ వ్యక్తి తన దృష్టిని ఇతర అంశాలకు మళ్లిపోకుండా ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించడమే నిజమైన స్వచ్ఛతకు సూచన. ఇలాంటి వాళ్లే హృదయంలో స్థానం సంపాదించుకుని నిరంతరం ఒకేలా వ్యవహరిస్తారు.

చాణుక్య ప్రకారం : మీరు సక్సెస్ సాధించాలంటే ఈ విషయాల్లో సిగ్గు పడకూడదు!!

5. ద్వేషపూరిత సంబంధాలు

5. ద్వేషపూరిత సంబంధాలు

జీవితంలో స్నేహం ముఖ్యమైందే కానీ, గెలుపోటముల్లో జీవిత భాగస్వామి పాత్ర కీలకం. అతడు లేదా ఆమె మద్దతు నిరంతరం ఉంటే జీవితం అద్భుతంగా సాగుతుంది. జీవిత భాగస్వామి మనలోని ప్రతికూలతలను బయటపెట్టి, ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తారు.

6. ఆర్థికంగా నష్టపోయిన సమయంలో

6. ఆర్థికంగా నష్టపోయిన సమయంలో

ఆర్థికంగా నష్టపోయిన సమయంలో భర్తకు మద్దతుగా నిలిచి ఉంటూ, దాని గురించి ప్రస్తావించని వాళ్లే సరైన వ్యక్తులు.

7. నిజమైన ప్రేమ

7. నిజమైన ప్రేమ

చాణక్యడి ప్రకారం, నిరంతరం జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తూ, అన్ని సమయాల్లోనూ వెన్నంటి ఉండేదే నిజమైన ప్రేమ. ఈ ప్రేమే కోల్పోయిన జీవితాన్ని కూడా మళ్లీ పునర్నిర్మాణం గావిస్తుంది.

English summary

Chanakya Niti: Decode the real side to every person in your life

Decode the real side to every person in your life at the right time, read more about it
Subscribe Newsletter