ఆశ్చర్యం: ఈ ఎనిమిదేళ్ల అమ్మాయి గుండె శరీరం బయట కొట్టుకుంటుంది

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఈ ప్రపంచంలో ఎన్నో ఆరోగ్య సమస్యలతో ప్రజలు బాధపడుతుంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ ఆరోగ్య పరిస్థితిని చూసి అవాక్కవ్వాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో అయితే ఆ వ్యక్తి ఇన్ని రోజులు అలా ఎలా బ్రతకగలుగుతున్నాడు అని ఆశ్చర్యపోతారు కూడా. కానీ బాధలను అధిగమించి జీవితాన్ని జీవిస్తున్న వారందరిని చూసినప్పుడు అది మనలో ఎంతో స్ఫూర్తిని నింపుతుంది.

ఇప్పుడు మనం ఓ ఎనిమిదేళ్ల అమ్మాయి నిజజీవిత గాథను తెలుసుకోబోతున్నాం. ఈమె ఒక అరుదైన అనారోగ్య స్థితి వల్ల విపరీతంగా బాధపడుతుంది, అదేమిటంటే ఆమె గుండె శరీరం బయట కొట్టుకుంటుంది.

ఈ నాటి కపుల్ చేస్తున్న అసహ్యకరమైన..ఫోటోలు..వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి..

ఈ అమ్మాయి పేరు విర్సావియా. ఆమె యొక్క ప్రత్యేకమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమె వయస్సు ఎనిమిది సంవత్సరాలు మాత్రమే :

ఆమె వయస్సు ఎనిమిది సంవత్సరాలు మాత్రమే :

విర్సావియా అనే ఈ అమ్మాయి వయస్సు కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే " థొరాకో అబ్డోమినల్( ఉదర ) సిండ్రోమ్ లేదా ప్యాంటాలజి ఆఫ్ క్యాన్ట్రేల్ " అనే ఓ అరుదైన అనారోగ్య స్థితితో బాధపడుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితి 10 లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఉంటుంది.

మిగతా ఎనిమిదేళ్ల చిన్నరుల్లాగానే ఈ పాపా కూడా :

మిగతా ఎనిమిదేళ్ల చిన్నరుల్లాగానే ఈ పాపా కూడా :

మిగతా ఎనిమిదేళ్ల వయస్సున్న అమ్మాయిల్లాగానే విర్సావియా కూడా అన్ని ఆలోచనలు ఉంటాయి. ఆమెకు నృత్యం చేయడం, చిత్రలేఖనం మరియు గుర్రాలు అంటే ఎంతో ఇష్టం. కానీ ఆమె ఒక అరుదైన స్థితి వల్ల విపరీతంగా బాధపడుతుంది అని మీరు గుర్తించినప్పుడు అది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఆ చిన్న అమ్మాయికి ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. అదేమిటంటే పుట్టినప్పటి నుండి ఆమె గుండె శరీరం బయట ఉంది. కానీ ఆమె తన జీవితాన్ని ఎంతో దైర్యంగా జీవిస్తుంది.

ఆమె వీడియో ఒకటి వైరల్ గా మారింది :

ఆమె వీడియో ఒకటి వైరల్ గా మారింది :

ఈ చిన్న అమ్మాయి ఎంతో ముద్దుగా నవ్వుతూ మరియు ఆ సమయంలో ఎంతో కష్టపడి గుండె తన శరీరం బయట కొట్టుకుంటున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియో చుస్తే చాలామంది కలత చెందే అవకాశం ఉంది. కానీ, ఆ వీడియో చూసినప్పుడు మాత్రం ఎలా ఈ అందమైన అమాయకపు చిన్నారి ఎంత ఆనందంగా ఉల్లాసంగా జీవిస్తుంది అని అనిపించక మానదు.

తనను తాను అత్యుత్తమం గా పేర్కొంటుంది ఈ అమ్మాయి :

ఒకానొక ఇంటర్వ్యూ లో ఈ అమ్మాయి ఏమని చెప్పుకొచ్చిందంటే " ఇది నా గుండె. ఇలా నాకు మాత్రమే ఉంది. నేను చాలా మృదువైన బట్టలు వేసుకుంటాను. ఎందుకంటే, నా గుండెకు ఏమి కాకూడదు కదా. నేను అటు ఇటు తిరుగుతాను, ఎగురుతాను, గెంతుతాను, పరిగెత్తుతాను. మాములుగా నా వింత పరిస్థితి దృష్ట్యా అలా చేయకూడదు. కానీ, నాకు పరిగెత్తడం అంటే ఇష్టం. "

ఇంత దైర్యంగా జీవితాన్ని జీవిస్తున్న ఈ అమ్మాయికి జీవితంలో అదృష్టం కలిసి రావాలని ఆశిద్దాం మరియు ఆమె ఆత్మవిశ్వానికి ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే.

English summary

An 8-Year-Old Whose Heart Beats Outside Her Body

Here is a story of an 8-year-old girl who is suffering from a rare condition in which her heart beats outside her body.
Story first published: Saturday, September 30, 2017, 9:00 [IST]
Subscribe Newsletter