For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చరిత్రలో ఎక్కువ ఇష్టపడిన విలన్ గా రావణుడు ఎందుకు నిలిచిపోయాడో తెలుసుకోండి !

|

సీతమ్మని అపహరించి విష్ణుమూర్తి ఏడవ అవతారమైన,భగవాన్ శ్రీరాముడి చేతిలో యుద్ధంలో ఓడిపోయిన రాక్షసుడిగా రావణుడు అందరికీ తెలుసు. రావణుడు లంకలో జరిగిన యుద్ధంలో రాముడి చేతిలో ఓడిపోయాడు.

చెడుపై మంచి గెలిచినందుకు ప్రతీకగా దసరా పండగను జరుపుకుంటారు. అలా రావణుడు హిందూ పురాణాలలో ముఖ్య పాత్రగా నిలిచిపోయాడు. రావణుడు విలన్ లాగానే మిగిలిపోయాడు కానీ అతని గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈరోజు తెలుసుకుందాం.

సాధారణంగా రావణుడిని చెడు లేదా దుష్టాత్మగానే పరిగణిస్తాం కానీ వివిధ కథల ప్రకారం హిందూ పురాణాలలో ఎక్కువగా కీర్తింపబడ్డ విలన్ గా రావణుడినే చెప్తారు. హిందూ దేవతలను మనం కూడా అన్వయించుకోగలం మరియు వారి మంచి గుణాలను మనం కూడా అర్థం చేసుకుని నేర్చుకోవాలనుకుంటాం. అలానే, రావణుడు కూడా మొత్తంగా చెడ్డవ్యక్తేం కాదు. అతనిలో కూడా ఉన్న చాలా మంచి గుణాలు అతన్ని కేవలం రాక్షసుడిగానే చరిత్రలో నిలిచిపోనివ్వలేదు.

అయితే, ఇదిగో చరిత్రలో రావణుడు అందరికీ ఇష్టమైన విలన్ గా ఎందుకు నిలిచిపోయాడో తెలుసుకోండి....

1. ఒకసారి రావణుడు భగవాన్ శ్రీరాముడి కోసం యజ్ఞం చేసాడు

1. ఒకసారి రావణుడు భగవాన్ శ్రీరాముడి కోసం యజ్ఞం చేసాడు

హిందూ పురాణాలు, ప్రాచీనకథల ప్రకారం రావణుడు ఒకసారి రాముడి కోసం యజ్ఞం చేసాడు. రాముడి సైన్యం లంకకి వంతెన కట్టాలనుకున్నప్పుడు వారికి పరమశివుని ఆశీర్వాదం కోసం యజ్ఞం చేయాలనుకున్నారు. పరమశివుడికి రావణుడు మహాభక్తుడు కాబట్టి అతనే యజ్ఞం చేయాలని నిర్ణయించారు. హుందాను నిలబెట్టుకుని రావణుడు నిజంగానే వచ్చి రాముడికి తన ఆశీర్వాదం అందించాడు.

2. రావణుడు లక్ష్మణుడికి జ్ఞానోపదేశం చేసాడు

2. రావణుడు లక్ష్మణుడికి జ్ఞానోపదేశం చేసాడు

మనందరికీ తెలిసిందే ఆ యుగంలో అందరికన్నా విద్యావంతుడు, మేధావి రావణుడే. రాముడు ఒకసారి లక్ష్మణుడిని రావణుడి పక్కన కూర్చొని, రాజ్యపాలన్, వ్యవహార పద్ధతులను తెలుసుకోమని చెప్పాడు. జ్ఞానవంతుడైన రావణుడు శత్రువని కూడా చూడకుండా తన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోటానికి ఆనందంగా సిద్ధపడ్డాడు.

3. గ్రహస్థితులను మార్చటం

3. గ్రహస్థితులను మార్చటం

తన కొడుకు మేఘనాథుడు పుట్టిన సమయంలో రావణుడు తన బిడ్డ జాతకచక్రంలోని 11 వ ఇంట్లో అన్ని గ్రహాలు ఉండాలని సూచించాడు. ఈ ఆదేశం పాటించక శని 12 వ ఇంట్లో ఉన్నాడు. దీని వల్ల ఆగ్రహం చెంది రావణుడు శనిపై దాడి చేసి బంధించాడు కూడా. రాక్షసరాజు రావణుడు ఎంత బలవంతుడంటే గ్రహస్థితులను కూడా మార్చే శక్తి కలవాడు.

