Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు!
వామ్మో! కత్తితో కనుగుడ్ల షేవింగ్.. జుగుప్సాకర వీడియో విశేషాలు
కటింగ్ షాప్ కు వెళ్లినప్పుడు గెడ్డం, జుట్టు సరైన షేప్ వచ్చేలా చేయించుకుంటాం. ఇందుకు కత్తెర, బ్లేడ్ లేదా ట్రిమ్మర్ వాడతారు. అయితే అదే బ్లేడ్‌తో కళ్లను షేవ్ చేస్తే? వినడానికే వెర్రిగా ఉంది కదూ! కానీ ఇది చైనాలో తరతరాలుగా పాటిస్తున్న ఆచారం. అక్కడ చాలా మంది కటింగ్ చేసేవాళ్లు పనిలో పనిగా కను గుడ్ల షేవింగ్ కూడా చేసేస్తారు. ఈ విధానం ఈ తరం వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
ఒక కటింగ్ షాప్‌లో కను గుడ్లను షేవ్ చేసే వీడియోను ఇంటర్నెట్‌లో పెట్టాక అది వైరల్ అయ్యింది. ఈ వింత వ్యవహారం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు చదవండి....

అసలెందుకిలా చేస్తున్నారు..?
ఈ విధానాన్ని పాటించే ప్రజల నమ్మకం ప్రకారం కళ్లను ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల జీవితపు అందాలు మరింత స్పష్టంగా, అర్థవంతంగా కనిపిస్తుందని ఓక ఊహ. ఈ అందాలను మిస్ కాకుండా ఉండడానికి కొందరు తమ కళ్లను కత్తి కింద పెట్టేందుకు ఏమాత్రం వెనకాడరు.

సనాతన ఆచారం
కనుగుడ్డను, కను రెప్పలను ఇలా కత్తితో శుభ్రం చేయించుకోవడం చైనాలో సనాతన ఆచారం. ఇలా చేసేటప్పుడు పదునైన వస్తువులను వాడతారట.

వారసత్వంగా...
ఇలా కంటిని షేవింగ్ చేయించుకోవడం ఎలా పాపులర్ అయ్యిందంటే... ఝౌ చెంగ్ఫు, ఝౌ చెంగిన్ అనే ఇద్దరు అన్నదమ్ములు తమ నాన్న నుంచి ఈ టెక్నిక్‌ను నేర్చుకున్నారు. నేర్పుగా కనుగుడ్లను, చెవులను, మెడలను శుభ్రం చేస్తారు వీళ్లు

వైరల్ అయ్యింది ఇలా..
ఈ వీడియోను చూసిన చాలా మంది ఇంత వెర్రి విధానంలో తమ కళ్లను ఎలా శుభ్రం చేయించుకుంటారని ఆశ్చర్యచకితులయ్యారు. ఈ విధానానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. మురికి చేతులతో అలాగే కళ్లను శుభ్రం చేయడం చూసి ఇంటర్నెట్ లో దీన్ని బాగా షేర్ చేశారు. కనురెప్పల కింద షేవ్ చేయడాన్ని వీడియోలో స్పష్టంగా చూడగలిగారు. ఇలా వీడియో వైరల్ అయ్యింది.

వ్యాపారం బాగా నడుస్తుందట!
కంటిని షేవ్ చేసేవారు తక్కువే వసూలు చేస్తారట. అయితేనేం తమ వ్యాపారం అద్భుతంగా నడుస్తుందని చెప్తారు. పాత కస్టమర్లు రెగ్యులర్‌గా రావడమే కాదు కొత్త కస్టమర్లు కూడా ఈ అనుభూతిని పొందేందుకు క్యూ కడతారట! విడ్డూరం కదూ!

ఎలా చేస్తారు?
ఒక నివేదిక ప్రకారం గెడ్డం గీసేందుకు వాడే కత్తినే కను గుడ్లను షేవ్ చేసేందుకూ వినియోగిస్తారట. అదే నీళ్లతో వాటిని కడుగుతారట. ఎడమ చేతితో కస్టమర్ల కళ్లను బాగా తెరిచి కుడి చేత్తో కత్తిని ముందుకు వెనకకు జరుపుతూ కన్ను లోపల షేవ్ చేస్తారట. ఆ తర్వాత కనుగుడ్డుపైనా ఇలా చేస్తారట. ఊహిస్తున్న మనకే నొప్పి పుడుతోంది కదా! మరి చేయించుకునే వాళ్లకెలా ఉంటుందో!

ఇంతటితో ఆగిపోరు
ఇలా కళ్లను షేవ్ చేసేవారు ఒక లోహపు కడ్డీ తీసుకొని పై కనురెప్పను బాగా తెరిచి కడ్డీతో కుచ్చుతాడు. అటూ ఇటూ దాన్ని జరుపుతాడు. ఆ తర్వాత కింది కను రెప్పను పట్టుకొని అదే విధంగా కడ్డీతో కారు వైపర్ చేసిన మాదిరిగా చేస్తాడట. ఆ తర్వాత ఇదే విధానాన్ని మరో కంటికి చేస్తారట. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 5 నిమిషాలు పడుతుందట. ఇది ముగిశాక చేయించుకున్నవారి కళ్ల నిండా నీళ్లు ధారగా కారతాయిట.
మీరు కూడా ఇలాంటి భయంకరమైన షేవింగ్ చేయించకొనే సాహసం చేయాలనుకుంటున్నారా? వామ్మో మనకెందుకంటారా.. తలచుకుంటేనే జుగుప్సాకరంగా ఉంది కదూ! దీని పై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి.



Click it and Unblock the Notifications