చనిపోతూ ఓ యువకుడు ఈ ప్రపంచానికి ఇచ్చిన బలమైన సందేశం

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఈ వ్యాసం ఓ 24 సంవత్సరాల యువకుడు తాను ఇక ఎక్కువ రోజులు బ్రతకనని తెలిసి రాసిన ఒక అద్భుత జీవన విధానం. అతడు ఈ వ్యాసం లో ఇచ్చిన సలహాలు మన జీవితాలను ఇంకా బాగా మెరుగు పరుచుకోవడానికి దోహదపడతాయి, ప్రేరేపిస్తాయి.

" నా వయస్సు 24 సంవత్సరాలు, కానీ దురదృష్టవశాత్తు నేను నా జీవితంలోని చివరి దశలో ఉన్నాను. నేను ఇప్పుడు ఒక టై ధరించి ఉన్నాను, అది నేను వేసుకున్న సూట్ కి అంతగా నప్పకపోవచ్చు. కానీ మరికొద్ది రోజుల్లో జరిగే నా అంత్యక్రియలకు ఖచ్చితంగా సరితూగేలా ఉందని భావిస్తున్నాను.

ఓరల్ సెక్స్ తో ఎయిడ్స్ కన్నా వేగంగా వ్యాపిస్తున్న హెచ్ పివి..!

నాకు కాన్సర్ అనే వ్యాధి ఉందనే విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కనీసం నేను ఎలాగోలా ఈ వ్యాధి భారీ నుండి తప్పించుకొని బ్రతుకుతాను అనే ఆశ లేకుండా చేసింది. కానీ నేను మరణం గురించి తెలుసుకున్న అతిముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం బ్రతికున్నపుడు చేసే మంచి పనుల వల్ల, మనం పోయిన తర్వాత మనం ఉన్నప్పటి కంటే ఈ ప్రపంచం మరింత బాగుండాలి. నేను ఇప్పటి వరకు జీవించిన నా జీవితం వల్ల ఎంటు వంటి ఉపయోగం లేదు. సంక్షిప్తంగా చెప్పాలంటే, నేను ఇంత వరకు ప్రభావితం చేసే పనిని నా జీవితంలో చేయలేకపోయాను.

true story

కథలు :

ఇంతక ముందు నా మెదడు అనేక అంశాలతో నిండిపోయి ఉండేది. ఇన్ని విషయాలు అమలుపరచడానికి నాకు ఎంత సమయం ఉంది అని ఆలోచిస్తే, అప్పుడు నేను ఎంచుకున్న విషయాల్లో ఏది అతి ముఖ్యమైనది అనే విషయం వెలుగులోకి వచ్చింది. నాలో ఉన్న స్వార్ధపు ఆలోచన ఇది రాయడానికి ప్రేరేపించింది. నా జీవితానికి అర్ధం ఉండాలి ఉద్దేశ్యంతోనే నా ఆలోచనలను మీతో పంచుకుందామని నిశ్చయించుకున్నాను.

మీకు నచ్చని పని, మీరు ఆనందించని పని చేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీకు నచ్చని పనులు చేయటం వల్ల మీరు అందులో విజయం సాధించలేరు. అది జగమెరిగిన సత్యం. ఓపిక, అంకితభావం మరియు అభిరుచి మీరు చేసే పని పై ఎప్పుడు కలుగుతాయంటే, మీరు ఆ పనిని ప్రేమించినప్పుడే.

true story

వేరే వాళ్ళ అభిప్రాయాలను విని మీరు భయపడనవసరం లేదు, అది మూర్ఖులు చేసే పని. భయం మిమ్మల్ని బలహీన పరుస్తుంది, ఏ పని చేయనివ్వదు. దాన్ని అలానే మీరు వదిలిస్తే పరిస్థితి మరింత దిగజారిపోతోంది. రోజురోజుకి మరింత క్షిణించి మీకంటూ ఏమి మిగలకుండా పోతుంది. ఓ జీవత్సవంలా మారిపోతారు. మీ ఆత్మసాక్షి ఏమి చెబుతుందో వినండి. అందుకు అనుగుణంగా నడుచుకోండి. ఇలా చేస్తున్నప్పుడు కొంత మంది మిమ్మల్ని తక్కువ చేసి చూడవచ్చు, కానీ మరికొంత మంది మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా భావిస్తారు.