4. తన పేరు శివుడి నుంచి వచ్చింది

4. తన పేరు శివుడి నుంచి వచ్చింది

రావణుడు పరమశివుడ్ని కైలాసపర్వతం వదిలి లంకలో నివసించాలని ఆశించి, ఆ పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు.కానీ శివుడు తన పాదాన్ని గట్టిగా పర్వతంపై ఉంచటంతో రావణుడి వేలు కూడా చితికిపోయింది. బాధతో కోపం వచ్చిన రావణుడు శివతాండవం చేసాడు. ఎంత బాధలో ఉన్నాడంటే, తనలోంచి నరాలను బయటకి తీసి మెడలో వేసుకుని మరీ నృత్యం చేసాడు. మహాదేవుడు అతని భక్తిని మెచ్చి రావణుడు అని పేరుపెట్టాడు. రావణుడు అంటే పెద్దగా అరిచేవాడు.

5. నాలుగు వేదాలలో పండితుడు

5. నాలుగు వేదాలలో పండితుడు

చరిత్ర, పురాణాల ప్రకారం, రావణుడు సామాన్యమైన వ్యక్తి కాదని ఇప్పటికే అర్థమై ఉంటుంది.రావణుడు తన తండ్రి విశ్రవుడు శిష్యరికంలో జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత పవిత్రమైన నాలుగు వేదాలలో పాండిత్యం సంపాదించాడు. ఇలా రావణుడు పెద్ద పండితుడని నిర్ధారణ అయిపోయింది.

6. మంచి పాలకుడు

6. మంచి పాలకుడు

వాల్మీకి రామాయణం ప్రకారం, రావణుడు గొప్ప రాజని తెలుస్తోంది.సమర్థవంతమైన పాలకుడిగా తన రాజ్యపాలనలో లంకను బంగారులంకగా మార్చాడు.లంక చరిత్రలోనే ఇది స్వర్ణయుగంగా గుర్తించబడింది. కథనాల ప్రకారం రావణుడు అన్ని విషయాల పట్ల శ్రద్ధ తీసుకునే మహారాజుగా పేరొందాడు. తన పాలనలో మేటి శిల్పి విశ్వకర్మ ఆధ్వర్యంలో లంక నిర్మించబడింది.

7. రావణుడు మరియు అతని సోదరుడు కుంభకర్ణుడు విష్ణుమూర్తి ద్వారపాలకుల అవతారాలు

7. రావణుడు మరియు అతని సోదరుడు కుంభకర్ణుడు విష్ణుమూర్తి ద్వారపాలకుల అవతారాలు

హిందూ పురాణాల ప్రకారం రావణుడు మరియు అతని సోదరుడు కుంభకర్ణుడు నిజానికి విష్ణుమూర్తి ద్వారపాలకుల అవతారాలే. జయవిజయులైన వీరు తమ గర్వంతో బ్రహ్మ మానసపుత్రులు ఒకసారి విష్ణుమూర్తిని కలవడానికి వస్తే, వారిని నగ్నంగా ఉన్న పిల్లలని గేలిచేసారు. దాంతో ఆగ్రహించిన ఆ మునులు జయవిజయులు విష్ణుమూర్తి వల్లనే విడగొట్టబడతారని శపిస్తారు. అందుకని వారి మూడు జన్మలలో ఒకటిగా రావణ-కుంభకర్ణులలాగా త్రేతాయుగంలో జన్మించారు.

English summary

Here's Why Ravana Is Known As The Most Loving Villain In History

Ravana is regarded as a bad or evil spirit, but legends have said that Ravana is the most loved villain in the history of Hindu mythology. Hindu gods are relatable and the good qualities in them are something we all need to learn, understand and grasp as well. Similarly, Ravana is not all black, he had many good qualities.
Story first published: Tuesday, December 5, 2017, 9:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more