మీ జీవితాన్ని మీ నియంత్రణలో ఉంచుకోండి . మీ జీవితంలో జరిగే అన్ని విషయాలకు పూర్తి భాద్యతను మీరే తీసుకోండి. చెడ్డ అలవాట్లకు దూరం గా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించండి. మీకు ఇష్టమైన ఆటను ఆడటం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. మన లో చాలామంది అన్ని విషయాలను సాగదీస్తుంటారు, అలా చేయకండి.మీ జీవితం మీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉండాలి లేదంటే, మీరు తీసుకోని నిర్ణయాలకు బలైపోతారు.

true story

మీ చుట్టూ ఉన్న వాళ్ళని అభినందించండి. మీ స్నేహితులు మరియు బంధువులు మీకెప్పుడు వెన్నంటి ఉండి ఒక బలంగా ఉంటారని గ్రహించండి. వాళ్ళు ఎప్పుడు మీ పై ఎనలేని ప్రేమ కురిపిస్తారు. అందుకే వాళ్లతో మీరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకండి.

నా భావాలను ఈ అతి సాధారణ పరిపూర్ణ విషయాల గురించి పూర్తిగా వ్యక్తపరచాలంటే చాలా కష్టంగా ఉండి. కానీ సమయం విలువ తెలిసిన వాళ్లు, వాళ్ళ జీవితానుభవాన్ని మీకు చెప్పినప్పుడు మీరు వింటారని నేను ఆశిస్తున్నా.

true story

నేను ఇప్పుడు ఏమి కృంగిపోవడం లేదు. ఎందుకంటే, నా జీవితంలోని చివరి రోజులు ఎంతో అర్ధవంతమైనవని నేను భావిస్తున్నాను. నేను ఎందుకు చింతిస్తున్నానంటే, భవిష్యత్తులో నేను నాకు ఇష్టమైన విషయాలను చూడలేనని కొద్దిగా వెలితిగా ఉంది. త్వరలోనే సిరియా, ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం ఆగిపోతుందని ఆశిస్తున్నాను.

ప్రొస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ను నివారించడం ఎలా..?

మనం మరణించే వరకు మన ఆరోగ్యాన్ని గురించి, శరీరంలోని సమగ్రత గురించి ఎంతగానో జాగ్రత్తలు తీసుకుంటాము. కానీ మన శరీరం కూడా ఒక డబ్బాతో సమానం అనే విషయాన్ని గ్రహించాలి. ఆ డబ్బాలో మన వ్యక్తిత్వం, ఆలోచనలు, నమ్మకాలు, ఉద్దేశ్యాలు నిక్షిప్తమయ్యి ఉన్నాయి. వాటిని వ్యక్తపరచడానికి ఈ ప్రపంచం లోకి వచ్చాము. ఈ ప్రపంచాన్ని మార్చే విధంగా ఆ డబ్బాలో ఏమి లేకపోతే అది కనుమరుగయిపోయినా ఎవ్వరు పట్టించుకోరు. మనందిరిలో ఎంతో శక్తి దాగి ఉంది, కానీ అది ఉంది అని మనం గ్రహించాలంటే మనలో ఎంతో ధైర్యం ఉండాలి అని నా గట్టి నమ్మకం.

జీవితంలో సృష్టించబడ్డ పరిస్థుతుల వల్ల ప్రతి ఒక్కరు వాటిని ఎదుర్కోవడం నేర్చుకుంటారు. గంటలు, రోజులు ఇలా గడిచే కొద్దీ మీరు నమ్మినదాని కోసం పోరాడుతారు. ఇలా చేయడం వల్ల మీ జీవితం ఓ సరికొత్త గొప్ప జీవితకథ గా లిఖించబడుతుంది. మీరందరూ సరైన నిర్ణయం తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది.

మీ ప్రత్యేకత ఎంతో ఈ ప్రపంచానికి తెలియజేయండి. మీ జీవితానికి ఒక అర్ధం ఉంటుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఈ లోకానికి తెలియజేయండి. దానికోసం ప్రయత్నించండి. మనం ఉంటున్న ఈ లోకం ఒక అందమైన ఆట స్థలం. ఎందుకంటే ఇక్కడ అసాధ్యం కానిదంటూ ఏది లేదు. కాకపోతే మనం ఎప్పుడు ఎప్పటికి ఇక్కడే ఉండిపోలేము.

ఈ అందమైన ప్రపంచంలో మన జీవితం అనేది ఒక చిన్న వెలుగు లాంటిది. విపరీతమైన వేగంతో అంతు చిక్కని విశ్వంలో దాగి ఉన్న చీకటిలోకి ప్రయాణిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న కొద్దిసేపు ఆ సమయాన్ని మీ అభిరుచికి తగ్గట్టుగా ఆనందించండి, ఆశక్తికరంగా మీ జీవితాన్ని మార్చుకోండి. చివరిగా మీరు ఉన్నా లేకపోయినా మీకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకోండి. అప్పుడు మీ విలువ ఎప్పటికి తగ్గిపోదు.

ధన్యవాదములు. "

All Images Are For Illustration Purposes Only.

Source.

English summary

Dying Man's Only Advice To The World

He knew his end was near, so he had only 1 advice to the world.
Story first published: Thursday, August 17, 2017, 20:00 [IST]
Subscribe Newsletter